భరతమాత విముక్తికి 75 ఏళ్లు.. ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ను ప్రారంభించననున్న ప్రధాని మోదీ

బ్రిటిష్‌ దాస్యశృంఖలాల నుంచి భరతమాత విముక్తి పొంది ఈ ఏడాదికి 75 ఏళ్లు పూర్తపూర్తవుతోంది. ఈ నేపథ్యంలో నేటి నుంచి ఆగస్టు 15 వరకు ఆజాదీ అమృత్‌ మహోత్సవ్‌(స్వతంత్రానికి అమృత్‌ మహోత్సవం) పేరుతో..

భరతమాత విముక్తికి 75 ఏళ్లు.. ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ను ప్రారంభించననున్న ప్రధాని మోదీ
PM Narendra Modi
Follow us

|

Updated on: Mar 12, 2021 | 8:16 AM

బ్రిటిష్ దాస్యశృంఖలాల నుంచి భరతమాత విముక్తి పొంది ఈ ఏడాదికి 75 ఏళ్లు. ఈ నేపథ్యంలో నేటి నుంచి ఆగస్టు 15 వరకు ఆజాదీ అమృత్‌ మహోత్సవ్‌(స్వతంత్రానికి అమృత్‌ మహోత్సవం) పేరుతో దేశవ్యాప్తంగా వేడుకలు నిర్వహించాలని ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయించారు. కార్యక్రమాల్లో భాగంగా దండి మార్చ్ స్మారక మార్చ్ ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. గుజరాత్ అహ్మదాబాద్ లోని అభయ్ ఘాట్ సమీపంలోని గ్రౌండ్ నుంచి దీన్ని ప్రారంభించనున్నారు. మాజీ ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ సమాధి అయిన అభయ్ ఘాట్ సబర్మతీ ఆశ్రమం దగ్గర్లోనే ఉండడం విశేషం. ఈ మార్చ్ 21 రోజుల పాటు కొనసాగనుంది. స్వతంత్రానికి పూర్వం దండి మార్చ్ ప్రారంభించిన తేదీ మార్చి 12న దాని స్మారకంగా ఈ మార్చ్ ప్రారంభిస్తున్నారు.

బ్రిటిష్ వారి నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా అహింసాయుతంగా స్వాతంత్రోద్యమం సాగింది. దండి మార్చ్ లేదా ఉప్పు సత్యాగ్రహాన్ని మహాత్మా గాంధీ సారధ్యంలో 1930లో మార్చి 12న ప్రారంభించారు. ఈ మార్చ్ ని గుజరాత్ లోని దండి ప్రాంతంలో ప్రారంభించి, ఏప్రిల్ 15 వరకూ 24 రోజుల పాటు దీన్ని కొనసాగించారు. ఆ తర్వాత అక్కడికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధరాసన సాల్ట్ వర్క్స్ కి గాంధీజీ బయల్దేరగా ఆయనను మే 5న బ్రిటిష్ వారు అరెస్ట్ చేశారు.

తాజాగా నిర్వహించే దండి మార్చిలో భాగంగా 1930 దండి మార్చ్ లో పాల్గొన్న వారు లేదా వారి కుటుంబ సభ్యులను సన్మానించబోతున్నామని గుజరాత్ క్రీడా శాఖ మంత్రి ఈశ్వర్ సిన్హ్ పటేల్ తెలిపారు. ఆ తర్వాత జరిగే 386 కిలోమీటర్ల నడకలో వారు పాల్గొనే వీలు ఉండకపోవచ్చు. దానికి వారి వయసు సహకరిస్తే వారు నడుస్తారు. అయితే ఈ మార్చ్ లో 81 మంది వాకర్స్ పాల్గొనబోతున్నారు. ఇందులో డాక్టర్లు, బిజినెస్ మెన్, క్రీడాకారులు, కోచ్ లు, మారథాన్ రన్నర్స్, ఫార్మా ఎగ్జిక్యూటివ్స్ వంటి వివిధ రంగాల ప్రొఫెషనల్స్ ఉండబోతున్నారని చెప్పారు.

నాటి దండి మార్చ్ లో మహాత్మా గాంధీ ఆయనతో పాటు పాల్గొన్న 78 మంది, మధ్యలో కలిసిన మరో ఇద్దరు ఇతరులకు గుర్తుగా అదే సంఖ్యలో ఇప్పుడు కూడా నడవనున్నారు. ఇవే కాదు.. మహాత్మా గాంధీ జన్మస్థలం పోరు బందర్, రాజ్ కోట్, వడోదర, బర్దోలీ (సూరత్), మాండ్వీ (కచ్), దండి (నవ్సారీ)లో, అలాగే 1930లో గాంధీజీ విశ్రాంతి తీసుకున్న 75 స్థలాల్లోనూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దండి మార్చ్‌ సాగే 21 ప్రదేశాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ 21 రోజుల్లో ప్రతి రోజూ కొందరు చొప్పున రాజకీయ నాయకులు కూడా ఈ నడకలో పాల్గొంటారు. రోజూ ఇరవై కిలోమీటర్ల చొప్పున నడవాలని నిర్ణయించారు. ప్రతి పది మందికి ఒక ఫిట్ నెస్ కోచ్ అందుబాటులో ఉంటారు.

అయితే తాత్కాలిక షెడ్యూల్ ప్రకారం ముందు ప్రధానమంత్రి సబర్మతీ ఆశ్రమంలో సబర్మతీ ఆశ్రమ్ ప్రిజర్వేషన్ అండ్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కొనసాగుతోన్న హృదయ కుంజ్ ని సందర్శిస్తారు. అనంతరం అభయ్ ఘాట్ కి చేరుకుంటారు ప్రధాన మంత్రి మోదీ. అక్కడ జరిగే కార్యక్రమంలో పాల్గొని జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఇక్కడ ఒక గంట సేపు గడిపిన తర్వాత మోదీ తిరిగి దిల్లీకి వెళ్లనున్నారు.

