AP Panchayat Elections 2021 results live: ఆంధ్రప్రదేశ్‌లో ముగిసిన పంచాయతీ ఎన్నికలు.. పల్లె పోరులో వైసీపీ మద్దతుదారులదే హవా

Balaraju Goud

|

Updated on: Feb 21, 2021 | 9:55 PM

AP Local Elections Phase 4: ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ ఎన్నికలు చివరి ఘట్టానికి చేరుకున్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా..

AP Panchayat Elections 2021 results live: ఆంధ్రప్రదేశ్‌లో ముగిసిన పంచాయతీ ఎన్నికలు.. పల్లె పోరులో వైసీపీ మద్దతుదారులదే హవా

AP Local Elections Phase 4: ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ ఎన్నికలు చివరి ఘట్టానికి చేరుకున్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా చివరి విడత ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. నాలుగో విడత ఎన్నికల ఫలితాలు విడుదల అయ్యాయి. ఇక ఇప్పటివరకు వైసీపీ జాబితా (ఏకగ్రీవాలతో కలిపి) వైసీపీ 1653, టీడీపీ170 , జనసేన 9, బీజేపీ 5, ఇతరులు 31 చోట్ల గెలుపొందారు.

చివరి విడతలో 3,299 పంచాయతీల్లో ఎన్నికలకు నోటిఫికేషన్లు జారీ కాగా 554 సర్పంచి పదవులు ఏకగ్రీవమయ్యాయి. ఇక 161 మండలాల పరిధిలో 2,743 సర్పంచి స్థానాలకు ఎన్నికలు జరుగాయి. ఇందుకోసం మొత్తం 7,475 మంది అభ్యర్ధులు పోటీ పడ్డారు. అలాగే 33,435 వార్డులకుగానూ 10,921 చోట్ల ఏకగ్రీవంగా ముగిశాయి. మరో 91 చోట్ల వార్డు పదవులకు నామినేషన్లు దాఖలు కాలేదు. మొత్తంగా 22,423 వార్డులకు నేడు పోలింగ్‌ జరగింది. వార్డు పదవులకు 52,700 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. కాగా, సాయంత్రం 3.30 వరకు పోలింగ్ నిర్వహించి సాయంత్రం 4 గంటల నుంచి ఓట్లను లెక్కింపు ప్రారంభించారు.

నాలుగో విడత పంచాయతీ ఎన్నికల్లో పోలింగ్ ముగిసింది. మొదటివిడతలో 81.67 శాతం పోలింగ్‌ నమోదైంది. రెండో విడతలో 81.67 శాతం పోలింగ్‌ నమోదైనట్లు అధికారులు తెలిపారు. అయితే మూడో విడతలో 80.71 శాతం పోలింగ్‌ నమోదైంది. నాలుగో దశ పంచాయతీ ఎన్నికల్లో 82.85 శాతం పోలింగ్‌ నమోదైందని ఏపీ పంచాయతీ ఎన్నికల నిర్వహణ అధికారి, పంచాయతీ రాజ్‌ కమిషనర్‌ గిరిజా శంకర్‌ తెలిపారు. నాలుగు దశల్లో కలిపి 81.78 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఆయన వెల్లడించారు. మొత్తం 2, 197 పంచాయతీలు, 47,459 వార్డులు ఏకగ్రీవమైనట్లు ఆయన పేర్కొన్నారు.

ఇక, మొత్తం నాలుగు దశల్లో 10,890 పంచాయతీలు, 82,894 వార్డులకు ఎన్నికలు నిర్వహించినట్లు వివరించారు. 10 పంచాయతీలు, 670 వార్డులు నామినేషన్లు దాఖలు కాలేదని తెలిపారు. వీటికి త్వరలో ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు నివేదిస్తామని ఆయన అన్నారు.ఎన్నికల్లో 2.26 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నట్లు స్పష్టం చేశారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారని, అధికారులు ఎంతో కష్టపడ్డారని అన్నారు. ఎన్నికల నిర్వహణకు సహకరించిన అధికారులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

AP Local Elections Phase 4 Results Live:

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 21 Feb 2021 08:31 PM (IST)

    వైసీపీ, టీడీపీ మధ్య పోటాపోటీ

    నాలుగో విడత ఎన్నికల ఫలితాలు విడుదల అయ్యాయి. మొత్తం 82.85 శాతం పోలింగ్ నమోదు కాగా, నాలుగు దశలు కలిపి 81.78 శాతం నమోదు అయింది. తాజాగా 2,743 సర్పంచ్‌, 22,423 వార్డు స్థానాలకు పోలింగ్‌ జరిగింది. వైసీపీ, టీడీపీ మధ్య పోటాపోటీ నెలకొంది. పలుచోట్ల టీడీపీ హావా కొనసాగితే.. కొన్ని చోట్ల వైసీపీ జోరు కనబర్చింది

  • 21 Feb 2021 08:14 PM (IST)

    ఒక్క ఓటుతో గెలుపొందిన వైసీపీ మద్దతుదారుడు

    పెదకాకాని మండలం అనమర్లపూడిలో ఒక్క ఓటు తేడాతో వైసీపీ మద్దతుదారుడు గెలుపొందారు. దీంతో టీడీపీ వర్గీయులు రీకౌంటింగ్ జరపాలంటూ పట్టుబట్టారు. అందుకు వైసీపీ కార్యకర్తలు అడ్డుచెప్పడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. దీంతో కౌంటింగ్ కేంద్రం వద్ద టీడీపీ మద్దతుదారులు ఆందోళనకు దిగారు.

