‘వీగనిజం’ మీకు తెలుసా..? చాలామంది ‘వీగన్స్‌’గా మారుతున్న సెలబ్రిటీలు.. ట్రెండ్ క్రియేట్ చేస్తున్న పాపులర్ ఫుడ్ హ్యాబిట్..

Veganism : కామన్ మ్యాన్ నుంచి సెలెబ్రిటీల వరకు చాలా మంది ఇప్పుడు ‘వీగన్’గా మారుతున్నారు. ఇదో ట్రెండ్‌లాగా సాగుతోంది. వెజిటేరియన్స్, నాన్‌వెజిటేరియన్స్

  • uppula Raju
  • Publish Date - 11:20 am, Thu, 18 February 21
'వీగనిజం' మీకు తెలుసా..? చాలామంది 'వీగన్స్‌'గా మారుతున్న సెలబ్రిటీలు.. ట్రెండ్ క్రియేట్ చేస్తున్న పాపులర్ ఫుడ్ హ్యాబిట్..

Veganism : కామన్ మ్యాన్ నుంచి సెలెబ్రిటీల వరకు చాలా మంది ఇప్పుడు ‘వీగన్’గా మారుతున్నారు. ఇదో ట్రెండ్‌లాగా సాగుతోంది. వెజిటేరియన్స్, నాన్‌వెజిటేరియన్స్ అందరికీ తెలుసు ఈ రెండు కాకుండా మరో రకం ఆహారం తీసుకునే వారే ‘వీగన్స్’. మాంసాహారంతో పాటు, జంతు ఉత్పత్తులను తినని వీగన్స్ వల్ల పర్యావరణానికి, పుడమికి ఎంతో ఉపయోగం ఉంది. అయితే వీగన్ డైట్ వల్ల వీగన్‌లకు ప్రయోజనం ఉందా? వారి ఆరోగ్యానికి ఇది శ్రేయస్కరమేనా? అనేది తెలుసుకుందాం.

కరోనా మహమ్మారి తర్వాత ప్రజల్లో ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. ఈ క్రమంలో శాకాహారిగా మారితే ఆరోగ్యానికి చాలా మంచిదని, వీగన్‌గా మారడం వల్ల మెరుగైన ఆరోగ్య ఫలితాలుంటాయని ప్రచారం జరుగుతోంది. అయితే వీగన్‌గా మారడం వల్ల ఆరోగ్యంగా ఉంటారన్న విషయమై ఇప్పటి వరకు ఎలాంటి శాస్త్రీయ ఆధారమైతే లేదు. కానీ, కొన్ని పరిశోధనలు మాత్రం వీగన్ డైట్ కారణంగా హార్ట్‌ఎటాక్, డయాబెటిస్, డైవర్టికులర్ డిసీజ్‌లు వచ్చే ప్రమాదం తక్కువని తేల్చాయి. ఇందుకు భిన్నంగా.. వీగన్ ఫుడ్ తినడం వల్ల ఎముకలు దృఢంగా ఉండబోవని, ఫ్యాక్చర్స్ అయ్యే ప్రమాదం ఎక్కువని, హెమర్రాజాక్ స్ట్రోక్ వచ్చే అవకాశాలున్నాయని ఇటీవలి పరిశోధనలు వెల్లడించాయి. వీగన్లపై జరిపిన మరో అధ్యయనం ప్రకారం పూర్తిగా శాకాహారమే తీసుకున్న వారికీ కొన్ని ఆరోగ్య సమస్యలు రావొచ్చని, ఎక్కువ జీవితకాలం ఉంటుందన్న భరోసా లేదని తేలింది.

వీగన్స్ అందరూ సేమ్ డైట్ ఫాలో అవుతారనే రూల్ ఏం లేదు. ఉదాహరణకు.. ఓ వీగన్ తాజా కూరగాయలు, పండ్లు, బీన్స్, పప్పుధాన్యాలు (ప్రోటీన్ కోసం), గింజలు, విత్తనాలు (హెల్తీ ఫ్యాట్ కోసం) తన డైట్‌లో తీసుకుంటే, మరో వీగన్ పాస్తా, టమోటా సాస్, బ్రెడ్ మాత్రమే స్వీకరిస్తాడు. వీగన్స్ తినే ఆహారం పర్సన్, పర్సన్‌కు తప్పకుండా మారుతోంది. ఈ తేడాలు ఆహార నాణ్యతను ప్రభావితం చేయడంతో పాటు, ఆరోగ్యంపైన ఎఫెక్ట్ చూపిస్తాయి. అంతేకాదు ఇండియాలో వీగన్స్ ప్రొడక్ట్స్ వేరు, అమెరికాలో దొరికే వీగన్స్ ప్రొడక్ట్స్ వేరు, ఆయా ప్రొడక్ట్స్ అందించే బ్రాండ్స్ వల్ల ఆయా ఆహారాల్లో మార్పులుంటాయి. ఈ నేపథ్యంలో వీగన్స్ తమ శరీరంలో పోషక లోపాలను నివారించడానికి.. విటమిన్లు, ఖనిజాలతో కూడిన ఆహారాన్ని తప్పక స్వీకరించాలి. వీగన్స్ తీసుకునే ఆహారం ద్వారా సరైన మోతాదులో విటమిన్ బి 12, ఐరన్ శరీరానికి అందకపోతే అది నాడీ వ్యవస్థపైన ప్రభావం చూపిస్తుంది. అంతేకాదు పూర్తిగా వీగన్ ఫుడ్ స్వీకరించడం వల్ల మెదడు, థైరాయిడ్ పనితీరును ప్రభావితం చేసే అయోడిన్ లోపానికీ ఆస్కారముందని వైద్యులు సూచిస్తున్నారు.

మీకు తిన్న ఆహారం జీర్ణమవడం లేదా..? అయితే ఈ సమస్యలకు గురై ఉంటారు.. ఒక్కసారి మీ అనుమానాలను నివృత్తి చేసుకోండి..