cashews benefits: జీడిపప్పును ఎక్కువగా తింటున్నారా? అయితే ఈ విషయాలను తెలుసుకోవాల్సిందే..

కరోనా వైరస్ ప్రభావంతో ప్రతి ఒక్కరి జీవన స్థితిలో మార్పులు సంభవించాయి. ఉద్యోగాలు చేస్తూ.. సరైన ఆహారం తీసుకోకుండా ఉండేవారు.. ఈ వైరస్ ప్రభావంతో ఇంటి భోజనాలపై

cashews benefits: జీడిపప్పును ఎక్కువగా తింటున్నారా? అయితే ఈ విషయాలను తెలుసుకోవాల్సిందే..
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 18, 2021 | 3:27 PM

cashews benefits: కరోనా వైరస్ ప్రభావంతో ప్రతి ఒక్కరి జీవన స్థితిలో మార్పులు సంభవించాయి. ఉద్యోగాలు చేస్తూ.. సరైన ఆహారం తీసుకోకుండా ఉండేవారు.. ఈ వైరస్ ప్రభావంతో ఇంటి భోజనాలపై దృష్టి సారించారు. రోగ నిరోధక శక్తిని పెంపోందించే పదార్థాలకు ప్రాముఖ్యత ఇస్తున్నారు. అయితే శరీరానికి పోషకాలను అందించేవాటిలో డ్రైఫ్రూట్స్, నట్స్ చాలా ముఖ్యమైనవి. ఇందులో ముఖ్యంగా జీడిపప్పు.. దీని కాస్త ఎక్కవైనప్పటికీ.. దీనివలన కలిగే ప్రయోజనాలు తెలిస్తే అసలు వదిలిపెట్టరు. అవెంటో తెలుసుకుందాం.

జీడిపప్పులో చక్కెర శాతం తక్కువగా ఉంటుంది. అలాగే ఇందులో ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఎముకలు, మెదడుకు మేలు చేకూర్చే పోషకాలైన రాగి, మెగ్నీషియం, యాంటిఆక్సిడెంట్లు లాంటివి కూడా ఉంటాయి. అలాగే వీటిని తక్కువ మోతాదులో తీసుకుంటే బరువు తగ్గడానికి కూడా తోడ్పడతాయి. జీడిపప్పు రోజూ తినడం వలన డయాబెటిస్ రోగులకు మంచి డైట్‏గా పనిచేస్తాయి. ఇవి రుచితో పాటు పోషకాలను అందించడమే కాకుండా శరీరానికి అధికంగా ప్రొటీన్లు కూడా ఇందులో పుష్కలంగా ఉంటాయి.

జీడిపప్పులో ప్రొటీన్లతో పాటు కొవ్వులు కూడా అధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలను చేకురుస్తుంది. అలాగని వీటిని అధిక మోతాదులో కూడా తీసుకోకుడదు. జీడిపప్పులో సూక్ష్మ పోషకాలు కూడా ఉన్నాయి. ఇందులోని రాగి మెదడు, రోగనిరోధక వ్యవస్థ మెరుగుపరిచేందుకు ఉపయోగపడుతుంది. అలాగే విటమిన్ కే.. రక్తం గడ్డకట్టే కడ్డకట్టకుండా చేయడానికి సహయపడుతుంది. ఇందులోని మెగ్నీషియం.. వ్యాధి నివారణకు తోడ్పడుతుంది. అలాగే కాల్షియం.. ఎముకల, దంతాల దృఢత్వాన్ని కాపాడుతుంది. జీడిపప్పు తినడం వలన జీవిత కాలన్ని పెంచుతాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, పాలీఫినైల్స్, కెరోటినాయిడ్స్ లాంటివి ఉన్నాయి. ఇది శరీరంలో యాంటీ ఆక్సిడెంట్లను కూడా పెంచుతుంది. తద్వారా జీవిత కాలం కూడా పెరుగుతుందట.

జీడిపప్పు తగిన మోతాదులో తినడం వలన బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా కొవ్వు శాతం తగ్గించేందుకు కూడా తోడ్పడతాయి. ఓ పరిశోధన ప్రకారం రోజుకు కొన్ని జీడిపప్పులను తీసుకోవడం వల్ల ఉబకాయం, టైప్-2 డయాబెటిస్ వంటివి తగ్గుతాయి. ముడి జీడిపప్పులో ఔన్సుకు 157 క్యాలరీలు ఉన్నప్పటికీ మన శరీరం అందులో 84 క్యాలరీలను మాత్రమే గ్రహిస్తుంది. అదే వేయించినప్పుడు పూర్తి కేలరీలను శరీరానికి అందిస్తుంది. జీడిపప్పు గుండెకు మంచి చేస్తుంది. 2017లో జరిపిన ఓ అధ్యయనం ప్రకారం వారానికి 2 గుప్పిళ్ల జీడిపప్పులు తినేవారిలో గుండె జబ్బు ప్రమాదం 15 నుంచి 23 శాతం తక్కువగా ఉంటుందని తేలింది. మరొక అధ్యయనంలో బంగాళదుంప చిప్స్ కు బదులు రోజూ జీడిపప్పును అల్పాహారంగా తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గించుకోవచ్చని తేలింది. కేవలం 28 రోజుల్లోనే ఈ మార్పు కనిపిస్తుందని తేల్చారు. చెడు కొవ్వును తగ్గించడం, రక్త పోటును తగ్గించడం వల్ల జీడిపప్పు ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

రోజూ వేయించిన జీడిపప్పులు తినడం వల్ల టైప్-2 డయాబెటిస్ తగ్గుతుందట. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. తద్వారా ఇవి టైప్-2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. వీటిని స్నాక్స్‏గా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడానికి సహాయపడుతుంది. రోజువారీ కేలరీల్లో 10 శాతం తగినంత జీడిపప్పు తీసుకుంటే 8 వారాల తర్వాత బ్లడ్ షుగర్ స్థాయిలు పడిపోతాయి. ఇవి డయాబెటిస్ రోగులకు ఉపయోగకరం. జీడిపప్పులోని పోషకాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు పిండాన్ని అభివృద్ధి చేయడానికి అద్భుతంగా పనిచేస్తాయి. జంతువులపై చేసిన అధ్యయనంలో తల్లులు జీడిపప్పు తిన్నప్పుడు శిశువులు వేగంగా ప్రతిచర్యలు చేయడం, బలమైన జ్ఞాపకశక్తి కలిగి ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు. గర్భంతో ఉన్న మహిళలు వీటిని తినడం మంచిది.

జీడిపప్పులను ఏ సమయంలో.. ఏ విధంగా తినాలి.. సాధరణంగా జీడిపప్పులను తినాలనుకునే వారు ఉదయం పూట ఎక్కువగా తినేస్తుంటారు. ఇక ఆ రోజూ మొత్తంలో వాటిని తినడానికి ఇష్టపడరు. అలా కాకుండా వాటిని ఏ సమయంలో తినోచ్చు. ఎలా తినాలనేది తెలుసుకుందాం. రోజూ కొన్ని పచ్చి జీడిపప్పులను మధ్యాహ్నం పూట తినవచ్చు. వీటికి కొద్దిగా ఉప్పు లేదా తేనె వేసి వేయించుకుంటే తింటే ఇంకా రుచిగా ఉంటాయి. జీడిపప్పును ఇతర నట్స్‏తో లేదా డ్రైఫ్రూట్స్‏తో కలిపి తీసుకుంటే మంచిది. అంతేకాకుండా వీటిని ఫ్రూట్ సలాడ్ పై చల్లుకుని తింటే ఇంకా బాగుంటుంది. సూప్‏లో లేదా పాలలో వేసి తీసుకోవచ్చు. జావ, స్మూతీస్, టోస్ట్ లేదా స్నాక్ బార్స్, ఐస్ క్రీమ్ ఇలా రకరకాల పదార్థాల రూపంలో తీసుకోవచ్చు.

Also Read:

Health Benefits: డైటింగ్ చేసేవారు బెండకాయను తినోచ్చా ? దీనివల్ల కలిగే ప్రయోజనాలెంటో తెలుసా..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!