Coronavirus Scare In Chittoor: ప్రైవేటు స్కూల్‌లో కరోనా కలకలం.. ఇద్దరు విద్యార్థులకు పాజిటివ్..!
Coronavirus Scare: చిత్తూరు నగరంలోని ఓ ప్రైవేటు ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో కరోనా కలకలం రేపింది. విద్యార్థులకు కరోనా వైరస్ పాజిటివ్‌గా..
Coronavirus Scare: చిత్తూరు నగరంలోని ఓ ప్రైవేటు ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో కరోనా కలకలం రేపింది. విద్యార్థులకు కరోనా వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ కావటంతో స్కూల్‌కు తాళం వేసి రెడ్‌జోన్‌గా ప్రకటించారు అధికారులు. వివరాల్లోకి వెళ్తే..
స్థానికంగా ఉండే ఇంగ్లీష్ మీడియం ప్రైవేటు పాఠశాలలో ఇద్దరు విద్యార్ధులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. విషయం తెలుసుకున్న కార్పొరేషన్ సిబ్బంది పాఠశాలలో శానిటేషన్ చేసి రెడ్ జోన్ ప్రకటించారు. ఇదే పాఠశాలలో గత నాలుగు రోజుల క్రితం ఓ విద్యార్థినికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినా, యాజమాన్యం చర్యలు తీసుకోకపోవడంతో మరో ఇద్దరు విద్యార్థులు కరోనా బారిన పడ్డారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
పాఠశాల నిర్లక్ష్యంపై నగరపాలక కమిషనర్ పులిగుండు విశ్వనాధ్ షోకాజ్ నోటీసు జారీ చేశారు. నగరంలోని విద్యా వికాస్ పాఠశాలలో కూడ ఓ విద్యార్థికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. నగరంలో ముగ్గురు విద్యార్థులు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినా కూడా పాఠశాల విద్యాశాఖ కనీస సమాచారం కూడా లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. కాగా కోవిడ్ నిబంధనలు పాటించని పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని నగరపాలక కమిషనర్ హెచ్చరించారు.
మరిన్ని ఇక్కడ చదవండి:
కన్న కొడుకు కోసం తండ్రి పోరాటం.. మొసలి పొట్ట కోసి బాలుడిని బయటికి తీశాడు.. కానీ.!
కోతిని అమాంతం మింగేసిన రాకాసి బల్లి.! ఒళ్లుగగుర్పొడిచే వీడియో.. నెట్టింట్లో వైరల్.!