Fight With Cheetah: చావు తప్పదనుకుని.. చిరుతతో ఫైట్‌ చేసిన రియల్‌ హీరో.. చివరికి ఏమైందంటే.!

Karnataka Man Fight Leopard: మచ్చల పులి మీదకు దూకితే ఎట్టా ఉంటదో తెలుసా? .. ఇది ఇప్పటిదాకా సినిమా డైలాగ్ మాత్రమే. కానీ మీదకొచ్చిన..

Fight With Cheetah: చావు తప్పదనుకుని.. చిరుతతో ఫైట్‌ చేసిన రియల్‌ హీరో.. చివరికి ఏమైందంటే.!
Follow us
Ravi Kiran

|

Updated on: Feb 24, 2021 | 4:23 PM

Karnataka Man Fight Leopard: మచ్చల పులి మీదకు దూకితే ఎట్టా ఉంటదో తెలుసా? .. ఇది ఇప్పటిదాకా సినిమా డైలాగ్ మాత్రమే. కానీ మీదకొచ్చిన మచ్చల పులికి మొనగాడొకడు ఎదురొస్తే ఆ సీన్ ఎట్టా ఉంటడో తెలుసా.. ! దాన్నే ఇప్పుడు చూడబోతున్నారు. చిరుతతో ఫైటింగ్. ఏ సినిమాలో సీన్ అని అనుకుంటున్నారా.! రీల్‌ సీన్‌ కాదు.. రియల్‌ సీన్‌. చిరుతతో హోరాహోరీ తలపడి.. దాన్ని హతమార్చాడో వ్యక్తి. కట్టుకున్న భార్య కోసం, కన్న కూతురి కోసం తన ప్రాణాలకు తెగించి పోరాటం చేశాడు. దాని అంతు చూసి.. తన వాళ్లను కాపాడుకున్నాడు.

మీరు చూస్తున్న ఈ సీన్‌.. కర్ణాటకలోని హసన్‌ జిల్లా జరిగింది. భార్య, కూతురుతో కలిసి టూవీలర్‌పై వెళ్తున్న రాజ్‌గోపాల్‌ నాయక్‌పైకి చిరుత ఒక్కసారిగా దూకింది. ముగ్గురు బైకు పైనుంచి కింద పడిపోయారు. వెంటనే చిరుత వారిపై పంజా విసిరింది. దాని బారి నుంచి భార్యను, కుమార్తెను రక్షించుకునేందుకు రాజ్‌గోపాల్‌ నాయక్‌ వీరోచిత పోరాటం చేశాడు. చివరికి దాన్ని హతమార్చి తమ ప్రాణాలతో పాటు కుటుంబాన్ని రక్షించుకున్నాడు. కాగా, చిరుత దాడిలో రాజగోపాల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అతని భార్య, కుమార్తె కూడా గాయపడ్డారు. ముగ్గురినీ స్థానికులు ఆస్పత్రికి తరలించారు.

మరిన్ని ఇక్కడ చదవండి:

ఈ ఫోటోలోని రాజకీయ నాయకుడిని గుర్తుపట్టారా.! ఎక్కడో చూసినట్లు ఉందా.?

ఏటీఎం పిన్ మర్చిపోయారా.! డోంట్ వర్రీ.. ఎస్‌బీఐ సరికొత్త ఫీచర్.. వివరాలివే.!

రెప్పపాటులో ఘోరం.. సెల్‌ఫోన్ మోజులో ఒకరు.. ర్యాష్ డ్రైవింగ్‌తో మరొకరు.. వీడియో వైరల్.!

క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఐపీఎల్ వేదికలు ఖరారు.. వివరాలు ఇవిగో.!