  • 21 Feb 2021 08:09 PM (IST)

    వైసీపీ ర్యాలీని అడ్డుకున్న టీడీపీ కార్యకర్తలు

    గుంటూరు జిల్లాలో వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఉద్రిక్తత చోటుచేసుకుంది. సత్తెనపల్లి మండలం కందులవారిపాలెంలో వైసీపీ మద్దతుదారులు గెలుపొందారు. దీంతో గ్రామంలో విజయోత్సవ ర్యాలీ చేపట్టారు. అయితే ఈ ర్యాలీని టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో పరస్పరం తోపులాట జరిగింది. అప్రమత్తమైన స్థానిక పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టాయి. దీంతో గొడవ సర్ధుమణిగింది.

  • 21 Feb 2021 06:34 PM (IST)

    దేవనకొండలో నిలిచిన కౌంటింగ్

    కర్నూలు జిల్లా  దేవనకొండలో కరెంట్ పోవడంతో.. కౌంటింగ్‌కు బ్రేక్ పడింది.

  • 21 Feb 2021 06:33 PM (IST)

    ఆలూరులో బహిరంగంగా ఓట్ల లెక్కింపు

    రాష్ట్రవ్యాప్తంగా కౌంటింగ్‌ ప్రశాంతంగా సాగుతున్నా.. కర్నూలు జిల్లాలో అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. ఆలూరులో బహిరంగంగా ఓట్ల లెక్కింపు చేపట్టారు.

  • 21 Feb 2021 06:33 PM (IST)

    నారావారి పల్లెలో టీడీపీ మద్దతుదారు బొబ్బ లక్ష్మి విజయం

    ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ తుదిదశ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మూడో విడత ఫలితాల్లో అందరి దృష్టి చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలోని పంచాయతీలపై నిలవగా.. ఇప్పుడు ఆయన సొంతూరు నారావారి పల్లెపై ఫోకస్‌ పడింది. చంద్రగిరి మండలం కందులవారిపల్లె పంచాయతీలో టీడీపీ హవా కొనసాగింది. ఆ పార్టీ బలపరిచిన బొబ్బ లక్ష్మి సర్పంచ్‌గా ఎన్నికయ్యారు.

  • 21 Feb 2021 06:28 PM (IST)

    కొనసాగుతున్న పంచాయతీ కౌంటింగ్

    తుది విడత ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తుది దశ పంచాయతీ పోరులో ప్రస్తుత పలితాల ప్రకారం ఏకగ్రీవాల మినహా వైసీపీ 24, టీడీపీ 10 స్థానాల్లో విజయం సాధించింది. జనసేన ఇప్పటివరకు ఖాతా తెరువలేదు. ఇక, మొత్తంగా చూస్తే వైసీపీ 563, టీడీపీ 11, జనసేన 04, ఇతరులు 3 గెలుపొందారు.

  • 21 Feb 2021 04:57 PM (IST)

    నాలుగోవ విడతలోనూ వైసీపీదే హవా

    నాలుగో విడతలో 3,299 పంచాయతీల్లో ఎన్నికలకు నోటిఫికేషన్లు జారీ కాగా 554 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ప్రస్తుతం 2,743 పంచాయతీలు, 22,423 వార్డుల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. పంచాయతీల వారీగా ఫలితాలు వెలువడుతున్నాయి. ఇప్పటివరకూ ఓవరాల్‌గా వైఎస్సార్‌సీపీ బలపరిచిన సర్పంచ్‌ అభ్యర్థులు 535 మంది విజయం సాధించగా, టీడీపీ మద్దతు దారులు 11 చోట్ల గెలుపొందారు. బీజేపీ మద్దతుదారులు 4 , ఇతరులు 3 చోట్ల గెలుపొందారు. జిల్లాల వారీగా నాల్గవ విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల వివరాలు ప్రస్తుతానికి ఇలా ఉన్నాయి..

    జిల్లా  వైఎస్సార్‌సీపీ టీడీపీ బీజేపీ ఇతరులు
    శ్రీకాకుళం 15 0 0 0
    విజయనగరం 55 2 1 0
    విశాఖ 14 0 0 0
    తూర్పు  గోదావరి 11 0 0 3
    పశ్చిమ గోదావరి 29 0 0 0
    కృష్ణా 13 0 0 0
    గుంటూరు 25 2 0 0
    ప్రకాశం 37 3 0 0
    నెల్లూరు 54 1 0 0
    చిత్తూరు 150 3 0 0
    కర్నూలు 27 0 0 0
    అనంతపురం 0 0 0 0
    వైఎస్సార్‌ జిల్లా 105 0 3 0
  • 21 Feb 2021 04:20 PM (IST)

    పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజాశంకర్‌కు అభినందనలు

    ఏపీలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగియడం పట్ల రాష్ట్ర ఎన్నికల సంఘం హర్షం వ్యక్తం చేసింది. పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగియడం పట్ల పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజాశంకర్‌ను ఎస్ఈసీ అభినందించారు. ఎన్నికల ఏర్పాట్ల దగ్గర నుంచి అన్ని చర్యలు తీసుకుని, సిబ్బందిని ప్రోత్సహించారని ఉన్నతాధికారులు అభినందించారు. నాలుగోదశలో పెద్దఎత్తున ఓటర్లు తరలివచ్చారని తెలిపిన అధికారులు.. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని పక్బందీగా ఏర్పాట్లు చేశామన్నారు.

