WhatsApp’s new privacy policy : మీ వాట్సాప్‌‌‌‌‌‌ చాటింగ్ సేఫ్‌‌‌‌‌గా ఉండాలంటే ఈ సెట్టింగ్స్ చేసుకోండి..

నెటిజన్స్ ఎక్కువగా వాడే యాప్ లలో వాట్సాప్ ముఖ్యమైంది. ఈ మెసేజింగ్ యాప్ తో ఎన్నోలాభాలు ఉన్నాయి. అయితే ఈ యాప్ తో అంతే ప్రమాదంకూడా పొంచి ఉంది. కొంతమంది హ్యాకర్లు మీరు చేసే మెసేజులు, షేర్ చేసే ఫోటోలను కనిపెట్టేస్తున్నారు.

WhatsApp’s new privacy policy : మీ వాట్సాప్‌‌‌‌‌‌ చాటింగ్ సేఫ్‌‌‌‌‌గా ఉండాలంటే ఈ సెట్టింగ్స్ చేసుకోండి..
Follow us

|

Updated on: Feb 21, 2021 | 11:15 AM

WhatsApp : నెటిజన్స్ ఎక్కువగా వాడే యాప్ లలో వాట్సాప్ ముఖ్యమైంది. ఈ మెసేజింగ్ యాప్ తో ఎన్నోలాభాలు ఉన్నాయి. అయితే ఈ యాప్ తో అంతే ప్రమాదంకూడా పొంచి ఉంది. కొంతమంది హ్యాకర్లు మీరు చేసే చాటింగ్ , షేర్ చేసే ఫోటోలను కనిపెట్టేస్తున్నారు. అలాగే కొన్ని అఫిషియల్ మీటింగ్స్ విషయాలు, వాటికి సంబంధించిన వీడియోలు ఇలా అన్ని షేర్ చేసుకుంటున్నారు. ఇక మీ స్మార్ట్ ఫోన్ ఎవరైన తీసుకున్నా.. ముందుగా ఓపెన్ చేసేది వాట్సప్ మాత్రమే. మన సమాచారం ఇతరులకు తెలిసిపోతుంది. ఛాటింగ్ సీక్రెట్‌గా ఉండాలంటే కొన్ని సెట్టింగ్స్ మార్చుకోవాలంటున్న సైబర్ నిపుణులు. వాట్సప్ ఛాటింగ్, మీడియా, ఇతర సమాచారం… ఇలా ప్రతీ దాంట్లో సెట్టింగ్స్ ఉంటాయి. ఆ ప్రైవసీ సెట్టింగ్స్ మార్చుకొని మీ వాట్సప్‌ని సేఫ్‌గా మార్చుకోవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం…

వాట్సప్‌లో టచ్ ఐడీ లేదా ఫేస్ ఐడీ లాక్ ఉంటుంది. మీ వాట్సప్‌ని లాక్ చేయడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. వాట్సప్ సెట్టింగ్స్‌లో అకౌంట్‌లో ప్రైవసీలో ఫింగర్‌ప్రింట్ లాక్ ఉంటుంది. ఈ ఫీచర్ ఎనేబుల్ చేస్తే మీరు వాట్సప్ ఓపెన్ చేయాలంటే ఫింగర్‌ప్రింట్ తప్పనిసరి.వాట్సప్‏లో టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ సెట్ చేయడానికి ముందుగా యాప్ ఓపెన్ చేసి.. రైట్ సైడ్ పైన కనిపించే త్రీ డాట్స్ పై క్లిక్ చేసి చేయాలి. ఆ తర్వాత సెట్టింగ్స్ ఓపెన్ చేసి.. అకౌంట్ పై క్లిక్ చేసి.. టూ స్టెప్స్ వెరిఫికేషన్స్ పైన క్లిక్ చేయాలి. ఈ టూ స్టెప్ వెరిఫికేషన్ ఓపెన్ చేసి ఆరు అంకెల పిన్ ఎంటర్ చేయాలి. మీరు ఎప్పుడైనా వాట్సప్ రీ ఇన్‌స్టాల్ చేస్తే పిన్ తప్పనిసరిగా ఎంటర్ చేయాలి. వేరే ఫోన్లలో మీ వాట్సప్ హ్యాక్ చేసినా ఈ పిన్ నంబర్ తప్పకుండా కావాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Alaknanda Colour : ఉత్తరాకాండ్‌లోని వరదల బీభత్సంతో నీటి రంగు మార్చుకున్న అలకనందా నది.. ఫోటోలు వైరల్

Location Tracking : స్మార్ట్ ఫోన్‌లో లొకేషన్ ట్రాకింగ్ యాప్‌తో వ్యక్తిగత వివరాలు ఎలా చోరీ అవుతున్నాయో తెలుసా..!