గురకపెట్టి నిద్రపోయిన కాపలా కుక్క.. గన్ పెట్టి షాపును దోచుకున్న దొంగ.. మధ్యలో అదిరిపోయే ట్విస్ట్..!

Husky Dog Snooze: లక్కీ అనే కుక్కను ఓ షాపు యజమాని తన బంగారు దుకాణానికి కాపలాగా పెట్టుకున్నాడు.ఎవరైనా దొంగ వస్తే టక్కున లేచి అరిచి భయపెడుతుందని ..

  • Ravi Kiran
  • Publish Date - 5:30 pm, Mon, 1 March 21
గురకపెట్టి నిద్రపోయిన కాపలా కుక్క.. గన్ పెట్టి షాపును దోచుకున్న దొంగ.. మధ్యలో అదిరిపోయే ట్విస్ట్..!

Husky Dog Snooze: లక్కీ అనే కుక్కను ఓ షాపు యజమాని తన బంగారు దుకాణానికి కాపలాగా పెట్టుకున్నాడు.ఎవరైనా దొంగ వస్తే టక్కున లేచి అరిచి భయపెడుతుందని ఆ యజమాని అనుకున్నాడు. అయితే అతడు అనుకున్న సీన్ రివర్స్ అయింది. ఓ దొంగ వచ్చి షాపును దోచుకుంటుంటే.. అరవటం సరికదా.. గురక పెట్టి మరీ నిద్రపోయింది. షాపుతో తనకు సంబంధం లేనట్లుగా ప్రశాంతంగా నిద్రలోకి జారుకుంది. అసలు ఆ మ్యాటర్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

థాయ్‌ల్యాండ్‌లోని చియాంగ్ మాయ్ సిటీలోని ఓ బంగారు దుకాణంలో దోచుకునేందుకు బ్లాక్ టోపీ, ముఖానికి మాస్క్ పెట్టుకుని ఓ దొంగ చొరబడ్డాడు. యజమాని నుదిటికి గన్ గురి పెట్టి.. అతన్ని బెదిరించి.. షాపులో ఉన్న బంగారు నగలను పట్టుకుని ఉడాయించాడు. ఇంత తతంగం జరిగినా కూడా అక్కడ కాపలాగా ఉన్న కుక్క మాత్రం ఇదేం పట్టనట్లు ప్రశాంతంగా గురకపెట్టి నిద్రపోయింది. అయితే ఇప్పుడే అసలు ట్విస్ట్ బయటపడింది. ఆ దొంగ మళ్లీ తిరిగి వచ్చి.. ఇదంతా ఫేక్ దొంగతనం అని.. షాపులో భద్రత ఎలా ఉందో పరీక్షించేందుకు పోలీసులు ఏర్పాటు చేసిన మాక్ డ్రిల్ అని స్పష్టం చేశాడు. నిజంగా ఏదైనా దొంగతనం జరిగితే.. కుక్క మేల్కొంటుందా అని కూడా ప్రశ్నించాడు.

”మా కుక్క మనుషుల భావాలను అర్ధం చేసుకోగలదు. ఎప్పుడూ హుషారుగా.. ఏ చిన్న శబ్దం వచ్చినా వెంటనే రెస్పాండ్ అవుతుంది. సీసీటీవీ కెమెరాలలో నా హావభావాలను చూస్తే.. మీకే అర్ధమవుతుంది అని ఆ షాపు యజమాని అన్నాడు. అలాగే దొంగ వేషంలో వచ్చిన పోలీస్.. ఆ కుక్కకు తాను ముందే తెలుసని చెప్పాడు. దీనితో మ్యాటర్ అంతా అందరికీ అర్ధమైంది. అయితే దొంగతనం జరిగినప్పుడు మాత్రం కుక్క అలా గురకపెట్టి నిద్రపోవడం చాలామంది నెటిజన్లకు మాత్రం తీవ్ర అసహానాన్ని కలగజేసింది.

మరిన్ని ఇక్కడ చదవండి:

న్యూడ్ ఫోటో అడిగిన నెటిజన్‌కు యాంకర్ శ్రీముఖి అదిరిపోయే కౌంటర్.. ఏం షేర్ చేసిందంటే.!

Shanmukh Jaswanth Case: షణ్ముక్ జశ్వంత్ ఆ ఒక్క మాట.!! రెండు గంటల పాటు పోలీసులకు చుక్కలు..!