  • 21 Feb 2021 04:16 PM (IST)

    ఇప్పటివరకు నమోదైన పోలింగ్ శాతం ఇలా ఉన్నాయి

    మొదటివిడతలో 81.67 శాతం పోలింగ్‌ నమోదైంది. రెండో విడతలో 81.67 శాతం పోలింగ్‌ నమోదైనట్లు అధికారులు తెలిపారు. అయితే మూడో విడతలో 80.71 శాతం పోలింగ్‌ నమోదైంది. నాలుగో విడత మధ్యాహ్నం 2:30 గంటల వరకు 78.90 శాతం పోలింగ్‌ నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు.

  • 21 Feb 2021 04:15 PM (IST)

    మొదలైన కౌంటింగ్

    ఏపీలో తుది విడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. కాసేపట్లో తుది విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు విడుదల చేస్తారు. లెక్కింపు కేంద్రాల దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో మొత్తం నాలుగు విడతలుగా జరిగిన పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు.

  • 21 Feb 2021 03:57 PM (IST)

    పశువులంక గ్రామంలో టీడీపీ – వైసీపీ ఘర్షణ

    తూర్పు గోదావరి జిల్లాలోని ఐ పోలవరం మండలం, పశువులంక గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పంచాయతీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా వైసీపీ, టీడపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు రాళ్లతో పరస్పర దాడులు చేసుకున్నారు. దీంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.

  • 21 Feb 2021 03:54 PM (IST)

    ఏపీ ముగిసిన పోలింగ్.. ఇప్పటి వరకు అందిన వివరాల ప్రకారం

    ఏపీలో నాలుగో విడత పంచాయతీ ఎన్నికల్లో పోలింగ్ ముగిసింది. మధ్యాహ్నం 2.30 గంటల వరకు 78.90 శాతంగా నమోదైంది. అత్యధికంగా విజయనగరం జిల్లాలో 85.60 శాతంగా ఉండగా… అత్యల్పంగా నెల్లూరు జిల్లాలో 73.20 శాతంగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. శ్రీకాకుళంలో 78.81, విజయనగరంలో 85.60, విశాఖ 84.07, తూర్పు గోదావరి జిల్లా 74.99 పశ్చిమ గోదావరి జిల్లా 79.03, కృష్ణా 79.29, గుంటూరు 76.74, ప్రకాశంలో జిల్లాలో 78.77 శాతం నమోదైంది. నెల్లూరులో 73.20 శాతం పోలింగ్‌ నమోదు కాగా… చిత్తూరులో 75.68, కడప 80.68, కర్నూలులో 76.52, అనంతపురంలో 82.26 శాతం పోలింగ్‌ నమోదైనట్లు తెలిపారు.

  • 21 Feb 2021 03:28 PM (IST)

    ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్

    కృష్ణా జిల్లాలో మధ్యాహ్నం 2.30 వరకు 79.27 శాతం పోలింగ్ కడప జిల్లాలో మధ్యాహ్నం 2.30 వరకు 80.68 శాతం పోలింగ్

  • 21 Feb 2021 03:09 PM (IST)

    సత్తెనపల్లి నియోజకవర్గంలో ఘర్షణ

    గుంటూరు జిల్లాలో తొలి మూడు విడతల్లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగినప్పటికీ నాలుగో విడత జరిగే గుంటూరు డివిజన్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. సత్తెనపల్లి నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో రెండు వర్గాలు దాడులు, ప్రతిదాడులకు పాల్పడ్డాయి. సత్తెనపల్లి మండలం దూళిపాలలో ఇద్దరు ఏజెంట్లు పోలింగ్ బూత్‌లోనే కొట్టుకున్నారు. తీవ్రంగా గాయపడ్డవారిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు.

  • 21 Feb 2021 02:44 PM (IST)

    అనంతపురం జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతోన్న పోలింగ్.. 1.30 గంటల వరకు ఎంత పోలింగ్ జరిగిందటే..

    ఏపీలో జరుగుతోన్న నాలుగో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. అనంతపురం జిల్లాలో ఓటర్లు భారీ ఎత్తున పోలింగ్ కేంద్రాలకు క్యూ కడుతున్నారు. మధ్యాహ్నం 1.30 గంటల వరకు అందిన సమాచారం మేరకు జిల్లా వ్యాప్తంగా 78.70 శాతం పోలింగ్ నమోదైంది. ఇంకా రెండు గంటలకు పైగా సమయం ఉండడంతో పోలింగ్ శాతం పెరిగే అవకాశాలున్నాయని అధికారులు భావిస్తున్నారు.

  • 21 Feb 2021 02:40 PM (IST)

    పోలింగ్ కేంద్రంలోకి వెళ్లేందుకు ప్రయ్నతించిన అభ్యర్థి.. ఇరువర్గాల మధ్య తోపులాట..

    గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం మాదలలో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. తన అనుచరులతో పోలింగ్ కేంద్రంలోకి వెళ్లేందుకు సర్పంచ్ అభ్యర్థి ప్రయత్నించడంతో.. మరో వర్గం అడ్డుకునే ప్రయత్నం చేసింది దీంతో తీవ్ర వివాదం చెలరేగింది. తోపులాటకు దిగడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు.

  • 21 Feb 2021 02:36 PM (IST)

    గాయపడిన పోలింగ్ ఏజెంట్.. నిందితులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన ఎస్పీ..

    ఏపీ పంచాయతీ నాలుగో దశ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఈ క్రమంలో గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం ముట్లూరులో వివాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో పోలింగ్ ఏజెంట్‌కు గాయలయ్యాయి. గాయపడిన వ్యక్తిని వెంటనే గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్పీ అమ్మిరెడ్డి నిందితులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది.

  • 21 Feb 2021 02:14 PM (IST)

    గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్న హోంమంత్రి సుచరిత

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. గుంటూరు జిల్లాలోని ఫిరంగిపురం మండలం గ్రామపంచాయతీ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.

  • 21 Feb 2021 01:30 PM (IST)

    ప్రశాంతంగా పోలింగ్.. అంతా పోలీసుల వల్లే అంటున్న డీజీపీ గౌతమ్ సవాంగ్..

    విజయగనరం జిల్లా కొత్తవలప జెడ్‌పీ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ పరిశీలించారు. అక్కడ పోలింగ్ ప్రక్రియను పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల వద్ద పరిస్థితిపై ఎస్పీకి ఫోన్ చేసి ఆరా తీశారు. ఆ సందర్భంగా డీజీపీ గౌతమ్ సవాంగ్ మీడియాతో మాట్లాడారు. గతంలో జరిగిన ఎన్నికల కంటే ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో చాలా వరకు ఘర్షణలు తగ్గాయని అన్నారు. పోలీసులు అప్రమత్తత వల్లే ఇది సాధ్యమైందని, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల వల్ల ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని డీజీపీ పేర్కొన్నారు. ఏ సమస్య వచ్చినా పోలీసులు వెంటనే చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. . విజయనగరం జిల్లా కొత్తవలస జడ్ పి హై స్కూల్ లో జరిగిన పోలింగ్ స్టేషన్ ను సందర్శించారు డిజిపి సవాంగ్.. పోలింగ్ స్టేషన్ వద్ద ఏర్పాట్లు, భద్రతా చర్యలను పరిశీలించిన ఆయన జిల్లా ఎస్ పి తో మాట్లాడి పోలింగ్ వివరాలను తెలుసుకున్నారు.

  • 21 Feb 2021 01:21 PM (IST)

    ప్రశాంతంగా నాల్గవ విడత పంచాయితీ ఎన్నికల పోలింగ్.. మధ్యాహ్నం 1 గంట వరకు పోల్ శాతం 66.60%..

    నాలుగో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా సాగుతోంది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 66.60శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఇక నాలుగో విడత పంచాయితీ ఎన్నికలు పోలింగ్ శాతం జిల్లాల వారీగా ఇలా ఉంది..

    శ్రీకాకుళం – 62.07% విజయనగరం – 77.20% విశాఖపట్నం – 73.30% తూర్పు గోదావరి – 64.04 % పశ్చిమ గోదావరి – 63.29% కృష్ణా – 62.82 % గుంటూరు – 62.87% ప్రకాశం – 61.79 % నెల్లూరు – 61.62 % చిత్తూరు – 66.62 % కడప – 69.93 % కర్నూలు – 68.62% అనంతపురం – 71.65%

  • 21 Feb 2021 01:16 PM (IST)

    తూర్పుగోదావరి జిల్లాలో విషాదం.. ఓటు వేయడానికి వెళ్లి పోలింగ్ బూత్ వద్దే ప్రాణాలొదిన వృద్దుడు..

    తూర్పుగోదావరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఓటు వేయడానికి వెళ్లిన దంగేటి నాగూరు(85) వృద్ధుడు పోలింగ్ కేంద్రం వద్దే ప్రాణాలొదిడాడు. ముమ్మిడివరం నియోజకవర్గంలోని కాట్రేనికోన మండలం చెయ్యేరు అగ్రహారంలో ఓటు వేయడానికి దంగేటి నాగూరు(85) పోలింగ్ కేంద్రానికి వెళ్లాడు. అయితే, బూత్ వద్దకు వెళ్లగానే అతను ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు, స్థానికులు అతన్ని పోలింగ్ కేంద్రం వద్దకు తీసుకెళ్లగా.. చనిపోయినట్లు నిర్ధారించారు.

  • 21 Feb 2021 12:54 PM (IST)

    ముమ్మిడివరం నియోజకవర్గంలో పోలింగ్, కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ మురళీధర్ రెడ్డి, ఎస్పీ నయీమ్ అస్మి..

    తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. కాగా, ఈ నియోజకవర్గం పరిధిలోని ఐ పోలవరం మండలం మురమళ్లలో జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి, జిల్లా ఎస్పీ నయీమ్ అస్మి పర్యటించారు. పోలింగ్ కేంద్రాలను, పంచాయతీ కౌంటింగ్ హాల్‌ను పరిశీలించారు.