Read More:

పాలకుర్తి సోమేశ్వరాలయంలో ఎర్రబెల్లి దంపతుల ప్రత్యేక పూజలు.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో దేవాలయాలకు పూర్వవైభవమన్న మంత్రి

అతన్ని గుడ్డిగా నమ్మింది.. అందువల్లే సిల్క్ స్మిత బలైంది..
అతన్ని గుడ్డిగా నమ్మింది.. అందువల్లే సిల్క్ స్మిత బలైంది..
హెయిర్ స్టైల్ మార్చిన కోహ్లీ.. ఆర్‌సీబీ లక్ మార్చేస్తాడా?
హెయిర్ స్టైల్ మార్చిన కోహ్లీ.. ఆర్‌సీబీ లక్ మార్చేస్తాడా?
జున్ను తింటే ఆ వ్యాధులన్నీ మటాష్‌.. పరిశోధనల్లో వెల్లడి
జున్ను తింటే ఆ వ్యాధులన్నీ మటాష్‌.. పరిశోధనల్లో వెల్లడి
జూలై 1 నుంచి సిమ్‌కార్డుపై కొత్త నిబంధనలు.. అవేంటో తెలుసా?
జూలై 1 నుంచి సిమ్‌కార్డుపై కొత్త నిబంధనలు.. అవేంటో తెలుసా?
జూ పార్కులో 125 ఏళ్ల రాక్షసుడు అనార్యోగంతో మృతి.!
జూ పార్కులో 125 ఏళ్ల రాక్షసుడు అనార్యోగంతో మృతి.!
అతడే నా హీరో.. చాలా అందంగా ఉంటాడు, మహేశ్ మూవీపై రాజమౌళి రియాక్షన్
అతడే నా హీరో.. చాలా అందంగా ఉంటాడు, మహేశ్ మూవీపై రాజమౌళి రియాక్షన్
వీడో పిట్టల దొర.. వినేవారుంటే గంటలు తరబడి కథలు చెబుతూనే ఉంటాడు.
వీడో పిట్టల దొర.. వినేవారుంటే గంటలు తరబడి కథలు చెబుతూనే ఉంటాడు.
IPL 2024: ఆగస్ట్‌లో రిటైర్మెంట్.. కట్‌చేస్తే 6 నెలల్లోనే యూటర్న్
IPL 2024: ఆగస్ట్‌లో రిటైర్మెంట్.. కట్‌చేస్తే 6 నెలల్లోనే యూటర్న్
మీకూ విపరీతంగా చెమటలు పడుతున్నాయి? జాగ్రత్త..
మీకూ విపరీతంగా చెమటలు పడుతున్నాయి? జాగ్రత్త..
వారెవ్వా..! ఏం వయ్యారం.. జై చిరంజీవ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్..
వారెవ్వా..! ఏం వయ్యారం.. జై చిరంజీవ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్..
జూ పార్కులో 125 ఏళ్ల రాక్షసుడు అనార్యోగంతో మృతి.!
జూ పార్కులో 125 ఏళ్ల రాక్షసుడు అనార్యోగంతో మృతి.!
వీడో పిట్టల దొర.. వినేవారుంటే గంటలు తరబడి కథలు చెబుతూనే ఉంటాడు.
వీడో పిట్టల దొర.. వినేవారుంటే గంటలు తరబడి కథలు చెబుతూనే ఉంటాడు.
రెస్టారెంట్‌లో భోజనం చేస్తున్న కుటుంబం.. వారి కళ్లముందే క్షణాల్లో
రెస్టారెంట్‌లో భోజనం చేస్తున్న కుటుంబం.. వారి కళ్లముందే క్షణాల్లో
సముద్ర మార్గంలో సాయం.. గాజాకు 200 టన్నుల ఆహారం.
సముద్ర మార్గంలో సాయం.. గాజాకు 200 టన్నుల ఆహారం.
డేంజర్ అలర్ట్.! భూమికి దగ్గరగా భారీ గ్రహశకలం.. అప్రమత్తమైన నాసా.!
డేంజర్ అలర్ట్.! భూమికి దగ్గరగా భారీ గ్రహశకలం.. అప్రమత్తమైన నాసా.!
ఇద్దరు మనుషులు.! రెండే కాళ్లు.. 22 ఏళ్లుగా సాగుతున్న జీవనం.
ఇద్దరు మనుషులు.! రెండే కాళ్లు.. 22 ఏళ్లుగా సాగుతున్న జీవనం.
ఫోన్ కోసం చంపేశారు.! విదేశీ మహిళ హత్య.. అదుపులో నిందితులు.
ఫోన్ కోసం చంపేశారు.! విదేశీ మహిళ హత్య.. అదుపులో నిందితులు.
తెల్ల జుట్టు నల్లగా మార్చడానికి హెన్నా అవసరం లేదు.. ఈ ఒక్కటి చాలు
తెల్ల జుట్టు నల్లగా మార్చడానికి హెన్నా అవసరం లేదు.. ఈ ఒక్కటి చాలు
ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగండి.. దీని లాభాలు చూస్తే షాకవుతారు.!
ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగండి.. దీని లాభాలు చూస్తే షాకవుతారు.!
ఎలక్షన్ కోడ్ వస్తే ఏం చెయ్యచ్చు.. ఏం చెయ్యకూడదు.!
ఎలక్షన్ కోడ్ వస్తే ఏం చెయ్యచ్చు.. ఏం చెయ్యకూడదు.!