Viral Video: భయంతో పరుగెత్తిన జింక.. వేటాడి.. వెంటాడి.. మట్టుబెట్టిన మొసలి.. థ్రిల్లింగ్ వీడియో వైరల్.!

Deer Hunted By A Crocodile: అడవిలో చట్టాలు, నిబంధనలు భిన్నంగా ఉంటాయి. జంతువులు ఏవైనా సరే చురుకుదనంతో ఉంటూ.. వేరే జంతువుల...

Viral Video: భయంతో పరుగెత్తిన జింక.. వేటాడి.. వెంటాడి.. మట్టుబెట్టిన మొసలి.. థ్రిల్లింగ్ వీడియో వైరల్.!
Follow us

|

Updated on: Mar 08, 2021 | 11:35 AM

Deer Hunted By A Crocodile: అడవిలో చట్టాలు, నిబంధనలు భిన్నంగా ఉంటాయి. జంతువులు ఏవైనా సరే చురుకుదనంతో ఉంటూ.. వేరే జంతువుల నుంచి తమను తాము రక్షించుకుంటాయి. ఇక వేటాడేటప్పుడు అయితే మాత్రం ఖచ్చితంగా వ్యూహం రచించాల్సిందే. లేదంటే వేరే జంతువుకు ఆహారం అయిపోతాయి. ముఖ్యంగా మొసలి నుంచి తప్పించుకోవాలంటే బలం లేదా వ్యూహాన్ని ఉపయోగించాలి. ఒకవేళ అవి రెండింటిని మిస్సయితే మాత్రం మొసలికి ఆహారం అయిపోవాల్సిందే. తాజాగా ఈ రెండూ ఉపయోగించడంలో తడబడిన ఓ జింక మొసలి నోటికి చిక్కింది. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇందులో ఓ జింక మొసలిని తప్పించుకునేందుకు నీటిలోకి దూకుతుంది. కానీ ఆ నిర్ణయమే మూర్ఖత్వానికి ప్రతీకగా నిలిచింది. మొసలిని నీటి రారాజుగా పిలుస్తుంటారు. నీటిలో ఉంటే దానికి చిక్కడం సింపుల్. సరిగ్గా అదే అవకాశాన్ని జింక ఇచ్చింది. మొసలిని తప్పించుకునేందుకు జింక నీటిలోకి దూకగా.. అదే అదనుగా చూసుకుని ఆ మొసలి సరిగ్గా నది మధ్యలో ఆ జింకను వేటాడి వెంటాడి మట్టుబెడుతుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి ప్రవీణ్ అంగుస్వామి ట్విట్టర్ వేదికగా నెటిజన్లతో పంచుకున్నారు. ”ధైర్యానికి, మూర్ఖత్వానికి మధ్య సన్నని గీత ఉందని, దానిని ఎప్పటికీ దాటవద్దని” క్యాప్షన్‌ను ఈ వీడియోకు ఇచ్చారు. ట్వీట్ చేసిన కొద్దిసేపటికే ఈ వీడియోపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపించారు.

Also Read:

Viral: ఇంటర్ స్టూడెంట్ అందమైన ప్రేమలేఖ.. అమ్మాయి రెస్పాన్స్ అదుర్స్.. అసలు ఏం చెప్పిందంటే.!

ఐపీఎల్ 2021: సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టులో ఈ ఐదుగురికి ప్లేస్ పక్కా.. వారెవరంటే.!

అదృష్టానికి ఆమె బ్రాండ్ అంబాసిడర్.. ఒక్క దెబ్బతో కోట్లు గెలుచుకుంది.. అసలు మ్యాటర్ ఇదే.!

Latest Articles