  • 21 Feb 2021 12:51 PM (IST)

    గోపాలపురం గ్రామంలో ఓటు హక్కు వినియోగించుకున్న పీయూసీ చైర్మన్ చిర్ల జగ్గిరెడ్డి..

    పంచాయతీ ఎన్నికల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నాలుగో విడత పోలింగ్ కొనసాగుతోంది. ఇవాళ జరగుతున్న పోలింగ్‌లో పలువురు ప్రముఖులు తమ తమ గ్రామాల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొత్తపేట ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ చిర్ల జగ్గిరెడ్డి తన ఓటు హక్కును గోపాలపురం గ్రామంలో వినియోగించుకున్నారు. ఇకక ఆంధ్రప్రదేశ్ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం తన ఓటు హక్కును కొత్తపేటలో వినియోగించుకున్నారు.

  • 21 Feb 2021 12:41 PM (IST)

    కృష్ణా జిల్లా గన్నవరంలో ఓటర్‌కు షాక్.. ఓటు లేదంటూ తిప్పిపంపిన అధికారులు..

    కృష్ణా జిల్లా గన్నవరం 14వ వార్డులో ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్ కు అధికారులు షాక్ ఇచ్చారు. ‘నీ ఓటు లేదు.. డిలీట్ అయ్యింది’ అంటూ అధికారులు అతన్ని వెనక్కి పంపారు. దాంతో సదరు ఓటరు కాసేపు అధికారులతో వాదించినప్పటికీ అయోమయానికి గురై వెనక్కి వచ్చేశాడు.

  • 21 Feb 2021 12:39 PM (IST)

    గన్నవరంలో పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన ఎన్నికల అధికారి సుబ్రహ్మణ్యం

    గన్నవరం బాయ్స్ హైస్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని రాష్ట్ర ఎన్నికల అధికారి సుబ్రహ్మణ్యం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. కౌంటింగ్ సమయంలో ఎవరైనా అల్లర్లు అవాంఛనీయ ఘటనలకు పాల్పడితే.. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. పోలింగ్ సందర్భంగా ఓటర్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోందన్నారు. ఓటు హక్కు వినియోగించుకునేందకు ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు వస్తు్న్నారని చెప్పారు.

  • 21 Feb 2021 12:36 PM (IST)

    విశాఖపట్నం జిల్లాలోని సరిపల్లి గ్రామాన్ని సందర్శించిన డీజీపీ గౌతమ్ సవాంగ్..

    విశాఖపట్నం జిల్లాలోని పలు పంచాయతీలకు ప్రశాంతంగా పోలింగ్ జరుగుతోంది. కాగా, పెందుర్తి మండలం, సరిపల్లి గ్రామంలో రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ పర్యటించారు. ఎన్నికల సరళిని పరిశీలించారు. అక్కడ పరిస్థితులపై అధికారులను ఆరా తీశారు. అనంతరం అక్కడి నుంచి వెనుదిరిగారు.

  • 21 Feb 2021 12:32 PM (IST)

    నెల్లూరు జిల్లాలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షం.. మందకొడిగా సాగుతున్న పోలింగ్..

    నెల్లూరు జిల్లాలో నాలుగో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. నెల్లూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని 12 మండలాల్లో 181 పంచాయతీలు, 1527 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే, పలు మండలాల్లో తెల్లవారుజాము నుంచే ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ముఖ్యంగా రాపూరు, కోవూరు, వెంకటాచలం, పొదలకురు మండలాల్లో వర్షం పడుతోంది. దాంతో ఆయా ప్రాంతాల్లో పోలింగ్ మందకొడిగా సాగుతుంది.

  • 21 Feb 2021 12:27 PM (IST)

    తూర్పుగోదావరి జిల్లాలో విషాదం.. ఓటు వేసిన మరుక్షణమే ప్రాణాలు విడిచిన వృద్ధుడు..

    తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం కొమరాడలో విషాదం నెలకొంది. పాలూరు కొండయ్య అనే ఓటర్ తన ఓటు హక్కును వినియోగించుకున్న కాసేపటికే చనిపోయాడు. రాష్ట్ర వ్యాప్తంగా నాలుగో విడత పోలింగ్ ప్రక్రియ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగొ కొండయ్య కొమరాడ పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించున్నాడు. బ్యాలెట్ బాక్స్‌లో ఓటు వేసి అక్కడే కుప్పకూలిపోయాడు. అది చూసి షాక్ అయిన పోలింగ్ సిబ్బంది వెంటనే వైద్య సిబ్బందికి సమాచారం అందించారు. పోలింగ్ కేంద్రానికి చేరుకున్న వైద్య సిబ్బంది.. కొండయ్యను పరిశీలించగా అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు.

  • 21 Feb 2021 12:20 PM (IST)

    గుంటూరు జిల్లా మాదాలలో ఉద్రిక్తత.. పోలింగ్ బూత్‌లోకి వెళ్లేందుకు యత్నించిన వైసీపీ అభ్యర్థి..

    గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం మాదాలలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ అభ్యర్థి తన అనుచురులతో కలిసి పోలింగ్ బూత్‌లోకి వెళ్లేందుకు యత్నించాడు. అది గమనించిన టీడీపీ వర్గీయులు వారిని అడ్డుకున్నారు. దాంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. ఈ క్రమంలో వైసీపీ, టీడీపీ నేతలు పరస్పరం తోసుకున్నారు. వెంటనే స్పందించిన పోలీసులు తమ లాఠీలకు పని చెప్పారు. ఇరు వర్గాలను చెదరగొట్టారు.

