ఈ పది సెకండ్స్ వీడియో ఏకంగా రూ. 48 కోట్లకు అమ్ముడైంది.. ఎందుకు అంత ధర పలికిందో తెలుసా.!

Ravi Kiran

Ravi Kiran |

Updated on: Mar 04, 2021 | 10:43 AM

Video Clip Sold For Rs. 48 Crore: దురదృష్టం వందసార్లు తలుపు తడితే.. అదృష్టం ఒక్కసారైనా తలుపు తడుతుందట! అలా అదృష్టం తలుపు...

ఈ పది సెకండ్స్ వీడియో ఏకంగా రూ. 48 కోట్లకు అమ్ముడైంది.. ఎందుకు అంత ధర పలికిందో తెలుసా.!

Video Clip Sold For Rs. 48 Crore: దురదృష్టం వందసార్లు తలుపు తడితే.. అదృష్టం ఒక్కసారైనా తలుపు తడుతుందట! అలా అదృష్టం తలుపు తట్టినప్పుడు వెంటనే అప్రమత్తమై ఆ అదృష్టాన్ని ఇంట్లోకి ఆహ్వానించాలట! 2020 అక్టోబర్‌లో, అమెరికాలోని మయామిలో నివసిస్తున్న ఓ ఆర్ట్ కలెక్టర్ 10 సెకన్ల ఆర్ట్ వీడియో కోసం రూ. 49.13 లక్షలు ఖర్చు చేశాడు. అతడికి నక్క తోక తొక్కినట్లు.. ఆ వీడియో కాస్తా ఇప్పుడు రూ .48.42 కోట్ల సంపాదించి పెట్టింది.

పైన పేర్కొన్న వీడియోను డిజిటల్ ఆర్టిస్ట్ బీపుల్ రూపొందించారు. బీపుల్ అసలు పేరు మైక్ వింక్లెమాన్. 10 సెకన్ల వీడియోను మైక్ స్వయంగా తయారు చేసినట్లు బ్లాక్‌చెయిన్ అనే సంస్థ ధృవీకరించింది. ఈ వీడియోను నాన్-ఫంగబుల్ టోకెన్ (NFT) అని అంటారు. కరోనా మహమ్మారి సమయంలో ఇవి చాలా ప్రసిద్ది చెందాయి.

చాలామంది పెట్టుబడి పెడుతున్నారు…

ఇలాంటి వీడియోలను తయారుచేసే చాలామంది వ్యక్తులకు డబ్బు అవసరం, కానీ ఎక్కువమంది ఈ వీడియోలలో కూడా పెట్టుబడి పెడతారు. ఎందుకంటే ఎన్‌ఎఫ్‌టిలు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై వ్యూస్ దక్కించుకుంటాయి. ఎవరైనా వాటిని ఇష్టపడితే, చేసినవారు వాటి ద్వారా కోట్లు సంపాదించవచ్చు. బ్లాక్‌ చెయిన్ టెక్నాలజీ ఇటువంటి వీడియోలను డూప్లికేట్ కాకుండా చూస్తుంది.

ఈ వీడియోలో ఏముంది?

పాబ్లో విక్రయించిన ఆర్ట్ వీడియోలో డొనాల్డ్ ట్రంప్ పడిపోయినట్లు కనిపిస్తుంది. ఆయన శరీరంపై అనేక పచ్చబొట్లు, ఎన్నో ప్రకటనలు ఉన్నాయి. ఫిబ్రవరిలో ఈ వీడియో అత్యధిక ధరకు అమ్ముడైంది.

పెట్టుబడికి కొత్త మార్గాలు…

ఈ మధ్యకాలంలో మీరు పెట్టుబడి పెట్టేందుకు అనేక మార్గాలు కొత్తగా పుట్టుకొచ్చాయి. ఒకవేళ రోజుకు 8 నుంచి 10 గంటలు కంప్యూటర్ పై వర్క్ చేసినట్లయితే.. డిజిటల్ వరల్డ్ లో ఎమోషన్స్ తో కూడిన ఎన్నో ఆర్ట్స్ ను మీరు క్రియేట్ చేయగలరు. ఒపెన్స్ అనే సంస్థ సహ వ్యవస్థాపకుడు అలెక్స్ మాట్లాడుతూ.. ఎన్‌ఎఫ్‌టిలలో పెట్టుబడి పెట్టే పెట్టుబడిదారులు ఒక నియమాన్ని గుర్తించుకోవాలని.. వారి వీడియోలకు సంబంధించి ధరలు ఎప్పుడైనా సరే హైలెవెల్ చేరుకుంటాయని అన్నారు. ఇది ఒక కొత్త పెట్టుబడి వేదికగా మారింది. ఏదైనా వీడియో ఆర్ట్ ఇక్కడ ప్రశంసించబడితే, ధర ఎక్కువ పలుకుతుందన్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి:

గురకపెట్టి నిద్రపోయిన కాపలా కుక్క.. గన్ పెట్టి షాపును దోచుకున్న దొంగ.. మధ్యలో అదిరిపోయే ట్విస్ట్..!

లోదుస్తులను మాస్క్‌గా ధరించిన మహిళ.. వీడియో వైరల్.. నెట్టింట నవ్వులు పువ్వులు..

పవన్ కళ్యాణ్‌కు నాలుగో భార్యగా ఉంటాను.. నెటిజన్ ప్రశ్నకు ఆషూ ఆన్సర్.. వైరల్ ట్వీట్.!

Bigg Boss Season 5: బిగ్ బాస్ సీజన్ 5.. రేసులో ఉన్న కంటెస్టెంట్లు వీరే.. వివరాలు ఇవే..!

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu