అదృష్టానికి ఆమె బ్రాండ్ అంబాసిడర్.. ఒక్క దెబ్బతో కోట్లు గెలుచుకుంది.. అసలు మ్యాటర్ ఇదే.!

Thailand woman Strange Lump: సాధారణంగా వామ్‌టింగ్‌ అంటేనే వినడానికి గానీ.. చూడ్డానికి గానీ ఇబ్బందిగా ఫీల్‌ అవుతుంటాం. కానీ కక్కు ఒకరి తలరాతను..

  • Ravi Kiran
  • Publish Date - 12:57 pm, Fri, 5 March 21
అదృష్టానికి ఆమె బ్రాండ్ అంబాసిడర్.. ఒక్క దెబ్బతో కోట్లు గెలుచుకుంది.. అసలు మ్యాటర్ ఇదే.!

Thailand woman Strange Lump: సాధారణంగా వామ్‌టింగ్‌ అంటేనే వినడానికి గానీ.. చూడ్డానికి గానీ ఇబ్బందిగా ఫీల్‌ అవుతుంటాం. కానీ కక్కు ఒకరి తలరాతను మార్చిందంటే ఎవరైనా నమ్ముతురా? కక్కుతో లక్కు కలిసొచ్చిన ఈ సంఘటన గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు. అసలు వాంతి చేసుకుంటే.. అదృష్టం కలసిరావడం ఏంటని అనుకుంటున్నారా? మీరు విన్నది నిజమే.. థాయ్‌లాండ్‌కు చెందిన ఒక ఆమె బీచ్‌లో నడుచుకుంటూ వెళ్తుండగా.. ఆమె కాళ్లకు ఏదో తగిలింది. సముద్రపు జీవి అనుకుంటూ కిందకు దగ్గరకు వంగి పరిశీలించింది. అక్కడి వాసనను బట్టి చేపల జాతికి చెందిన జీవిగా భావించింది. ధైర్యం చేసి దానిని దానిని పట్టుకోగా చేతికి చాలా గట్టిగా తగిలింది.. దాంతో ఇది ఏదో విలువైన వస్తువేనని భావించి.. దానిని తనతో పాటు ఇంటికి తీసుకెళ్లింది

కాగా, ఆమె తన ఇంటికి పక్కల వారిని పిలిచి.. ఆ వస్తువు ఏంటో కనిపెట్టాలని కోరింది. వారంతా దాన్ని బాగా పరిశీలించి.. అసలు విషయం తెలుసుకుని ఆశ్చర్యపోయారు. ఆ వస్తువు కారణంగా త్వరలోనే ఆమె కోటీశ్వరురాలు కాబోతుందని చెప్పారు. వారి మాటలు విని ఆమె ఆనందంలో మునిగితేలింది. ఇంతకు అసలు ఆమె‌కు బీచ్‌లో దొరికిన వస్తువు ఏంటో తెలుసా? తిమింగలం‌ వామ్‌టింగ్‌. కక్కిన తర్వాత అది ఇలా గట్టిగా తయారయ్యింది.

అయితే మార్కెట్‌లో ఈ తిమింగలం‌ వాంతికి ఫుల్‌ డిమాండ్‌ ఉంటుంది. దాని ధర భారీగా ఉంటుంది. ఇంత డిమాండ్‌ ఎందుకంటే.. దీనిని పర్‌ఫ్యూమ్స్‌ తయారీలో ఉపయోగిస్తారు. ఇలా తయారు చేసిన పర్‌ఫ్యూమ్స్‌ ఎక్కువ సేపు సువాసన వెదజల్లుతాయి. కాగా, ఆమెకు‌ దొరికిన తిమింగలం‌ వాంతి ముద్ద దాదాపు 12 ఇంచుల వెడల్పు, 24 ఇంచుల పొడవు ఉంది. దీని ధర సుమారు1.86 లక్షల పౌండ్లు.. అంటే సుమారుగా 1.8 కోట్ల రూపాయలు అన్నమాట.

Also Read:

ఈ పది సెకండ్స్ వీడియో ఏకంగా రూ. 48 కోట్లకు అమ్ముడైంది.. ఎందుకు అంత ధర పలికిందో తెలుసా.!

మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గుతోన్న బంగారం ధరలు.. 2 నెలల్లో ఎంత తగ్గిందంటే.!

Viral: భర్తను కోల్పోయిన టీచర్‌కు స్టూడెంట్ ఓదార్పు లేఖ.. నెట్టింట వైరల్‌గా మారిన పోస్ట్.!