AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gummadi Narsaiah Biopic: 5 సార్లు ఎమ్మెల్యే.. అత్యంత సాధారణ జీవితం.. త్వరలో ఆయన బయోపిక్ !

ఆ ఇండస్ట్రీ.. ఈ ఇండస్ట్రీ అన్న తేడా లేదు. సౌత్ నుంచి నార్త్ వరకు ఇప్పుడు బయోపిక్స్ హవా కొనసాగుతుంది. తెలుగులో కూడా ఈ సంస్కృతి ఈమధ్య ఊపందుకుంది. అనూహ్యంగా ఏ బయోపిక్ వచ్చినా...

Gummadi Narsaiah Biopic: 5 సార్లు ఎమ్మెల్యే.. అత్యంత సాధారణ జీవితం.. త్వరలో ఆయన బయోపిక్ !
గుమ్మడి నర్సయ్య బయోపిక్
Ram Naramaneni
|

Updated on: Mar 12, 2021 | 11:18 AM

Share

ఆ ఇండస్ట్రీ.. ఈ ఇండస్ట్రీ అన్న తేడా లేదు. సౌత్ నుంచి నార్త్ వరకు ఇప్పుడు బయోపిక్స్ హవా కొనసాగుతుంది. తెలుగులో కూడా ఈ సంస్కృతి ఈమధ్య ఊపందుకుంది. అనూహ్యంగా ఏ బయోపిక్ వచ్చినా ఘనవిజయం అందిస్తున్నారు ప్రేక్షకులు. ప్రముఖుల జీవితాలలోని అన్ని కోణాలను తెలుసుకునేందుకు ప్రజలు ఇంట్రస్ట్ చూపిస్తున్నారని దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇటీవల కాలంలో వచ్చిన ‘మహానటి’,  ‘యాత్ర’ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించాయి. ఈ తరహాలోనే ఫిల్మ్ నగర్ వర్గాల్లో ఈమధ్య అందరి మాటల్లో చర్చకు వస్తున్న ఓ బయోపిక్ విషయం ఆసక్తిని రేపుతోంది.. అదే ప్రముఖ రాజకీయ నాయకుడు, అవినీతి మచ్చలేని వ్యక్తి, 5 సార్లు వరుసగా ఎమ్మెల్యే అయినప్పటికీ ఎలాంటి దోపిడీ దౌర్జన్యాలకి పాల్పడకుండా కేవలం ప్రజాసేవకే తన జీవితం అంకితం చేసిన వ్యక్తి గుమ్మడి నర్సయ్య బయోపిక్.

సాదా సీదా జీవితం సాగిస్తున్న ప్రజా నాయకుడు గుమ్మడి నర్సయ్య రాజకీయ ప్రస్థానం గురించి ఒక బయోపిక్ వస్తున్నట్లు ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తుంది. గత ఆరు నెలలుగా ఈ కథకి సంబంధించిన వర్క్ జరుగుతుందని తెలుస్తోంది. ఈ సినిమాని పరమేశ్వర్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్నాడని సమాచారం. ఇదే కనుక నిజమైతే ఒక ఆదర్శవంతమైన నాయకుడి గురించి ఈ తరంతో పాటు భవిష్యత్ తరాలకు కూడా తెలిసే అవకాశం ఉంది. దీని గురించి పూర్తి వివరాలు తెలియాలంటే మరికొంతకాలం వెయిట్ చేయాల్సిందే.

రాజకీయాల్లో కొందరికి చిన్న, చిన్న పదవులు రాగానే గర్వం, అహం పెరుగుతుంది. కానీ అలాంటివి ఏమీ పట్టవు ప్రజా నాయకుడు గుమ్మడి నర్సయ్యకు. ఐదు సార్లు శాసనసభ్యుడిగా ప్రాతినిథ్యం వహించినా కూడా.. ఆయన లివింగ్ స్టైల్ చాలా సింపుల్‌గా ఉంటుంది. ఏదైనా పని మీద హైదరాబాద్‌కు వచ్చినా కూడా జీహెచ్‌‌ఎంసీ ఏర్పాటు చేసిన ఐదు రూపాయల భోజనం తింటూ ఉంటారు ఆయన. నర్సయ్య గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా బస్సులో, రైల్లో హైదరాబాద్ కి రావడం, ఆటోలో అసెంబ్లీకి వెళ్ళడం, పార్టీ ఆఫీస్ లో పడుకోవడం వంటివి చేసేవారు.

Also Read:

Treasure hunt: మహాశివరాత్రి వేళ గుప్తనిధుల వేట.. తవ్వగా.. తవ్వగా… చివరికి ఊహించని ట్విస్ట్…

ఎంత మాయో చూడండి.. స్వాములోరి హుండీని తెరిస్తే కేవలం రూపాయి మాత్రమే ఉంది.. అసలు ఏం జరిగిందంటే