IPL 2021 Auction: మాక్స్‌వెల్‌పై ఆర్‌సీబీ గురి.. ఐపీఎల్ ఆటగాళ్ల గురించి కొత్త విషయాలు చెబుతున్న మాజీ క్రికెటర్..
IPL 2021 Auction: ఐపీఎల్ వేలం గురించి ఇండియన్ మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. పలు జట్ల గురించి, ఆటగాళ్ల గురించి
IPL 2021 Auction: ఐపీఎల్ వేలం గురించి ఇండియన్ మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. పలు జట్ల గురించి, ఆటగాళ్ల గురించి కొత్త విషయాలను తెలియజేశాడు. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆసక్తి చూపుతుందని తెలిపాడు. విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్‌పై భారాన్ని తగ్గించడానికి మాక్సీ వంటి ఆటగాడు ఆ జట్టుకు చాలా అవసరమని అభిప్రాయపడ్డాడు. దేవదత్ పడిక్కల్‌తో కలిసి కోహ్లీ ఇన్నింగ్స్ ఆరంభిస్తాడని, తర్వాత డివిలియర్స్ ఉంటాడని, అయితే ఎక్స్-ఫ్యాక్టర్ ప్లేయర్ మాక్స్‌వెల్ ఆ జట్టుకు కావాలని చెప్పాడు.
బెంగళూరు మొయిన్ అలీ, ఉమేశ్ యాదవ్ వంటి నాణ్యమైన ప్లేయర్లను వదులుకుంది. ప్రస్తుతం భారత్‌లో ఫాస్ట్ బౌలర్లు ఎక్కువగా లేరు. ఉమేశ్‌ను ఆ జట్టు విడిచిపెట్డడం ఆశ్చర్యంగా అనిపించింది. అయితే అతడిని పంజాబ్ జట్టు సొంతం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని తెలిపాడు. ఇక భారత బౌలర్లను దక్కించుకోవాలని పంజాబ్ చూస్తోందన్నాడు. ఎందుకంటే మహ్మద్ షమికి ఇతర బౌలర్ల నుంచి సహకారం దక్కట్లేదని, ఉమేశ్-షమి కొత్తబంతిని పంచుకోవొచ్చని చెప్పాడు. కొత్తబంతిని పంచుకోవడానికి ఇద్దరు భారత ఫాస్ట్‌బౌలర్లు ఉంటే మరో విదేశీ ఆటగాడిని తుది జట్టులోకి తీసుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయని అంచనా వేశాడు.