నేటితో ప్రచారానికి తెర.. ఎల్లుండి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌.. ఆఖరు రోజున అభ్యర్థుల విస్తృత ప్రచారం

తెలంగాణలో పట్టభ్రద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. ఎల్లుండి జరిగే పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణలో మొత్తం ఆరు ఉమ్మడి జిల్లాలో..

నేటితో ప్రచారానికి తెర.. ఎల్లుండి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌.. ఆఖరు రోజున అభ్యర్థుల విస్తృత ప్రచారం
Follow us

|

Updated on: Mar 12, 2021 | 9:35 AM

తెలంగాణలో పట్టభ్రద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. ఎల్లుండి జరిగే పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణలో మొత్తం ఆరు ఉమ్మడి జిల్లాలో ఎన్నికలు జరుగుతున్నప్పటికీ కొత్తగా ఏర్పాటైన జిల్లాల పద్ధతిలోనే ఎన్నికల నిర్మాహణ చేస్తున్నారు. హైదరాబాద్‌-రంగారెడ్డి- మహబూబ్‌నగర్, వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ స్థానాలకు ఈ నెల 14న ఎన్నికలు జరగనుననాయి. కాగా మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం 93 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అత్యధికంగా అభ్యర్థులుండటంతో జెంబో బ్యాలెట్ పేపర్‌తో బ్యాలెట్ బాక్స్ సిద్ధం చేశారు.

అయితే పేరుకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలే అయినప్పటికీ అభ్యర్థుల ప్రచారం అసెంబ్లీ ఎన్నికలను తలపించింది. పోలింగ్‌ నిర్వహణలో అధికారులు నిమగ్నమయ్యారు. అయితే ఫేక్‌ ఓట్లు ఇప్పుడు సమస్యగా మారాయి. వాటిని అధిగమించేందుకు అధికారులు చేస్తున్న కసరత్తు చేస్తున్నారు. ఇక నిబం ధనల ప్రకారం శుక్రవారం సాయంత్రం 4గంటలకు ప్రచార పర్యం ముగియనుంది. ఈ క్రమంలో అభ్యర్థులు, వారికి మద్దతి స్తున్న పార్టీల నేతలు, కార్యకర్తలు, అనుయాయులు పట్ట భద్రులను ప్రసన్నం చేసుకు నేందుకు శక్తియుక్తులు ధార పోస్తున్నారు.

అయితే వరంగల్‌, ఖమ్మం, నల్లగొం డ పట్ట భద్రుల నియోజకవర్గంలో 2015లో జరిగిన ఎన్నికల్లో 22 మంది అభ్యర్థులు బరిలో ఉండగా తాజా ఎన్నికల్లో 71 మంది పోటీలో ఉన్నారు. ఈసారి అభ్యర్థులతోపాటు ఓటర్లసంఖ్య సైతం గణనీయంగా పెరిగింది. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 2,81,138 ఓట్లు ఉండగా 1,53,547ఓట్లు పోల య్యా యి. ఇప్పుడు ఆ ఓటర్ల సంఖ్య 5,05,565కు చేరడంతో పోలింగ్‌శాతం పెంచుకో గలిగితే తప్ప గట్టెక్కలేమన్న అంచనాల్లో అభ్యర్థులున్నారు.

ఉమ్మడి జిల్లాలో మొత్తం 1,29,851మంది ఓటర్లుండగా 189పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఖమ్మం జిల్లాలో 87,172మంది ఓటర్లు, 127పోలింగ్‌ కేంద్రాలు, భద్రాద్రి జిల్లాలో 42,679మంది ఓటర్లు, 62పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. నూతనం గా ఏర్నడిన 12 జిల్లాలు, 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తరించి ఉన్న మండలి స్థానంలో 71మంది పోటీలో ఉండగా పోరు సార్వత్రిక సమరాన్ని తలిపిస్తోంది.

