AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shanmukh Jaswanth Case: షణ్ముక్ జశ్వంత్ ఆ ఒక్క మాట.!! రెండు గంటల పాటు పోలీసులకు చుక్కలు..!

Shanmukh Jaswanth Arrested: హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబ‌రు 10లో శనివారం రోడ్డు ప్రమాదం సంభ‌వించిన విషయం తెలిసిందే. యూట్యూబ్ ఫేమ్..

Shanmukh Jaswanth Case: షణ్ముక్ జశ్వంత్ ఆ ఒక్క మాట.!! రెండు గంటల పాటు పోలీసులకు చుక్కలు..!
Shanmukh Jaswanth Arrested
Ravi Kiran
| Edited By: Team Veegam|

Updated on: Mar 01, 2021 | 1:15 PM

Share

Shanmukh Jaswanth Arrested: హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబ‌రు 10లో శనివారం రోడ్డు ప్రమాదం సంభ‌వించిన విషయం తెలిసిందే. యూట్యూబ్ ఫేమ్‌, టిక్‌టాక్ స్టార్ ష‌ణ్ముఖ్ జ‌శ్వంత్ న‌డుపుతున్న కారు అదుపుత‌ప్పి మ‌రో రెండు కార్లు, రెండు బైక్‌ల‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడిన విషయం విదితమే. షణ్ముఖ్‌ జశ్వంత్‌కు బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ చేయగా.. 170 రీడింగ్ వచ్చింది. ఐపీసీ సెక్షన్ 337, 279 కింద పోలీసులు కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు.. అతడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో షణ్ముఖ్‌ జస్వంత్ హంగామా చేసినట్లు తెలుస్తోంది. అతడు పలు కీలక వ్యాఖ్యలు చేసినట్లుగా కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

‘నా ఒక్కో వీడియోకు కొట్లలో వ్యూస్ వస్తాయని దబాయించిన షణ్ముఖ్‌.. పోలీసులతో పలువురు పెద్దలకు ఫోన్లు చేయించేందుకు ప్రయత్నాలు చేసినట్లుగా సమాచారం. పోలీసులు అందుకు వీలుకాదని చెప్పినా కూడా వినకుండా.. డబ్బులు ఇచ్చేందుకు కూడా సిద్ధమయ్యేడట. తప్పతాగి రెండు కార్లు, రెండు బైక్‌ల‌ను ఢీకొట్టడమే కాకుండా.. ”ఎవరికీ దెబ్బలు తగలలేదు కదా.. హాస్పిటల్‌లో కూడా జాయిన్ కాలేదు” అని ప్రశ్నించడం గమనార్హం.

కాగా, షణ్ముఖ్‌ జస్వంత్ ‘సాఫ్ట్‌వేర్ డెవలపర్’ అనే వెబ్ సిరీస్ ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. అటు ‘సూర్య’ అనే మరో వెబ్ సిరీస్‌ను షణ్ముఖ్‌ జస్వంత్ ఇటీవలే తన యూట్యూబ్ ఛానల్‌లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ రెండు సిరీస్‌లు కోట్లలో వ్యూస్ రాబడుతున్నాయి. కాగా, సుమారు రెండు గంటల పాటు జూబ్లీహిల్స్ స్టేషన్‌లో షణ్ముఖ్‌ జస్వంత్ రచ్చ చేసి.. పోలీసులను ఇబ్బందికి గురి చేశాడట.

మరిన్ని ఇక్కడ చదవండి:

కస్టమర్‌పై అరిస్తే.. డెలివరీ బాయ్‌ను మంచి పని చేశావంటున్నారు.. కారణం ఏంటంటే.. వీడియో వైరల్..!

న్యూడ్ ఫోటో అడిగిన నెటిజన్‌కు యాంకర్ శ్రీముఖి అదిరిపోయే కౌంటర్.. ఏం షేర్ చేసిందంటే.!

హైదరాబాద్‌లోని బాలానగర్‌ ఫ్లైఓవర్‌ కుప్పకూలిందా.? వైరల్ అవుతున్న వీడియో.! ఎప్పటిదంటే..!!