AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: తెలంగాణలోని నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. మరోసారి గడువు పొడిగింపు

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు గరిష్ట వయో పరిమితి పెంచింది. 34 నుంచి 44 ఏళ్లకు పెంచింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏడాది పాటు గడువు పొడిగించారు.

Telangana: తెలంగాణలోని నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. మరోసారి గడువు పొడిగింపు
Cm Revanth Reddy
Venkatrao Lella
|

Updated on: May 19, 2026 | 10:00 PM

Share

తెలంగాణలోని నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ అందించింది. ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు గరిష్ట వయో పరిమితిని పెంచింది. గతంలో ఇది 34 ఏళ్లుగా ఉండగా.. ఇప్పుడు 44 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. నిరుద్యోగుల అభ్యర్థన మేరకు రేవంత్ సర్కార్ పొడిగింపుకు మొగ్గు చూపింది. పోలీస్, ఇతర యూనిఫామ్ సర్వీసులకు ఈ పొడిగింపు వర్తించదని ప్రభుత్వం జీవోలో పేర్కొంది. ఒక ఏడాది మాత్రమే ఈ జీవో అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. ప్రభుత్వం మరోసారి ప్రభుత్వ ఉద్యోగాలకు వయో పరిమితిని పెంచడంతో నిరుద్యోగుల్లో హర్షం వ్యక్తమవుతోంది.

మరోసారి పెంపు

అయితే తెలంగాణ ఏర్పడ్డాక గరిష్ట వయో పరిమితిని 10 ఏళ్లకు పెంచారు. అది పూర్తయ్యాక మరో రెండేళ్లకు పొడిగిస్తూ జీవో జారీ చేశారు. ఆ గడువు ముగియడంతో మరో ఏడాది పాటు గడువు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తాజాగా దీనిపై జీవో కూడా జారీ చేయడంతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిరుద్యోగుల అభ్యర్థన మేరకు గడువు పొడిగించినట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే ప్రభుత్వం గడువు పొడిగించిన సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీలో సీనియర్ కాంగ్రెస్ నేత మానవతారాయ్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం మానవతారాయ్ మాట్లాడుతూ.. త్వరలో 40 వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోందని తెలిపారు. కృత్రిమ నిరుద్యోగ నాయకుల ఉచ్చులో నిరుద్యోగులు పడవద్దని సూచించారు. పోలీస్ సర్వీసుతో పాటు అగ్నిమాపక, ఎక్సైజ్ కంట్రోల్, జైలు, అటవీశాఖల్లో ఉద్యోగాలకు 34 ఏళ్ల గరిష్ట వయో పరిమితి నిబంధనే వర్తిస్తుందని స్పష్టం చేసింది.

Follow Us
సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!
సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి