ముంబై వెళ్లి సినీనటి కావాలనుకున్న ఆరో తరగతి చదువుతున్న బాలిక.. కాకినాడ రైల్వే స్టేషన్‌లో ఏం జరిగిందంటే..?

సినిమాల్లో నటించాలని, నటీనటులుగా రాణించాలని చాలామందికి ఉంటుంది. కానీ అదంత ఈజీ కాదు. అనుకున్నంత ఈజీగా అవకాశాలు రావు.

  • Ram Naramaneni
  • Publish Date - 9:18 am, Sun, 21 February 21
ముంబై వెళ్లి సినీనటి కావాలనుకున్న ఆరో తరగతి చదువుతున్న బాలిక.. కాకినాడ రైల్వే స్టేషన్‌లో ఏం జరిగిందంటే..?

సినిమాల్లో నటించాలని, నటీనటులుగా రాణించాలని చాలామందికి ఉంటుంది. కానీ అదంత ఈజీ కాదు. అనుకున్నంత ఈజీగా అవకాశాలు రావు. ఆనపకాయ అంత టాలెంట్‌తో పాటు ఆవగింజ అంత అదృష్టం కూడా ఉండాలి. అయితే తక్కువ ఏజ్‌లో చెన్నై రైలెక్కి.. సినిమాల్లో అవకాశాల కోసం వెళ్లామని ప్రస్తుతం కొందరు సెలబ్రిటీలు చేబుతున్న మాటలు.. కొందర్నీ ఆ దిశగా పయనించేలా చేస్తున్నాయి.

తాజాగా సినీనటి కావాలని ఆశతో ఇంట్లో చెప్పకుండా ముంబై రైలు ఎక్కేందుకు వచ్చిన బాలికను చూసి కాకినాడ ఆర్పీఎఫ్ సిబ్బంది షాక్‌కు గురయ్యారు. నగరానికి చెందిన ఓ వ్యాపారస్తుడి కుమార్తె ఆరో తరగతి చదువుతోంది. ఒక్కతే కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్ కు వచ్చి ముంబై ట్రైన్ టికెట్ కొనడంతో.. అనుమానించిన ఆర్పీఎఫ్ సిబ్బంది బాలికను విచారించారు. హైదరాబాద్ మీదుగా ముంబై వెళ్లి సినీనటి కావాలని అనుకుంటున్నానని చెప్పడంతో ఆర్పీఎఫ్ సిబ్బంది షాక్‌కు గురయ్యారు. బాలిక బ్యాగులో లక్షా 70 వేలకు పైగా నగదు, బట్టలు గుర్తించారు. బాలికకు కౌన్సిలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు సమాచారమిచ్చి అప్పగించారు.

Also Read:

AP Panchayat Elections 2021 live: ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ ఎన్నికలు.. నాలుగో విడత పోలింగ్ ప్రారంభం..