Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మతిమరుపుతో ఇబ్బంది పడుతున్నారా ? మెరుగైన జ్ఞాపకశక్తి కోసం వీటిని తినాలంటున్న నిపుణులు..

సాధారణంగా మనం ఇంట్లో ఏ వస్తువును ఎక్కడో పెట్టి మర్చిపోతుంటాం. కొన్ని సార్లు క్షణాల్లోనే ఎక్కడా పెట్టామనేది గుర్తుండదు. ఇక విద్యార్థులు ఎంత చదివినా మళ్లీ మళ్లీ చదువుతూనే ఉంటారు. తీరా పరీక్ష

మతిమరుపుతో ఇబ్బంది పడుతున్నారా ? మెరుగైన జ్ఞాపకశక్తి కోసం వీటిని తినాలంటున్న నిపుణులు..
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 22, 2021 | 9:04 AM

సాధారణంగా మనం ఇంట్లో ఏ వస్తువును ఎక్కడో పెట్టి మర్చిపోతుంటాం. కొన్ని సార్లు క్షణాల్లోనే ఎక్కడా పెట్టామనేది గుర్తుండదు. ఇక విద్యార్థులు ఎంత చదివినా మళ్లీ మళ్లీ చదువుతూనే ఉంటారు. తీరా పరీక్ష సమయానికి కొన్ని ముఖ్యమైన సమాధానాలను మర్చిపోయి.. బాధపడుతుంటారు. ఈ సమస్య ఆడవాళ్లలోనే కాకుండా పురుషులలో కూడా ఉంటుంది. ఇక మరికొందరు చేయాల్సిన పనిని కూడా కొన్ని సందర్భాల్లో మర్చిపోతుంటారు. అయితే వీటన్నింటికి కారణం జ్ఞాపక శక్తి లేకపోవడమే. ఇందుకు కారణం సరైన నిద్ర లేకపోవడం, హర్మోన్ల లోపం కూడా కావచ్చు. అయితే కొన్ని రకాల పదార్థాలను, కూరగాయలను తినడం వలన మెదడుకు సరైన పోషకాహరం అంది.. చురుగ్గా పనిచేస్తుంది. జ్ఞాపకశక్తిని మరింత మెరుగుపరుచుకోవడానికి కొన్ని రకాల ఆహార పదార్థాలను మనం రోజూ తీసుకునే డైట్‏లో మిలితం చేసుకోవడం వలన మెదడు చురుగ్గా మారడమే కాకుండా.. జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో తెలుసుకుందామా..

చేపలు, గుడ్లు..

చాలా మందికి నాన్ వెచ్ తినడమంటే చాలా ఇష్టం ఉంటుంది. అయితే మటన్, చికెన్ కాకుండా.. ఎక్కువగా చేపలను తినడం అలవాటు చేసుకొవాలి. వీటిలోని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు మెదుడుకు ఆరోగ్యాన్ని అందించి జ్ఞాపకశక్తిని పెంచుతాయి. అంతేకాదు ఒత్తిడి నుంచి కూడా ఇవి దూరం చేస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే గుడ్డులోని విటమిన్ బీ6, బీ12, ఫోలేట్ జ్ఞాపకశక్తిని పెరిగేలా చేస్తాయి. మెదడులోని చక్కెర స్థాయిలను తగ్గించి ఆరోగ్యంగా ఉండేందుకు సహయపడతాయని చెబుతున్నారు.

గుమ్మడి గింజలు..

సాధారణంగా గుమ్మడి గింజలను తినడానికి ఎవరూ ఇష్టపడరు. అయితే ఇవి ఆరోగ్యాన్ని ఎంతో మేలు చేస్తాయంటా. వీటిలో ఉండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు మెదడును మాత్రమే కాకుండా శరీరాన్ని మరింత ఆరోగ్యంగా ఉంచేందుకు తొడ్పతతాయి. ఈ గింజల్లోని మెగ్నీషియం, ఐరన్, జింక్, కాపర్ శరీరంలోని నరాల వ్యవస్థ సరిగ్గా పనిచేయడానికి సహయపడతాయి. వీటిని మనం తీసుకునే ఆహారంలో జోడించడం వలన జ్ఞాపకశక్తీ పెరుగుతుంది.

డార్క్ చాక్లెట్..

చాక్లెట్స్‏ను ఇష్టపడనివారుండరు. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు ప్రతి ఒక్కరు చాక్లెట్స్ తినడానికి ఇష్టపడుతుంటారు. కోకో పౌడర్, డార్క్ చాక్లెట్స్‏లోని ఫ్లవనాయిడ్లు యాంటీ ఆక్సిడెంట్స్ మెదడును శక్తివంతం చేయడతోపాటు చురుగ్గా పనిచేసేందుకు తొడ్పడతాయి. అలాగే వీటిని తీసుకోవడం వలన ఆలోచనా శక్తిక జ్ఞాపకశక్తిని పెంచడమే కాకుండా.. ఒత్తిడిని తగ్గించేందుకు సహయపడతాయి.

బ్రకోలి…

బ్రకోలిని మనం ఎప్పుడు ఏదో ఒక వంటకంలో ఉపయోగిస్తూనే ఉంటాం. కానీ చాలా మంది వీటిని తినడానికి ఇష్టపడరు. కానీ ఇవి మెదడు చురుగ్గా ఉండేందుకు తొడ్పడుతుంది. దీంట్లో విటమిన్-కె అధికంగా ఉంటుంది. ఇది మెదడును ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉంచుతుంది. మనం తీసుకునే ఆహారంలో ఎక్కువగా ఈ బ్రకోలిని వాడుతుంటే జ్ఞాపకశక్తి మెరుగుపడడమే కాకుండా ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది.

Also Read:

cashews benefits: జీడిపప్పును ఎక్కువగా తింటున్నారా? అయితే ఈ విషయాలను తెలుసుకోవాల్సిందే..