బట్టతల రావడానికి కారణాలు ఏంటో తెలుసా.. ఒక్కసారి మీకు ఈ లక్షణాలు ఉన్నాయో.. లేదో చెక్ చేసుకోండి..

Beauty Hair Care : ఈ మోడ్రన్ ప్రపంచంలో , మోడ్రన్ లైఫ్ స్టైల్, ఫుడ్స్ హ్యాబిట్స్ వల్ల స్త్రీలలోనే కాదు, పురుషుల్లో కూడా జుట్టు సమస్యలు అధికమౌతున్నాయి.

  • uppula Raju
  • Publish Date - 5:51 am, Mon, 22 February 21
బట్టతల రావడానికి కారణాలు ఏంటో తెలుసా.. ఒక్కసారి మీకు ఈ లక్షణాలు ఉన్నాయో.. లేదో చెక్ చేసుకోండి..

Beauty Hair Care : ఈ మోడ్రన్ ప్రపంచంలో , మోడ్రన్ లైఫ్ స్టైల్, ఫుడ్స్ హ్యాబిట్స్ వల్ల స్త్రీలలోనే కాదు, పురుషుల్లో కూడా జుట్టు సమస్యలు అధికమౌతున్నాయి. ముఖ్యంగా పురుషులు బట్టతలను ఎక్కువగా ఫేస్ చేస్తున్నారు. ఫుడ్ హ్యాబిట్స్, జుట్టుకు సరైన కేర్ తీసుకోకపోవడం వల్ల చిన్న వయస్సులో బట్టతలకు దారితీస్తున్నది. పురుషులు ఎదుర్కుంటున్న హెయిర్ ప్రాబ్లెమ్స్ లో బట్టతల సమస్య ఒకటి. బట్టతల కారణమైనప్పుడు తలలో పూర్గిగా వెంట్రుకలు లేకపోవడం లేదా జుట్టు పల్చబడటం జరుగుతుంది. ఇలాంటి సమస్యను అలోపిషియా అని పిలుస్తారు. అలోపిషియాకు గురైన వ్యక్తుల్లో జుట్టు పూర్తిగా రాలిపోతుంది . సాధారణంగా దీన్ని హెయిర్ లాస్ గా కూడా సూచిస్తారు. రెగ్యులర్ గా తలస్నానం చేసినప్పుడు 250పైవరకూ వెంట్రుకలు రాలిపోవడాన్ని అలోపిషియాగా గుర్తిస్తారు.

బట్టతలకు ముఖ్యకారణాలు ఇలా ఉన్నాయి. హెయిర్ ఫాలిసెల్స్ మూసుకుపోవడం వల్ల జుట్టు రాలడం అధికమౌతుంది. పురుషుల్లో ఎక్కువగా గుర్గించాల్సిన విషయం. అందుకు వివిధ కారణాలు ఉన్నాయి. వాటిలో కొన్నిపురుషుల్లో కూడా హార్మోనుల్లో మార్పులు, ఏజింగ్, హెరిడిటి, ఐరన్ మరియు ప్రోటీన్ లోపాలు, అనుకోకుండా బరువు తగ్గడం, విటమిన్ ఎ అధికంగా తీసుకోవడం, తలలో ఇన్ఫెక్షన్స్, ట్రూమా, డ్రగ్స్ తీసుకోవడం, మెడికల్ కండీషన్, అనీమియా, డైట్ లో మార్పులు, బర్త్ కంట్రోల్ ఓరల్ కాంట్రాసెప్టివ్స్ తీసుకోవడం, స్ట్రెస్, మోనోపాజ్, థైరాయిడ్ సమస్యల వల్ల జుట్టు రాలడం ఎక్కువగా ఉంటుంది.

బట్టతల రావడానికి ముందు లక్షణాలు ఇలా ఉంటాయి. అతి తక్కువ సమయంలో ఎక్కువ జుట్టు రాలిపోవడం, హెయిర్ లాస్ వల్ల తలలో అక్కడక్కడ ప్యాచెస్‌గా ఏర్పడటం. తలకు బాల్డ్‌గా కనిపిస్తుంది. హెయిర్ లైన్ తగ్గడం, జుట్టు పల్చబడటం, గుండ్రటి ప్యాచ్‌లు, స్ట్రెస్, రాపిడ్ వెయిట్ లాస్, నెయిల్ సమస్యలు, వైట్ స్పాట్స్ తదితర సమస్యలు ఉంటాయి. అప్పుడు మనం జాగ్రత్త పడి డాక్టర్‌ను సంప్రదించాలి.

Sukanya Samriddhi Yojana: బ్యాంక్ ఆఫ్ బరోడా బంపర్ ఆఫర్.. రోజుకు రూ .35 ఆదా చేస్తే.. మీ కూతురు ఖాతాలో 5 లక్షల నిధి..

వరవరరావుకు ఎట్టకేలకు బెయిలు మంజూరు.. గోరేగావ్ కుట్ర కేసులో ఏడాది కాలంగా జైలు జీవితాన్ని గడుపిన విప్లవ కవి

Lockdown: దేశంలో మళ్లీ విజృంభిస్తోన్న కరోనా మహమ్మారి.. రేపటి నుంచి అక్కడ లాక్‌డౌన్‌ అమలు..