Gold Seize: మంగళూరు ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం స్వాధీనం.. మహిళను అదుపులోకి తీసుకున్న కస్టమ్స్

Mangaluru Air Customs: దేశంలో నిత్యం ఏదో ఒక విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా.. కర్ణాటకలోని మంగళూరు

Gold Seize: మంగళూరు ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం స్వాధీనం.. మహిళను అదుపులోకి తీసుకున్న కస్టమ్స్
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Mar 11, 2021 | 5:03 PM

Mangaluru Air Customs: దేశంలో నిత్యం ఏదో ఒక విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా.. కర్ణాటకలోని మంగళూరు విమానాశ్రయంలో భారీగా భారీగా పట్టుబడింది. దుబాయ్ నుంచి భారత్‌కు అక్రమంగా తరలిస్తున్న కోటి పది లక్షల రూపాయల విలువైన బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు.

గురువారం దుబాయ్ నుంచి మంగుళూరుకు వచ్చిన విమానంలో ఓ మహిళ ప్రయాణికురాలు దుస్తుల్లో దాచిపెట్టుకొని 1.41 కిలోల బంగారాన్ని అక్రమంగా తీసుకువస్తోంది. అనుమానం రావడంతో కస్టమ్స్ అధికారులు ఆమెను ఆపి తనిఖీలు చేశారు. దీంతో ఆమె లో దుస్తులు, సాక్సుల్లో దాచిపెట్టిన బంగారం బయటపడిందని అధికారులు తెలిపారు. దీంతోపాటు భారీగా విదేశీ సిగిరేట్లు కూడా లభ్యమైనట్లు వెల్లడించారు. ఈ మేరకు బంగారాన్ని సాధీనం చేసుకొని విచారణ జరుపుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఇదిలాఉంటే.. నిన్న చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో కూడా భారీగా బంగారం లభ్యమైంది. నిత్యం ఏదోఒకచోట అక్రమంగా తీసుకువస్తున్న బంగారం లభిస్తుండటంతో కస్టమ్స్ అధికారులు అప్రమత్తమై ప్రయాణికులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. నిబంధనలను పాటించకుండా భారత్‌కు బంగారం తీసుకువస్తున్న వారిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటున్నారు.

Also Read:

పాక్ లోని సింధ్ లో 13 ఏళ్ళ బాలిక కిడ్నాప్, పెళ్లి, బలవంతపు మతమార్పిడి

33 ఏళ్లుగా అరుదైన నాణేలను సేకరిస్తున్న ఏపీ వ్యక్తి..
33 ఏళ్లుగా అరుదైన నాణేలను సేకరిస్తున్న ఏపీ వ్యక్తి..
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
మ్యాడ్ స్క్వేర్ నుంచి 'స్వాతి రెడ్డి' సాంగ్ వచ్చేసిందోచ్..
మ్యాడ్ స్క్వేర్ నుంచి 'స్వాతి రెడ్డి' సాంగ్ వచ్చేసిందోచ్..
ట్రైన్‌‌ స్లీపర్ భోగీలో గుప్పుమన్న వింతైన వాసన..
ట్రైన్‌‌ స్లీపర్ భోగీలో గుప్పుమన్న వింతైన వాసన..
20 ఏళ్లుగా ఇండస్ట్రీలో నటిస్తోంది.. గ్లామర్ సెన్సేషన్..
20 ఏళ్లుగా ఇండస్ట్రీలో నటిస్తోంది.. గ్లామర్ సెన్సేషన్..
ఆసీస్ గడ్డపై టాలీవుడ్ హీరోలను గుర్తు చేసిన నితీశ్ రెడ్డి
ఆసీస్ గడ్డపై టాలీవుడ్ హీరోలను గుర్తు చేసిన నితీశ్ రెడ్డి
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
అలా ఉన్నా డయాబెటిస్ బారిన పడతారంట.. షాకింగ్ విషయాలు..
అలా ఉన్నా డయాబెటిస్ బారిన పడతారంట.. షాకింగ్ విషయాలు..
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
ప్రతి 10 నిమిషాలకు రూ.50 లక్షలు విలువ చేసే లగ్జరీ కారు అమ్మకం..!
ప్రతి 10 నిమిషాలకు రూ.50 లక్షలు విలువ చేసే లగ్జరీ కారు అమ్మకం..!