Viral News: కామారెడ్డి జిల్లాలో వింత సంఘటన.. మోటారు లేకుండానే బోరుబావిలోంచి ఉబికి వస్తోన్న నీరు

కామారెడ్డి జిల్లాలో వింత సంఘటన చోటు చేసుకుంది. మోటారు బిగించకుండానే బోరు బావిలోంచి నీరు ఉబికి వస్తోంది. బోరులోంచి ధారళంగా...

Viral News: కామారెడ్డి జిల్లాలో వింత సంఘటన.. మోటారు లేకుండానే బోరుబావిలోంచి ఉబికి వస్తోన్న నీరు
మోటారు లేకుండానే బోరుబావిలోంచి ఉబికి వస్తోన్న నీరు
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 11, 2021 | 3:13 PM

కామారెడ్డి జిల్లాలో వింత సంఘటన చోటు చేసుకుంది. మోటారు బిగించకుండానే బోరు బావిలోంచి నీరు ఉబికి వస్తోంది. బోరులోంచి ధారళంగా వస్తోన్న నీటిని చూసిన స్థానికులు, రైతులు ఆశ్చర్యంతో పాటు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

గాంధారి మండలం నేరల్ తండా గ్రామంలో పల్లె ప్రకృతి వనం, కంపోస్ట్ షెడ్ నిర్మాణ పనులకు గానూ…బోర్‌ బావిని తవ్వించారు. కాగా, బోరు బావిలోంచి ఒక్కసారిగా నీరు పైకి ఉబికి వస్తుండటం చూసి అంతా ఆశ్చర్యపోయారు. బోరు బావి తవ్వడం ఆపేసినా నీరు ఉప్పొంగి పైకి ఎగిసిపడుతోంది. బోరుబావిలోంచి నీరు ఉబికి వస్తుందన్న వార్త ఆ నోట ఈ నోట చుట్టుపక్కల గ్రామాలకు కూడా పాకింది. దీంతో..చుట్టు పక్కల గ్రామాల ప్రజలు సైతం తరలి వచ్చి విచిత్రంగా చూస్తున్నారు. గత సంవత్సరం వర్షాలు సమవృద్దిగా పడడంతో గ్రౌండ్ వాటర్ సంవృద్దిగా ఉండడం వల్లే ఇలా జరుగుతుందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు.

కాగా జయశంకర్‌ భూపాలపల్లి మండలంలోని తొండ్యాల లక్ష్మీపూర్‌ గ్రామంలో బోరుబావి నుంచి కూడా ఏళ్ల తరబడి నీరు ఉబికి వస్తోంది. పొదెం లక్ష్మయ్య అనే గిరిజన రైతు తన 10 ఎకరాల వరి పొలానికి సాగునీటి కోసం కొన్నేళ్ల కిందట పొలంలో 50 ఫీట్లలోతులో బోరు వేసి వదిలేశాడు. ఆ బోరుకు విద్యుత్‌ మోటార్‌ను ఫిక్స్ చేయకుండానే నీరు ఉబికి వస్తూనే ఉంది. సాగునీటికే కాకుండా, గ్రామస్థులకు తాగునీరుగా ఈ బోరు ఉపయోగపడుతోంది. కాగా ఆయా ప్రాంతాల్లో భూగర్భ జలాలు అధిక మొత్తంలో ఉంటే ఇలా జరుగుతుందని సబంధిత నిపుణులు చెబుతున్నారు.

Also Read:

Photo Gallery: 17 ఏళ్లుగా భార్య శవం పక్కనే.. ఆమె ఎముకలు కుళ్లిపోకుండా వినూత్న ఆలోచన

Variety Tractor: టైర్లు లేని ట్రాక్టర్‌.. భలేగుంది కదా..! దీనివల్ల చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయండి..