AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కస్టమర్‌పై అరిస్తే.. డెలివరీ బాయ్‌ను మంచి పని చేశావంటున్నారు.. కారణం ఏంటంటే.. వీడియో వైరల్..!

Frustrated Domino's delivery driver: కడుపు నింపుకునేందుకు డెలివరీ బాయ్స్ ప్రతీ రోజూ కష్టపడుతుంటారు. ప్రొద్దున నుంచి రాత్రి వరకు షిఫ్ట్స్..

కస్టమర్‌పై అరిస్తే.. డెలివరీ బాయ్‌ను మంచి పని చేశావంటున్నారు.. కారణం ఏంటంటే.. వీడియో వైరల్..!
Ravi Kiran
|

Updated on: Feb 26, 2021 | 4:45 PM

Share

Frustrated Domino’s delivery driver: కడుపు నింపుకునేందుకు డెలివరీ బాయ్స్ ప్రతీ రోజూ కష్టపడుతుంటారు. ప్రొద్దున నుంచి రాత్రి వరకు షిఫ్ట్స్ అనేవి పట్టించుకోకుండా కస్టమర్లకు డెలివరీలను సరైన సమయానికి అందిస్తుంటారు. అలా కష్టపడుతున్న వారు.. తమ కష్టాన్ని గుర్తించి కస్టమర్ ఏదైనా టిప్ ఇస్తారేమోనని ఆశిస్తుంటారు. తక్కువ మొత్తంలో టిప్ దొరికినా చాలు అదే పదివేలుగా అనుకుంటూ బ్రతుకు జట్కా బండిని నడిపేస్తుంటారు.

ఇదిలా ఉంటే కరోనా సంక్షోభం కారణంగా వారి బ్రతుకులు దయనీయ స్థితికి చేరుకున్నాయి. గత 10 నెలలుగా కష్టానికి మించి శ్రమిస్తున్నారు. రోజూ 12-15 గంటల షిఫ్టులలో పని చేస్తున్నారు. ఇలాంటి కష్ట సమయాల్లో కస్టమర్ల నుంచి వచ్చే చిన్న ప్రశంస, టిప్ వారిని ఉత్తేజపరుస్తుంటాయి. అయితే చాలామంది కస్టమర్లు డెలివరీ బాయ్స్‌కు టిప్స్ ఇచ్చేందుకు ఇష్టపడరు. ఇక ఇలాంటి సంఘటనే ఒకటి తాజాగా చోటు చేసుకుంది. (Frustated Domino’s Delivery Driver)

డామినోస్‌కు చెందిన ఓ డెలివరీ బాయ్ వర్షం వస్తున్నా కూడా లెక్క చేయకుండా ఓ ఆర్డర్ తీసుకెళ్లి ఇచ్చాడు. కస్టమర్ లేట్‌గా వచ్చినా ఐదు నిమిషాల పాటు వర్షంలోనే నిల్చుని అతని కోసం వెయిట్ చేశాడు. ఆర్డర్ ఇచ్చిన తర్వాత కస్టమర్ తనకు టిప్ ఇవ్వకపోవడంతో సదరు డెలివరీ బాయ్‌కు చిర్రెత్తుకొచ్చింది. ఆ డెలివరీ బాయ్ మేనేజ్‌మెంట్‌తో పాటు కస్టమర్‌పై గట్టిగా అరుస్తూ.. ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ తతంగం మొత్తం అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది.

టిక్‌టాక్‌లో అప్‌లోడ్ చేసిన ఈ వైరల్ క్లిప్‌లో డెలివరీ బాయ్ కౌంటర్ పక్కన నిలబడి “నో” అంటూ అరుస్తున్నట్లు కనిపిస్తుంది. ఇక కెమెరా వెనుక ఉన్న వ్యక్తి.. “బ్రో, జస్ట్ కామ్ డౌన్.. ఇంకా చాలా డెలివరీలు చేయాలి” అంటూ పేర్కొన్నాడు. “నేను ఇకపై ఇక్కడ పనిచేయను. వర్షంలో ఐదు నిమిషాలు నిల్చున్నా టిప్ ఇవ్వలేదు?” అంటూ డెలివరీ బాయ్ పక్కన ఉన్న పిజ్జా బాక్స్‌లను చేతితో కొట్టి తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. కాగా, ఈ వీడియోపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. (Frustated Domino’s Delivery Driver)

మరిన్ని ఇక్కడ చదవండి:

హైదరాబాద్‌లోని బాలానగర్‌ ఫ్లైఓవర్‌ కుప్పకూలిందా.? వైరల్ అవుతున్న వీడియో.! ఎప్పటిదంటే..!!

Fight With Cheetah: చావు తప్పదనుకుని.. చిరుతతో ఫైట్‌ చేసిన రియల్‌ హీరో.. చివరికి ఏమైందంటే.!

ఈ వింత షార్క్ పిల్ల.. అదృష్టానికి బ్రాండ్ అంబాసిడర్‌ అట.! నిజంగానే కోట్లు తెచ్చిపెడుతుందా.?