  • 21 Feb 2021 11:25 AM (IST)

    తిరుపతిలోని కందులవారి పల్లి పంచాయతీ పోలింగ్ కేంద్రంలో ఉద్రిక్తత.. రంగంలోకి ఏఎస్పీ రిశాంత్ రెడ్డి..

    తిరుపతి పరిధిలోని కందులవారి పల్లి పంచాయతీ పోలింగ్ బూత్ వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. క్యూలైన్ల వద్ద టీడీపీ మద్దతుగా ప్రచారం చేయడాన్ని వైసీపీ మద్దతుదారులు తీవ్రంగా వ్యతిరేకించారు. విషయం తెలుసుకున్న అడిషనల్ ఎస్పీ రిశాంత్ రెడ్డి పోలింగ్ బూత్ వద్దకు చేరుకున్నారు. మరోవైపు పోలీసులు సైతం భారీగా మోహరించారు. ఇదిలాఉంటే.. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు ఆసక్తి కనబరుస్తున్నారు. వృద్ధులు సైతం క్యూలైన్లలో వేచి ఉన్నారు. ఇప్పటి వరకు ఇక్కడ 40 శాతానికి పైగానే పోలింగ్ నమోదైందని అధికారులు తెలిపారు.

  • 21 Feb 2021 11:20 AM (IST)

    గుంటూరు జిల్లా దూళిపాళ్లలో తీవ్ర ఉద్రిక్తత.. పరస్పర దాడులకు పాల్పడ్డ ఏజెంట్లు..

    గుంటూరు జిల్లాలోని దూళిపాళ్లలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలింగ్ కేంద్రంలో ఏజెంట్ల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఏజెంట్లు ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.

  • 21 Feb 2021 11:18 AM (IST)

    అత్యధిక పంచాయతీలు గెలుచుకుంటాం.. ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ధీమా..

    నాలుగో దశ ఎన్నికల్లో తమ పార్టీ అత్యధిక స్థానాలను గెలుచుకుంటుందని దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గం అంతటా ప్రశాంత వాతావరణం ఉందని, పోలింగ్ పక్రియ ఎలాంటి అవాంతరం లేకుండా సాగుతోందన్నారు. అయితే, ప్రశాంతంగా జరుగుతున్న ఎన్నికల్లో ఉద్రిక్తత పెంచేందుకు చింతమనేని ప్రభాకర్ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఆరోపించారు. ఆ కారణంగానే పోలీసులు ఆయనపై కేసులు పెట్టారన్నారు.

  • 21 Feb 2021 11:14 AM (IST)

    పోలింగ్ కేంద్రంలోకి బయటి వ్యక్తి.. కృష్ణా జిల్లాలోని ఉంగుటూరు పోలింగ్ కేంద్రం ఉద్రిక్తత..

    కృష్ణా జిల్లాలోని ఉంగుంటూరు పోలింగ్ కేంద్రం వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. వృద్ధ దంపతులతో ఓటే వేయించేందుకు పోలింగ్ కేంద్రానికి బయటి వ్యక్తి వచ్చాడు. అయితే, బయటి వ్యక్తిని పోలింగ్ బూతులోకి ఎలా రాణిస్తారంటూ ప్రత్యర్థి పార్టీల ఏజెంట్లు, ఓటర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతో ఆర్‌వో, పోలీసులు కలుగజేసుకున్నారు. బయటి వ్యక్తిని పంపించి వారికి సర్దిచెప్పారు. దాంతో ఉద్రిక్తత సద్దుమణిగింది.

  • 21 Feb 2021 11:10 AM (IST)

    ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రశాంతంగా సాగుతున్న పోలింగ్.. 10.30 వరకు 41.55 శాతం పోలింగ్..

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. భారీ భద్రత మధ్య పోలింగ్ జరగుతుండగా.. ఓటు వేసేందుకు ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 6.30 పోలింగ్ ప్రారంభం కాగా, 10.30 గంటల వరకు 41.55 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు.

  • 21 Feb 2021 10:19 AM (IST)

    పులివెందుల, జమ్మలమడుగులో భారీ భద్రత.. పోలింగ్ ప్రక్రియను పరిశీలిస్తున్న అధికారులు..

    కడప జిల్లాలోని పులివెందుల, జమ్మలమడుగు నియోజకవర్గాల్లో పలు గ్రామ పంచాయతీలకు పోలింగ్ ప్రక్రియ కొసాగుతోంది. 224 గ్రామ పంచాయతీలకు గానూ 108 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 114 స్థానాలకు నేడు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. కాగా, ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామాల్లో ఎన్నికల నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వేముల మండలం దుగ్గన్న గారి పల్లెలో సాధారణ ఏజెంట్లను పోలీసులు అనుమతించడం లేదు. ఇదిలాఉండగా.. చివరి దశ ఎన్నికల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ హరికిరణ్, ఎస్పీ అన్బురాజన్ ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు.

  • 21 Feb 2021 10:15 AM (IST)

    అనంతపురంలో రసవత్తర పోరు.. ఓవైపు ఎమ్మెల్యే బాలకృష్ణ.. మరోవైపు మంత్రి శంకర్ నారాయణ..

