AP Ex Minister: ఈ ఫోటోలోని రాజకీయ నాయకుడిని గుర్తుపట్టారా.! ఎక్కడో చూసినట్లు ఉందా.?

AP Ex Minister: ఈ ఫోటోలో ఉన్న నాయకుడిని గుర్తు పట్టారా.? తీక్షణంగా చూడండి ఎక్కడో చూసినట్లు అనిపిస్తుంది.!! నిన్న మొన్నటి దాకా ఆయన...

AP Ex Minister: ఈ ఫోటోలోని రాజకీయ నాయకుడిని గుర్తుపట్టారా.! ఎక్కడో చూసినట్లు ఉందా.?
Follow us

| Edited By: Team Veegam

Updated on: Feb 22, 2021 | 7:23 PM

AP Ex Minister: ఈ ఫోటోలో ఉన్న నాయకుడిని గుర్తు పట్టారా.? తీక్షణంగా చూడండి ఎక్కడో చూసినట్లు అనిపిస్తుంది.!! నిన్న మొన్నటి దాకా ఆయన ఓ జాతీయ పార్టీకి అధ్యక్షుడు.. అంతేకాకుండా ఏపీ రాజకీయాలలో చక్రం తిప్పిన నాయకుడు. కానీ ఆదివారం సాధారణ వ్యక్తిలా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆయనెవరో కాదు మాజీ మంత్రి, ఏపీసీసీ మాజీ చీఫ్ రఘువీరారెడ్డి.

ఎందుకో ఏమిటో తెలియదు… పాలిటిక్స్ వదిలేసి… లైఫ్ స్టైల్ మార్చేసుకుని కొత్త మనిషి అయిపోయారు రఘువీరారెడ్డి. ఆదివారం ఏపీలో జరిగిన పంచాయితీ ఎన్నికల నాలుగో విడత పోలింగ్‌లో ఓటు వేసేందుకు ఒక పాత మోపెడ్ మీద వెళ్తుంటే.. ఒక్కసారిగా కెమెరాలు క్లిక్ మనిపించాయి. నాలుగో విడత పంచాయితీ ఎన్నికల్లో భాగంగా అనంతపురం జిల్లా గంగులవానిపాలెంలో పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రఘువీరారెడ్డి ఓ పాత మోపెడ్ వాహనంపై తన సతీమణి సునీతతో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చారు.

పూర్తిగా నెరిసిన గెడ్డంతో.. పక్కా రాయలసీమ స్టైల్‌లో ఎవరూ గుర్తుపట్టలేని విధంగా రఘవీరా మారిపోయారు. నిన్న మొన్నటి వరకు రాజకీయాలను శాసించిన వ్యక్తేనా అనిపించేలా రఘువీరా కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీరు కూడా ఓ లుక్కేయండి.!

”ఈయనను మీరు గుర్తు పట్టారా.! రాజకీయాలను విడిచిపెట్టి, రైతుగా మారిపోయారు. కొత్త మనిషి అయిపోయారు…. ఆయనెవరో కాదండీ.. మాజీ మంత్రి, మాజీ ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి. ఓల్డ్ మోపెడ్‌పై ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రానికి వెళ్తూ కనిపించారు. ఆయన రైతుగా మారిన తర్వాత సంతృప్తి పొందినట్లుగా భావిస్తున్నా” అని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు.

గుర్తు పట్టారా వీరిని… పాలిటిక్స్ వదిలేసి రైతుగా మారి లైఫ్ స్టైల్ కూడా మార్చేసుకుని… ఒక కొత్త మనిషి అయిపోయాడు…….

IPL 2021 Schedule: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఐపీఎల్ వేదికలు ఖరారు.. వివరాలు ఇవిగో.!

జంగిలిగొండ గుట్టల్లో వింత ఆకారం.. ఊరిని వణికిస్తున్న దెయ్యం భయం.. వైరల్‌గా మారిన వీడియో..!

రైతులకు గుడ్‏న్యూస్ అందించిన కేంద్రం.. వారి అకౌంట్లలోకి మళ్లీ రూ.2వేలు.. ఎప్పటినుంచో తెలుసా..