AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీకు తిన్న ఆహారం జీర్ణమవడం లేదా..? అయితే ఈ సమస్యలకు గురై ఉంటారు.. ఒక్కసారి మీ అనుమానాలను నివృత్తి చేసుకోండి..

ఒకసారి మనం తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవ్వాలంటే మన గట్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండాలి లేదంటే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది.

మీకు తిన్న ఆహారం జీర్ణమవడం లేదా..? అయితే ఈ సమస్యలకు గురై ఉంటారు.. ఒక్కసారి మీ అనుమానాలను నివృత్తి చేసుకోండి..
uppula Raju
| Edited By: Pardhasaradhi Peri|

Updated on: Feb 18, 2021 | 1:31 PM

Share

ఒకసారి మనం తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవ్వాలంటే మన గట్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండాలి లేదంటే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. రెండు దశాబ్దాలుగా గట్ ఆరోగ్యం మీద ఎన్నో అధ్యయనాలు జరుగుతున్నాయి. అయితే గట్ ఆరోగ్యం, మానసిక, శారీరక పరిస్థితితో పాటు రోగనిరోధక వ్యవస్థ పై ఆధారపడి ఉంటుంది. గట్ మైక్రోబియమే అంటే మన శరీరంలో ఉండే ప్రేగులలో ఉండే సూక్ష్మజీవులు. ఒక వ్యక్తి యొక్క జీర్ణ వ్యవస్థలో సుమారు మూడు వందల నుంచి ఐదు వందల వరకు వివిధ రకాల జాతులకు సంబంధించిన బ్యాక్టీరియాలు ఉంటాయి. వాటిలో కొన్ని బాక్టీరియాలు మనకి అవసరం వాటి వల్ల మనం ఆరోగ్యంగా ఉంటాం. ఈ రకమైన బ్యాక్టీరియా ఉండకపోతే మనం తీసుకునే ఆహారం జీర్ణం అవ్వడం కష్టమే. ఎందుకంటే ఈ బ్యాక్టీరియా మనం తినే ఆహారాన్ని చిన్న చిన్న వాటిగా మారుస్తుంది. దాంతో మన శరీరం పోషక విలువలను తీసుకుంటుంది. అయితే అయితే మన గట్ ఆరోగ్య పరిస్థితి బాగోలేదని కింది కారణాల ద్వారా తెలుసుకోవచ్చు.

1.కడుపు ఉబ్బరం: ఎప్పుడైతే కడుపులో కొంత ఇబ్బందిగా అనిపించినా, మలబద్ధకం, విరేచనాలు, గుండెల్లో మంట ఇలాంటి ఇబ్బందులు కలిగినప్పడు అనారోగ్యంగా ఉందని మనం భావించాలి ఎందుకంటే ఇదే వాటి సంకేతం. గట్ ఆరోగ్యం మరింత మెరుగు పడాలి అనుకుంటే కడుపులో ఉండే వ్యర్థాలను తొలగించడం పై దృష్టి పెట్టండి. ఎక్కువ రోజులు ఇబ్బందిపడితే డాక్టర్ ను సంప్రదించడం మర్చిపోకండి.

2. హై షుగర్ డైట్: మీ ఆహారంలో అధికంగా చక్కెర ఉండే ఆహార పదార్థాలు తీసుకుంటే గట్ లో ఉండే మంచి బ్యాక్టీరియా తగ్గిపోతుంది. దాంతో గట్ ఆరోగ్యం దెబ్బతింటుంది. అంతే కాకుండా చక్కర తినాలని ఆసక్తి పెరిగి పోతుంది, దానివల్ల గట్ ఆరోగ్యం ఇంకా దెబ్బతింటుంది. ఇలా అధికంగా చక్కెర తీసుకుంటే కడుపులో మంట కూడా పెరుగుతుంది. అందుకే చక్కెరను పరిమితికి మించి వాడకూడదు.

3. బరువు పెరగడం లేదా బరువు తగ్గడం: ఆహారం మరియు వ్యాయామాలలో ఎటువంటి మార్పులు చేయకుండా తరచుగా బరువు పెరుగుతూ లేదా తగ్గుతూ ఉంటే గట్ ఆరోగ్యం దెబ్బ తింటుంది. దాంతో మన శరీరం ఎక్కువ పోషకాలను గ్రహించ లేదు. బరువు తగ్గిపోవడానికి ఇంకొక కారణం చిన్న ప్రేగుల లో బ్యాక్టీరియా ఎక్కువగా పెరిగిపోవడం మరియు బరువు పెరగడానికి కారణం శరీరంలో ఇన్సులిన్ శాతం మరియు పోషక విలువలు తీసుకోవడం తగ్గడం వల్ల ఎక్కువగా తినడం జరుగుతుంది. దానివల్ల సులువుగా బరువు పెరిగిపోతారు.

4. సరైన నిద్ర లేకపోవడం: ఎక్కువగా అలసిపోవడం వల్ల లేదా సమయం దొరకక పోవడం వల్ల సరైన నిద్ర ఉండదు. ఇలా ఎక్కువ రోజులు జరిగితే నిద్రలేమితో బాధపడాల్సి ఉంటుంది. దాంతో గట్ అనారోగ్యానికి గురరవుతుంది. దీనివల్ల దీర్ఘకాలిక సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. సాధారణంగా గట్ లో మూడ్ మరియు నిద్రకు సంబంధించిన ఒక హార్మోన్ విడుదల అవుతుంది. ఒకవేళ సరైన నిద్ర లేకపోతే ఈ హార్మోన్ ఉత్పత్తి పై కూడా ప్రభావం చూపుతుంది.

5. చర్మ సంబంధిత సమస్యలు: రోగ నిరోధక వ్యవస్థ పై ప్రభావం ఎంతో ఉండటం వల్ల చర్మం పై చాలా ప్రభావం చూపుతుంది. చర్మం పై దద్దుర్లు, తామర వంటి సమస్యలు వస్తాయి. ఆహారం సరిగా తీసుకోకపోవడం వల్ల మరియు అలర్జీల వల్ల కొన్ని ప్రోటీన్లు శరీరం నుంచి బయటకు వెళ్లిపోతాయి. తరచుగా ఇలా జరిగితే ఎక్కువ ప్రోటీన్ల ను నష్టపోతారు.

6. మీ గట్ హెల్త్ బాగుండాలంటే ఏం చేయాలి: మీ ఒత్తిడిని తగ్గించుకోండి,రోజుకు ఏడు నుంచి ఎనిమిది గంటల వరకు నిద్రపోండి, ఆహారం తినేటప్పుడు నమిలి తినండి, శరీరానికి అవసరమైనంత నీరు తాగండి, ఏమైనా కొత్త లక్షణాలు కనబడితే మీ డైట్ ప్లాన్ను మార్చుకోండి.

సచిన్ ప్రశంసలు దక్కించుకున్న మహ్మద్ సిరాజ్.. ఏ విషయంలో తెలిస్తే మీరు కూడా అభినందించకుండా ఉండలేరు..