Gas Leak: కాకినాడలోని ఓ ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్.. చెలరేగిన మంటలు.. ఇద్దరు సజీవదహనం
ఓ ప్రైవేటు ఫ్యాక్టరీలో గ్యాస్ లీకేజీ అయి ఇద్దరు సజీవదహనమయ్యారు. మరో
gas leak in Kakinada: తూర్పు గోదావరి జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఓ ప్రైవేటు ఫ్యాక్టరీలో గ్యాస్ లీకేజీ అయి ఇద్దరు సజీవదహనమయ్యారు. మరో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. జిల్లాలోని కాకినాడు సర్పవరంలోని టైకీ పరిశ్రమలో గురువారం మధ్యాహ్నం విష వాయువు లీకై అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. ఆరుగురు తీవ్రంగా గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించారు. మంత్రి కన్నబాబు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.