ఎంత మాయో చూడండి.. స్వాములోరి హుండీని తెరిస్తే కేవలం రూపాయి మాత్రమే ఉంది.. అసలు ఏం జరిగిందంటే

ఇంటి దొంగను ఈశ్వరుడైన పట్టలేడు అంటారు...అచ్చం అలాంటి ఘటనే మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. దేవుడే మావాడే కాబట్టి..

ఎంత మాయో చూడండి.. స్వాములోరి హుండీని తెరిస్తే కేవలం రూపాయి మాత్రమే ఉంది.. అసలు ఏం జరిగిందంటే
హుండీలో డబ్బు మాయం
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 11, 2021 | 5:33 PM

ఇంటి దొంగను ఈశ్వరుడైన పట్టలేడు అంటారు…అచ్చం అలాంటి ఘటనే మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. దేవుడే మావాడే కాబట్టి.. మమల్ని ఎవరు అడుగుతారు అనుకున్నారో ఏమో గానీ, ఏకంగా కన్నాల స్వామికే కన్నం వేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామ పంచాయితీ పరిధిలోని శ్రీ బుగ్గ రాజా రాజేశ్వర స్వామి ఆలయం ఇది. ఇక్కడ స్వామివారి సన్నిధిలోని ఏర్పాటు చేసిన హుండీని లెక్కించగా అందులో కేవలం.. 1 రూపాయి మాత్రమే కనిపించింది. దీంతో ఆలయ అధికారులు, సిబ్బంది అంతా అవాక్కయ్యారు. ఇదేంటని అనుమానం వచ్చి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఆలయ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు…ఆలయ పరిసరాలను పరిశీలించారు. గుడిలో ఏర్పాటు చేసిన సీసీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు..నిందితుల కోసం గాలిస్తున్నారు. ఆలయం హుండి మాయం కావటం ఇంటి దొంగల పనే అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆలయ సిబ్బందితో పాటు పూజారులను విచారిస్తున్నారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది.  కాగా నిందితులను పట్టుకోవడంలో సీసీ టీవీ విజువల్స్ కీలకంగా మారాయి. ఎంత చిన్న టెంపుల్ అయినా సరే.. గుడికి వెళ్లినవారు ఎంతో కొంత.. హుండీలో డబ్బులు వేయకుండా తిరిగిరారు. అలాంటిది నిత్య భక్తుల రద్దీ ఓ మోస్తారుగా ఉండే శ్రీ బుగ్గ రాజా రాజేశ్వర స్వామి ఆలయంలో కేవలం రూ.1 మాత్రమే ఉన్నాయంటే.. కచ్చితంగా డబ్బు మిస్ అయినట్లు స్పష్టమవుతుంది. ఇంటి దొంగలు సీసీ కెమెరాల కంటపడకుండా పని కానిచ్చారా లేదా అనే విషయం మరికొద్ది రోజుల్లో తేలనుంది.

Also Read:

కామారెడ్డి జిల్లాలో వింత సంఘటన.. మోటారు లేకుండానే బోరుబావిలోంచి ఉబికి వస్తోన్న నీరు

మహాశివరాత్రి వేళ మహా అద్భుతం.. మంచిర్యాల జిల్లాలో శ్వేతనాగు దర్శనం

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!