ముగిసిన ఏపీ పంచాయతీ ఎన్నికలు.. పల్లె పోరులో వైఎస్సార్‌సీపీ మద్దతుదారుల విజయకేతనం.. 10వేలకు పైగా పంచాయతీల్లో పాగా

AP panchayat elections 2021 results: నాలుగు విడతల్లో జరిగిన ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికలు చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిశాయి. అదీ నుంచి ఉత్కంఠ రేపిన ఎన్నిలు.. పూర్తి కావడంపట్ల రాష్ట్ర ఎన్నికల సంఘం హర్షం వ్యక్తం చేసింది.

ముగిసిన ఏపీ పంచాయతీ ఎన్నికలు.. పల్లె పోరులో వైఎస్సార్‌సీపీ మద్దతుదారుల విజయకేతనం.. 10వేలకు పైగా పంచాయతీల్లో పాగా
Balaraju Goud

| Edited By: Team Veegam

Feb 22, 2021 | 2:43 PM

AP panchayat elections 2021 results : నాలుగు విడతల్లో జరిగిన ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికలు చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిశాయి. అదీ నుంచి ఉత్కంఠ రేపిన ఎన్నిలు.. పూర్తి కావడంపట్ల రాష్ట్ర ఎన్నికల సంఘం హర్షం వ్యక్తం చేసింది.

రాష్ట్రంలోని 13,371 గ్రామ పంచాయతీలు ఉండగా,13,097 గ్రామ పంచాయతీలలో ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నోటిఫికేషన్లు జారీ చేసింది. మొత్తంగా నాలుగు విడతల్లో ఎన్నికలు జరిగాయి. ఇందులో 10 వేలకు పైగా గ్రామ పంచాయతీల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు విజయం సాధించారు. మొదటి మూడవ విడతల్లో ఎన్నికలు జరిగిన వాటిలో 7,869 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌ పదవులను వైఎస్సార్‌సీపీ అభిమానులు చేజిక్కించుకున్నారు. నాలుగో విడతలోనూ ఆదివారం రాత్రి 12.30 గంటలకు అందిన సమాచారం మేరకు 80 శాతానికి పైగా స్థానాలను కైవసం చేసుకున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఎన్నికల్లో ఏకపక్షమైన ఫలితాలు వెలువడ్డాయి. 13 జిల్లాల్లోనూ, నాలుగు విడతల్లో ఒకే రకమైన ఫలితాలు రావడం పట్ల వైసీపీ శ్రేణుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. ఈ తరహా ఫలితాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలోనే మొదటి సారని చెబుతున్నారు. గ్రామాల వారీగా ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో ప్రస్తుత ఫలితాలు.. 2019 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ఏమాత్రం తీసిపోవని అభివర్ణిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించడంతో గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం వద్ద అభిమానులు, కళాకారుల సంబరాలు జరుపుకున్నారు.

చివరి విడత పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో 2,743 సర్పంచ్‌ పదవులకు ఆదివారం ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్‌ కొనసాగింది. ఆయా గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌ పదవులకు 7,475 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. మొత్తం 3,299 గ్రామ పంచాయతీల్లో ఈ విడతలో ఎన్నికలు జరిపేందుకు నోటిఫికేషన్లు జారీ కాగా, అందులో 554 చోట్ల సర్పంచ్‌ పదవులు ఏకగ్రీవమయ్యాయి. వైఎస్సార్‌ కడప జిల్లాలో రెండు చోట్ల అభ్యర్థులు ఎవరూ నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో మిగిలిన 2,743 సర్పంచ్‌ స్థానాలకు పోలింగ్‌ జరిగింది. ఆయా పంచాయతీల్లో పోలింగ్‌ ముగిసిన వెంటనే నాలుగు గంటల నుంచే ఓట్ల లెక్కింపు ప్రారంభించారు.

మిగిలిన మూడు విడతల కంటే నాలుగో విడత ఓటింగ్‌ శాతం కాస్త ఎక్కువగా నమోదైంది. తొలి మూడు విడతల్లో 80 – 82 శాతం మధ్య ఓటింగ్‌ శాతం నమోదు కాగా, నాలుగో విడతలో 82.85 శాతం పోలింగ్‌ నమోదైంది. విజయనగరం జిల్లాలో అత్యధికంగా 87.09 శాతం, నెల్లూరు జిల్లాలో అత్యల్పంగా 76 శాతం పోలింగ్‌ నమోదైంది. నాలుగు విడతల్లో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా 81.79 శాతం పోలింగ్‌ నమోదైనట్టు పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ గిరిజా శంకర్‌ తెలిపారు.

Read Also…  నారాయణస్వామి నెగ్గుతారా.. ఓడుతారా.. పుదుచ్చేరిలో బలపరీక్షపై కొనసాగుతున్న ఉత్కంఠ

రైతులకు గుడ్‏న్యూస్ అందించిన కేంద్రం.. వారి అకౌంట్లలోకి మళ్లీ రూ.2వేలు.. ఎప్పటినుంచో తెలుసా..

బట్టతల రావడానికి కారణాలు ఏంటో తెలుసా.. ఒక్కసారి మీకు ఈ లక్షణాలు ఉన్నాయో.. లేదో చెక్ చేసుకోండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu