AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Location Tracking : స్మార్ట్ ఫోన్‌లో లొకేషన్ ట్రాకింగ్ యాప్‌తో వ్యక్తిగత వివరాలు ఎలా చోరీ అవుతున్నాయో తెలుసా..!

స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు తమ ఫోన్లలో ఉపయోగించే కొన్ని యాప్స్ తో వచ్చే చిక్కులు తెలియదు. కొన్ని యాప్స్ కోసం అనుమనిచ్చే లొకేషన్ ట్రాకింగ్ తో వినియోగదారుడి వ్యక్తిగత సమాచారాన్ని సంగ్రహిస్తున్నాయని కొన్ని అధ్యయనాల ద్వారా వెలుగులోకి వచ్చింది...

Location Tracking : స్మార్ట్ ఫోన్‌లో లొకేషన్ ట్రాకింగ్ యాప్‌తో వ్యక్తిగత వివరాలు ఎలా చోరీ అవుతున్నాయో తెలుసా..!
Surya Kala
|

Updated on: Feb 21, 2021 | 9:35 AM

Share

Privacy Concerns: స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు తమ ఫోన్లలో ఉపయోగించే కొన్ని యాప్స్ తో వచ్చే చిక్కులు తెలియదు. కొన్ని యాప్స్ కోసం అనుమనిచ్చే లొకేషన్ ట్రాకింగ్ తో వినియోగదారుడి వ్యక్తిగత సమాచారాన్ని సంగ్రహిస్తున్నాయని కొన్ని అధ్యయనాల ద్వారా వెలుగులోకి వచ్చింది.

స్మార్ట్ ఫోన్ వినియోగదారుడు.. వ్యక్తిగత సమాచారం గోప్యతపై ఇటలీలోని బోలోగ్నా విశ్వవిద్యాలయానికి చెందిన ఇద్దరు పరిశోధకులు మరియు యూనివర్శిటీ కాలేజ్ లండన్ నుండి బెంజమిన్ బారన్ లు పలు అధ్యయనాలు నిర్వహించారు. స్మార్ట్ ఫోన్ యూజర్స్ యొక్క వ్యక్తిగత గోప్యత ఉల్లంఘనను ఎలా చేస్తుందో నిరూపించారు. అంతేకాదు.. వినియోగదారుల వ్యక్తిగత గోప్యతను ఉంచే సరికొత్త మొబైల్ అప్లికేషన్‌ను అభివృద్ధి చేశారు

సర్వసాధారంగా స్మార్ట్ ఫోన్ ఉపయోగించే లొకేషన్ డేటా గురించి గానీ, యాప్స్ ను ఉపయోగించే సమయంలో అడిగే వ్యక్తిగత వివరాలు, ఫీడ్ బ్యాక్ వంటి విషయాల గురించి వినియోగదారుడికి ఎక్కువుగా తెలియదని బోలోగ్నా విశ్వవిద్యాలయానికి చెందిన మిర్కో ముసోలేసి అన్నారు.

అయితే డేటా వినియోగదారులు నివసించే ప్రదేశం, వారి అలవాట్లు, ఆసక్తులు, జనాభా, వినియోగదారుల వ్యక్తిత్వాల గురించి సమాచారం వంటి సున్నితమైన సమాచారాన్ని అందిస్తుంది. సాంకేతిక పరిజ్ఞానం పై ప్రొసీడింగ్స్ ఆఫ్ ది ఎసిఎమ్‌లో ప్రచురించిన మొబైల్, ప్రస్తుత టెక్నాలజీ వంటి అనేక విషయాలపై ట్రాకింగ్ అడ్వైజర్ యాప్ ఉద్యోగులు అధ్యయనం చేశారు. పలు యాప్ ల ద్వారా వినియోగదారుల ఏ రకమైన వ్యక్తిగత సమాచారాన్ని సేకరించారో పరిశోధకులు గుర్తించగలిగారు.

ఈ డేటా గోప్యత అంశంలో అధ్యయనం కోసం.. 69 మంది వినియోగదారులను స్మార్ట్ ఫోన్లలో రెండు వారాల పాటు ట్రాక్అడ్వైజర్‌ను ఉపయోగించారు. ఇది 2,00,000 కంటే ఎక్కువ స్థానాలను ట్రాక్ చేసింది. సుమారు 2,500 ప్రదేశాలను గుర్తించింది. అంతేకాదు జనాభా, వ్యక్తిత్వం రెండింటికి సంబంధించిన దాదాపు 5,000 వ్యక్తిగత సమాచారాన్ని ట్రాక్అడ్వైజర్ సేకరించింది. ఇలా ట్రాక్అడ్వైజర్ సేకరించిన డేటాలో, ఆరోగ్యం, సామాజిక-ఆర్ధిక పరిస్థితి, జాతి, మతం వంటి వినియోగదారుల యొక్క సున్నితమైన సమాచారం ఉన్నట్లు కనుగొన్నారు. స్మార్ట్ ఫోన్ లో లోకేష్ ట్రాకింగ్ ద్వారా వినియోగదారుడి యొక్క వ్యక్తిగత సమాచారం ఎలా సేకరిస్తున్నారో వారికి సాక్ష్యాలతో సహా చూపించడం చాలా ముఖ్యమని తాము భావిస్తున్నట్లు ముసోలేసి తెలిపారు. అయితే ఇలా యాప్ నిర్వాహకులతో.. లేదా మార్కెటింగ్ సంస్థలతో తమ వ్యక్తిగత సమాచారం పంచుకోవడం వినియోగదారులకు ఆమోద యోగ్యమా లేక వారి గోప్యత ఇలా బహిర్గతం కావడం ఉల్లంఘనగా భావిస్తున్నారో తెలుసుకోవడం తమకు ముఖ్యమని చెప్పారు.

తాము చేపట్టిన పరిశోధన విశ్లేషణలు వియోగదారుల వ్యక్తిగత గోప్యతను రక్షించడంలో సహాయపడుతుందని… ప్రకటనల వ్యవస్థల రూపకల్పనకు మార్గం ఏర్పడుతుందని.. అంతేకాదు సున్నితమైన సమాచారాన్ని భద్రంగా రక్షించుకోవచ్చని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. ఉదాహరణకు Thanks to such systems తో వినియోగదారుల సొంత ఆరోగ్య సమాచారాన్ని రక్షించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుందని.. వారు ఆస్పత్రి కి వెళ్లిన ప్రతిసారి నోటిఫికేషన్ పొందవచ్చని పరిశోధకుల్లో ఒకరైన ముసోలేసి చెప్పారు.

 తిరుమల సమాచారం.. శ్రీవారి దర్శనానికై మార్చి నెల టికెట్లు విడుదల చేసిన టీటీడీ..

ముంబై వెళ్లి సినీనటి కావాలనుకున్న ఆరో తరగతి చదువుతున్న బాలిక.. కాకినాడ రైల్వే స్టేషన్‌లో ఏం జరిగిదంటే..?