అటు హైదరాబాద్‌-రంగారెడ్డి- మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీ స్థానంలో మొత్తం 5లక్షల 36వేల 268 ఓటర్లున్నారు. అత్యధికంగా రంగారెడ్డిలో లక్షా 44వేల 416 మంది ఓటర్లుండగా.. నారాయణ పేట్‌ జిల్లాలో 13వేల 899మంది ఓటర్లున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం 799 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మహబూబ్ నగర్‌లో 56, నాగర్ కర్నూల్‌లో 44, వనపర్తిలో 31, జోగులాంబ గద్వాల్‌లో 22, నారాయణ్ పెట్‌లో 20, రంగారెడ్డి జిల్లాలో 199, వికారాబాద్‌లో 38, మేడ్చల్ మల్కాజిగిరిలో 198, హైదరాబాద్‌లో 191 పోలింగ్ కేంద్రాలున్నాయి. ప్రతీ పోలింగ్ కేంద్రానికి రెండు బాక్సుల చొప్పున 15వందల బ్యాలెట్‌ బాక్స్‌లను సిద్ధం చేశారు. ఇప్పటికే సామాగ్రిని పోలింగ్ కేంద్రాలకు తరించారు. ఎన్నికల కోసం మొత్తం 3వేల 835 మంది సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. వారిలో 959 మంది పీఓలు ఉండగా.. 2వేల 876మంది ఓపీఓలు ఉన్నారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా సాధారణ ఎన్నికలను తలపిస్తున్న ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరికివారే తమ అభ్యర్థి విజయం కోసం శ్రమిస్తున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థుల తరుపున రాష్ట్రస్థాయి నాయకులు కూడా రంగంలోకి దిగారు. అయితే ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార టీఆర్‌ఎస్‌.. పల్లా రాజేశ్వరరెడ్డి, వాణిదేవి విజయం కోసం పకడ్బందీ వ్యూహాలను అమలు చేస్తోంది. కీలక మంత్రులు రంగంలోకి దిగి ప్రచారం నిర్వహిస్తున్నారు.

కాంగ్రెస్‌ తరుపున రాములునాయక్‌ విజయాన్ని కాంక్షిస్తూ సీఎల్పీ నేత భట్టివిక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రచారం చేస్తున్నారు. బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డి, రామచంద్రరావు విజయం కోసం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, తెలంగాణ ఇంచార్జీ తరుణ్‌చుగ్‌ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. వామపక్షాల అభ్యర్థి జయసారథిరెడ్డి కోసం సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం, చాడా వెంకటరెడ్డి తదితరులు ప్రచారం చేస్తున్నారు. టీజేఎస్‌ అభ్యర్థి ప్రొఫెసర్‌ కోదండరామ్‌ విజయం కోసం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పలువురు విద్యావంతులు శ్రమిస్తున్నారు. కోదండరాంకు న్యూడెమోక్రసీ, టీడీపీ మద్దతునిచ్చాయి.

యువ తెలంగాణ పార్టీ రాణి రుద్రమరెడ్డి తరుపున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జిట్టా బాలకృష్ణరెడ్డి ప్రచారం నిర్వహిస్తున్నారు. తెలంగాణ ఇంటి పార్టీ నుంచి చెరుకు సుధాకర్‌, స్వతంత్ర అభ్యర్థి తీన్మార్‌ మల్లన్న, ఆప్‌ అభ్యర్థి నల్లమోతు తిరుమలరావుతో పాటు తాళ్లూరి సృజన్‌ కుమార్‌, కూరాకుల భారతి, సుదగాని హరిశంకర్‌గౌడ్‌, పలువురు అభ్యర్థులు కూడా జిల్లాలో ప్రచారం చేస్తూ సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతున్నారు.

Read More:

నా కాళ్లు పట్టుకుంటేనే వైసీపీలో చేరా.. మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ రఘురామా మధ్య సవాళ్ల సీక్వెల్‌..

మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.
మళ్లీ కెలుక్కుంటాను అంటే రా.! డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ పంచ్.
మళ్లీ కెలుక్కుంటాను అంటే రా.! డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ పంచ్.
చూస్తుంటే గుండె బరువుగా, నిండుగా ఉంది.. నాని ఎమోషనల్ పోస్ట్.!
చూస్తుంటే గుండె బరువుగా, నిండుగా ఉంది.. నాని ఎమోషనల్ పోస్ట్.!
యాక్షన్ కింగ్ కూతురు మామూలుగా లేదుగా.. హీరోయిన్స్ ను మించే అందం
యాక్షన్ కింగ్ కూతురు మామూలుగా లేదుగా.. హీరోయిన్స్ ను మించే అందం