సచిన్ ప్రశంసలు దక్కించుకున్న మహ్మద్ సిరాజ్.. ఏ విషయంలో తెలిస్తే మీరు కూడా అభినందించకుండా ఉండలేరు..
INDIA VS ENGLAND 2021: ఇండియా మాజీ ప్లేయర్ సచిన్ టెండూల్కర్ టీమ్ ఇండియా పేసర్ మహ్మద్ సిరాజ్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. ఇంగ్లాండ్‌తో
INDIA VS ENGLAND 2021: ఇండియా మాజీ ప్లేయర్ సచిన్ టెండూల్కర్ టీమ్ ఇండియా పేసర్ మహ్మద్ సిరాజ్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్టులో రవిచంద్రన్ అశ్విన్ శతకం సాధించిన వేళ సిరాజ్ చేసుకున్న సంబరాలు అందరిని ఆకట్టుకున్నాయి. ఆ సమయంలో అశ్విన్ కన్నా ఎక్కువ సిరాజ్ సంతోషపడుతూ గాల్లోకి ఎగురుతూ, పంచులు విసురుతూ కనిపించాడు. ఆ వీడియో నెట్టింట్లో వైరల్ అయింది. అయితే తాజాగా ఈ విషయంపై సచిన్ ట్వీట్ చేశాడు.
‘ఇంగ్లాండ్‌తో రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అశ్విన్ సెంచరీ చేసినప్పుడు సిరాజ్ సంబరాలు చూడ్డానికి ఎంతో ఆసక్తిగా అనిపించాయి. వాటినెంతో ఆస్వాదించా. జట్టుగా ఆడే ఆటలో ఇలాంటివే ఉంటాయి. టీమ్‌ఇండియా, సిరాజ్ పట్ల గర్వపడుతున్నా’ అని సచిన్ పేర్కొన్నాడు. అలాగే నాటి వీడియోను సైతం అభిమానులతో పంచుకున్నారు. దీనికి అశ్విన్ సైతం జవాబిచ్చాడు. సిరాజ్ జట్టు కోసం ఆడే ఆటగాడని మెచ్చుకున్నాడు.
?? @mdsirajofficial has been nothing but a team man? https://t.co/PTEajA6C1R
— Ashwin ?? (@ashwinravi99) February 17, 2021