Kadapa Crime News: అర్థరాత్రి రెచ్చిపోయిన ఆగంతకులు.. హైకోర్టు న్యాయవాదికి చెందిన మూడు కార్లకు నిప్పు
కడప జిల్లాలో కలకలం చెలరేగింది. గుర్తు తెలియని దుండుగులు విలువైన మూడు కార్లకు నిప్పు పెట్టడంతో అవి కాలి బూడిదయ్యాయి. దీంతో బాధితుడు రాధ కృష్ణ శర్మ పోలీసులను ఆశ్రయించారు.
కడప జిల్లాలో కలకలం చెలరేగింది. గుర్తు తెలియని దుండుగులు విలువైన మూడు కార్లకు నిప్పు పెట్టడంతో అవి కాలి బూడిదయ్యాయి. దీంతో బాధితుడు రాధ కృష్ణ శర్మ పోలీసులను ఆశ్రయించారు. కడప జిల్లా రాజంపేట పట్టణంలోని సాదు కామాక్షమ్మ ఆలయం పక్కన ఉన్న ఖాళీ స్థలంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాది రాధాకృష్ణ శర్మకు చెందిన కార్లకు అర్థరాత్రి సమయంలో ఎవరో ఆగంతకులు నిప్పు పెట్టడంతో అవి పూర్తిగా కాలిపోయాయి. దగ్దమైన వాటిలో రెండో హోండా కార్లు, ఒక టాటా నానో కారు ఉన్నాయి. ఘటనపై బాధితుడు రాధా కృష్ణ శర్మ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
అర్థరాత్రి సమయంలో తాను ఇంట్లో పడుకుని ఉండగా బయట తలుపులు బాదుతున్న శబ్దం వచ్చిందని.. వెళ్లి డోర్ తీయగా స్థానికులు తనకు విషయం చెప్పారని పేర్కొన్నారు. హుటాహుటిన అక్కడికి వెళ్లే సరికే అగ్ని కీలల్లో కాలి బూడిద అవుతున్న కార్లను చూసి గుండె తరుక్కుపోయిందని చెప్పారు. వెంటనే ఫైర్ వారికి, పోలీసులకు సమాచారం ఇచ్చానని వెల్లడించారు. ఫైర్ ఇంజన్ వచ్చేలోపలే దాదాపు 75 లక్షల రూపాయల విలువచేసే కార్లు 80%కాలి పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో రాజంపేటలో అల్లరి మూకలు ఎక్కువయ్యాయని.. ఇలాంటి సంఘటనలు పాల్పడుతూ స్థానికులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని రాధాకృష్ణ శర్మ చెప్పారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు గట్టి చర్యలు తీసుకోవాలని ఆయన కోరుతున్నారు. జరిగిన నష్టాన్ని పూరించడానికి వెంటనే నిందితులను పట్టుకుని అరెస్ట్ చేయాలని కోరారు. ఒక్కసారిగా ఆలయం పక్కన ఉన్న స్థలంలో ఇలాంటి దుర్ఘటన జరగడంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు.
Also Read:
Gummadi Narsaiah Biopic: 5 సార్లు ఎమ్మెల్యే.. అత్యంత సాధారణ జీవితం.. త్వరలో ఆయన బయోపిక్ !
Treasure hunt: మహాశివరాత్రి వేళ గుప్తనిధుల వేట.. తవ్వగా.. తవ్వగా… చివరికి ఊహించని ట్విస్ట్…