YSRCP Foundation day: వైసీపీ పార్టీ ప్రస్థానానికి 11 ఏళ్లు.. ఘనంగా ఆవిర్భావ వేడుకలు.. రెట్టింపు ఉత్సాహంలో శ్రేణులు..
వైసీపీ పార్టీ ప్రస్థానానికి 11 ఏళ్లు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అకాల మరణం తర్వాత.. అనూహ్యంగా కొత్త పార్టీని స్థాపించిన వైఎస్ జగన్.. ఊహించని జయాలు, అపజయాలను కూడా సాధించారు...
YSR Congress Party Formation Day : వైసీపీ పార్టీ ప్రస్థానానికి 11 ఏళ్లు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అకాల మరణం తర్వాత.. అనూహ్యంగా కొత్త పార్టీని స్థాపించిన వైఎస్ జగన్.. ఊహించని జయాలు, అపజయాలను కూడా సాధించారు. 12.03.2011లో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ పేరుతో కొత్త పార్టీని ప్రారంభించిన ఏడాదికే 17 అసెంబ్లీ, ఓ ఎంపీ స్థానాన్ని గెలుచుకున్నారు.
2014 మేలో జరిగిన ఎన్నికల్లో 67 స్థానాల్లో గెలిచి.. ప్రతిపక్ష నేతగా గుర్తింపు పొందారు. ఆ తర్వాత రైతు భరోసా యాత్ర, ఏపీకి ప్రత్యేక హోదాపై ఢిల్లీలో చేపట్టిన ధర్నా వంటి కార్యక్రమాలు.. వైసీపీకి కాస్త కలిసివచ్చేలా చేశాయి.
ఆ తర్వాత గుంటూరులో జగన్.. రైతు దీక్ష చేపట్టిన సందర్భంగా ఓ వ్యక్తి హత్యాయత్నానికి ఒడిగట్టాడు. అది తీవ్ర ఉద్రిక్తతకు దారితీయగా.. అదే టైంలో ఇచ్చాపురం నుంచి ప్రజాసంకల్ప యాత్రకు శ్రీకారం చుట్టారు. 3648 కిలోమీటర్లు సాగిన ఈ యాత్రకు ప్రజల నుంచి ఊహించని మద్దతు లభించింది. అదే నేడు అధికారాన్ని తెచ్చిపెట్టేలా చేసింది. 30.05.2019న ఏపీ సీఎంగా వైఎస్ జగన్‌ను ప్రమాణం చేయించేలా ఫలితాలను తీసుకువచ్చింది.
సుధీర్ఘ మజిలీలో వైఎస్సార్‌సీపీ పార్టీ అనేక ఆటుపోట్లను ఎదుర్కొంది. అయితే నూతన పథకాలు.. ఆ పార్టీకి ప్రజల్లో మంచి గుర్తింపును తీసుకువచ్చేలా చేసింది. నవరత్నాల పేరుతో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్… విద్య, వైద్యం, వ్యవసాయం, పారదర్శకత, మహిళాసాధికారతకు పెద్దపీట వేసేలా ముందుకు సాగుతున్నారు.
ఏపీలో వైఎస్సార్‌సీపీ 11వ ఆవిర్భావ దినోత్సవాన్ని పండుగలా జరుపుకుంటున్నారు. వేడుకల్లో భాగంగా సేవా కార్యక్రమాలు చేపట్టారు.