AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నా కాళ్లు పట్టుకుంటేనే వైసీపీలో చేరాను.. మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ రఘురామా మధ్య సవాళ్ల సీక్వెల్‌..

వైసీపీ అసంతృప్తనేత , నరసరావుపేట ఎంపీ రఘురామకృష్ణం రాజు విమర్శల దాడి పెంచారు. వైసీపీ మంత్రులే లక్ష్యంగా ఆయన ఆరోపణలు గుప్పిస్తున్నారు. వైసీపీలోకి తనంతట తాను..

నా కాళ్లు పట్టుకుంటేనే వైసీపీలో చేరాను.. మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ రఘురామా మధ్య సవాళ్ల సీక్వెల్‌..
Raghu ramakrishna raju
K Sammaiah
|

Updated on: Mar 12, 2021 | 9:14 AM

Share

వైసీపీ అసంతృప్తనేత , నరసరావుపేట ఎంపీ రఘురామకృష్ణం రాజు విమర్శల దాడి పెంచారు. వైసీపీ మంత్రులే లక్ష్యంగా ఆయన ఆరోపణలు గుప్పిస్తున్నారు. వైసీపీలోకి తనంతట తాను రాలేదన్నారు రఘురమా కృష్ణం రాజు. తన కాళ్లు పట్టుకుని బతిమాలితేనే తాను వైసీపీలో చేరానని ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. మంత్రి పెద్దిరెడ్డి సవాలును స్వీకరిస్తున్నట్టు చెప్పిన ఆయన.. తాను రాజీనామా చేసి మళ్లీ పోటీచేసి గెలిస్తే జగన్ తన ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి మళ్లీ పోటీకి దిగాలని, తన ఎమ్మెల్యేలను గెలిపించుకోవాలని రఘురామా చాలెంజ్‌ విసిరారు.

అంతకు ముందు రఘురామ కృష్ణం రాజుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రఘురామ కృష్ణరాజు ఓ కొమ్ములు లేని దున్నపోతు అని, ఆయనో విశ్వాస ఘాతుకుడు అని పెద్దిరెడ్డి తీవ్రంగా విమర్శించారు. వైసీపీ పార్టీ నుంచి గెలిచిన రఘురామకు సిగ్గుంటే ఎంపీ పదవికి రాజీనామా చేసి మళ్లీ గెలవాలని మంత్రి పెద్దిరెడ్డి సవాలు విసిరారు. మంత్రి సవాలుపై స్పందించిన రఘురామ రాజు అదేస్థాయిలో రీ చాలెంజ్‌ చేశారు. ఆయన సవాలును తాను స్వీరిస్తున్నానని, అయితే, తాను విసిరే ఈ సవాలును కూడా స్వీకరించాలని రఘురామ ప్రతి సవాల్ విసిరారు.

మంత్రి పెద్దిరెడ్డి నేను కనుక సీఎం అయితే అన్న మాటల వెనక ఉన్న ఉద్దేశం ఏమిటో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. మీ సీఎం అసమర్థుడు, చేతకానివాడు అనేదే ఆ మాటల వెనక ఉన్న ఉద్దేశమా? అని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. తాను చంద్రబాబుకు బంట్రోతుగా ఉండాల్సిన అవసరం లేదని, రాజకీయంగా చంద్రబాబు తనకు ఉన్నత స్థానం ఇచ్చారని రఘురామ అన్నారు. చంద్రబాబును విమర్శించే స్థాయి నీది కాదని తెలుసుకోవాలని మంత్రి పెద్దిరెడ్డికి ఎంపీ రఘురామకృష్ణంరాజు హితవు పలికారు.

విధానాలను వ్యతిరేకించానే తప్ప పర్సనల్‌గా ఎవరినీ పల్లెత్తు మాట కూడా అనలేదన్నారు. తానెప్పుడూ సీఎం జగన్‌ను విమర్శించలేదని, ఆయన ప్రభుత్వ విధానాలను, తప్పు చేస్తున్న వారిని మాత్రమే విమర్శించానని అన్నారు. జగన్‌, మిథున్‌రెడ్డిల దయవల్లే పెద్దిరెడ్డి మంత్రి అయ్యారని, ఇసుక ద్వారా ఎన్ని వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నావో అందరికీ తెలుసని పెద్దిరెడ్డిపై రఘురామ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

మొత్తానికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ రఘురామ కృష్ణం రాజు మధ్య విబేధాలు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి చేరాయి. ఒకే పార్టీ నుంచి గెలిచిన నేతల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లతో రాజకీయం రక్తి కడుతుంది. మంత్రి పెద్దిరెడ్డి సవాల్‌కు ప్రతి సవాల్‌ విసిరిన ఎంపీ వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌గా మారాయి. మరి ఎంపీ కామెంట్స్‌పై వైసీపీ నేతల నుంచి ఎలాంటి రియాక్షన్‌ వస్తుందోననే ఆసక్తి రాజకీయవ వర్గాల్లో నెలకొంది.

Read More:

భరతమాత విముక్తికి 75 ఏళ్లు.. ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ను ప్రారంభించననున్న ప్రధాని మోదీ