    అనంతపురం జిల్లా వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఓవైపు టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ, మరోవైపు మంత్రి శంకర్ నారాయణ, ఎంపీ గోరంట్ల మాధవ్ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దాంతో ఈ జిల్లాలో పంచాయతీ ఎన్నికలపైనే అందరి దృష్టి నెలకొంది. ఈ ముగ్గురు నేతలు బలపరిచిన అభ్యర్థుల మధ్య ఉత్కంఠ పోరు సాగుతోంది.

  • 21 Feb 2021 09:11 AM (IST)

    కృష్ణా జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బ.. ఎన్నికలను బహిష్కరించిన సొంత పార్టీ అభ్యర్థి..

    కృష్ణా జిల్లా గంపలగూడెం మండలంలోని పెనుగోలను గ్రామంలో టీడీపీకి గట్టి షాక్ తగిలింది. సొంత పార్టీ అభ్యర్థి నుంచే ఊహించని తిరస్కరణ ఎదురైంది. పార్టీ అధిష్టానం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. టీడీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి జ్యోతి ఎన్నికలను బహిష్కరించారు. ఇకపోతే.. టీడీపీ గ్రామశాఖ అధ్యక్షుడు కోటా హరిబాబు సైతం ఆ పార్టీకి గుడ్ బై చెప్పాడు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించాడు. ఎన్నికల్లో ఆర్థిక సాయం చేస్తామని చెప్పి.. తమను ఏమాత్రం పట్టించుకోవడం లేదని అభ్యర్థి సహా గ్రామానికి చెందిన టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

  • 21 Feb 2021 08:28 AM (IST)

    ప్రకాశం జిల్లా రావిపాడులో ఉద్రిక్త.. వైసీపీ, టీడీపీ నేతల మధ్య ఘర్షణ..

    ప్రకాశం జిల్లాలోని కంభం మండలం రావిపాడులో ఉద్రిక్తత నెలకొంది. ఓటర్ స్లిప్పుల విషయంలో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. దాంతో వైసీపీ, టీడీపీ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. ఇరు వర్గాలను చెదరగొట్టారు.

  • 21 Feb 2021 08:14 AM (IST)

    మంత్రి ఆదిమూలపు సురేష్ ఇలాకాలో ఎన్నికలు.. హోరాహోరీగా తలపడుతున్న అభ్యర్థులు..

    ప్రకాశం జిల్లాలో నాలుగో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 6.30 గంటలకు పోలింగ్‌ ప్రక్రియ ప్రారంభం అయింది. 12 మండలాల్లోని 208 పంచాయతీలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలవగా.. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ అనంతరం 40 పంచాయతీల సర్పంచ్ స్థానాలతో పాటు, 856 వార్డు సభ్యులకు ఒకే ఒక్క నామినేషన్‌ ఉండటంతో అవి ఏకగ్రీవమైనట్టు ప్రకటించారు. ఏకగ్రీవాలు మినహా మిగిలిన 168 పంచాయతీ సర్పంచులకు 472 మంది పోటీ పడుతున్నారు. అలాగే 1,261 వార్డులకు 2,664 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వీటికి పోలింగ్‌ నిర్వహణ, తదనంతరం ఓట్ల లెక్కింపు చేపడతారు. చివరి విడత ఎన్నికల్లో మొత్తం 4,43,565 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. గత కొద్ది రోజులుగా గ్రామాల్లో అభ్యర్థులు ప్రచారంతో హోరెత్తించారు. రెబల్స్‌ బెడద ఎక్కువగా ఉండటం, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న యర్రగొండపాలెం ఈ విడతలో ఉండటంతో నాయకులు ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. మేజర్ గ్రామపంచాయితీ యర్రగొండపాలెంలో ఓటు హక్కు వినియోగించుకొనేందుకు ఉత్సాహంగా ఓటర్లు తరలివస్తున్నారు. ఇక సమస్యాత్మక ప్రాంతాలపై పోలీసులు పూర్తిస్థాయిలో నిఘా ఉంచారు.

  • 21 Feb 2021 08:10 AM (IST)

    నరసన్న పేట, శ్రీకాకుళం, ఎచ్చెర్ల నియోజకవర్గాల్లో పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు..

    శ్రీకాకుళం జిల్లాలో పంచాయతీ ఎన్నికల నాలుగో దశ పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. జిల్లా పరిధిలోని నరసన్నపేట, శ్రీకాకుళం, ఎచ్చెర్ల నియోజకవర్గాల్లోని తొమ్మిది మండలాల్లో పోలింగ్ జరుగుతోంది. ఈ పోలింగ్ నేపథ్యంలో ఆరు గంటల నుంచే ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఇకపోతే జిల్లా వ్యాప్తంగా 274 పంచాయతీలకు 15 ఏకగ్రీవం అయ్యాయి. 259 పంచాయతీల్లో పోలింగ్ జరుగుతోంది. నరసన్నపేట, శ్రీకాకుళం, ఎచ్చెర్ల నియోజకవర్గాల్లోని తొమ్మిది మండలాల్లో పోలింగ్ జరుగుతోంది. కాగా, పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

  • 21 Feb 2021 07:52 AM (IST)

    శ్రీకాకుళం జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతున్న చివరి పంచాయతీ ఎన్నికల పోలింగ్..

    ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో చివరి దశ పంచాయతీ పోలింగ్ ప్రక్రియ కొద్ది సేపటికి క్రితం ప్రారంభమయింది. జిల్లాలోని మూడు నియోజకవర్గాల పరిధిలోని తొమ్మిది మండలాల్లోని 259 పంచాయతీల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. 2206 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన జిల్లా యంత్రాంగం ఓటర్లు తమ ఓటు హక్కును నిర్బయంగా వినియోగించుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. దీంతో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు దేరారు. శాంతి భద్రతలకు నిఘాతం కలగకుండా వుండేందుకు అతి సమస్యాత్మక, సమస్యాత్మక కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. చివరి దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సత్యం అందిస్తారు.

  • 21 Feb 2021 07:50 AM (IST)

    ‘ఓటర్లను అన్ని పార్టీలు ప్రలోభాలకు గురిచేశాయి కానీ’.. పోలింగ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే..

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగో విడత పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ పోలింగ్‌పై దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటర్లను అన్ని పార్టీలు ప్రలోభాలకు గురిచేశాయన్నారు. అయితే, అధికార వైసీపీ మాత్రం భయభ్రాంతులకు గురిచేస్తోందని ఆరోపించారు. పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ బెదిరింపులకు పాల్పడినా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గట్టి పోటీ ఇచ్చారని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సహజంగానే అధికారంలో ఉన్న పార్టీకి ఎక్కువ స్థానాలు వస్తాయని చింతమనేని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో అనూహ్యంగా పుంజుకుని బలమైన ప్రతిపక్షమని నిరూపించామన్నారు.

  • 21 Feb 2021 07:45 AM (IST)

    గుంటూరు జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్.. ఓటు వినియోగించుకోనున్న 6.50 లక్షల ఓటర్లు

    గుంటూరు జిల్లాలో నాలుగో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. గుంటూరు డివిజన్‌లోని 16 మండలాల్లో ఎన్నికలు జరుగుతుండగా.. 266 గ్రామాలకు 27 గ్రామాల్లో ఇప్పటికే ఏకగ్రీవం అయ్యాయి. ఇవాళ 239 గ్రామ పంచాయతీలకు , 2085 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 2916 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, చివరి విడత పోలింగ్‌లో 6.50 లక్షల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

  • 21 Feb 2021 07:41 AM (IST)

    గుంటూరు జిల్లాలోని అచ్చంపేట మండలం వేల్పూరులో పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు..

    గుంటూరు జిల్లాలోని అచ్చంపేట మండలం వేల్పూరులో పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. పోలింగ్ ప్రక్రియను ఆటంకం కలిగిస్తారనే అనుమానంతో టీడీపీ ఏజెంట్ సహా మరికొంతమందిని అరెస్ట్ చేశారు. అయితే, టీడీపీ ఏజెంట్ సహా మరికొంతమందిని పోలీసులు అకారణంగా తీసుకెళ్లారంటూ వారి బంధువులు ఆందోళనలకు దిగారు.

  • 21 Feb 2021 07:38 AM (IST)

    తూర్పుగోదావరి జిల్లా అమలాపురం డివిజన్‌ పరిధిలో కొనసాగుతున్న పోలింగ్.. భారీగా తరలివస్తున్న ఓటర్లు..

    తూర్పుగోదావరి జిల్లా అమలాపురం రెవెన్యూ డివిజన్‌ పరిధిలో నాలుగో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ డివిజన్ పరిధిలో మొత్తం 16 మండలాలు ఉండగా. 273 గ్రామ పంచాయితీలు ఉన్నాయి. వీటిలో 14 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. 259 గ్రామ పంచాయితీలకు ఇవాళ పోలింగ్ జరుగుతోంది. మొత్తం 711 మంది సర్పంచ్ పదవుల కోసం పోటీ పడుతున్నారు. అలాగే 3142 వార్డులుండగా.. 1077 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. దాంతో 2060 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. వార్డు మెంబర్ కోసం 4576 మంది అభ్యర్థులు పోలీ పడుతున్నారు. ఇదిలాఉండగా జిల్లా వ్యాప్తంగా 292 సమస్యాత్మక ప్రాంతాలు ఉండగా, 234 అత్యంత సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి.

Published On - Feb 21,2021 8:31 PM

Follow us
అబ్బాయి కోసం బాబాయ్.రీల్ గేమ్ గేమ్ ఛేంజర్ కోసం పొలిటికల్ గేమ్ ఛేం
అబ్బాయి కోసం బాబాయ్.రీల్ గేమ్ గేమ్ ఛేంజర్ కోసం పొలిటికల్ గేమ్ ఛేం
దర్శక ధీరుడు రాజమౌళి ఇంట్లో ఆ మహనీయుని చిత్ర పటం
దర్శక ధీరుడు రాజమౌళి ఇంట్లో ఆ మహనీయుని చిత్ర పటం
సుడాన్ శిశువును నిలోఫర్ వైద్యులు కాపాడారు... ఏం జరిగిందంటే..
సుడాన్ శిశువును నిలోఫర్ వైద్యులు కాపాడారు... ఏం జరిగిందంటే..
ఇదేందీ అయ్యో ఇది నిజమేనా..!గాల్లో ఎగురుతున్న జింక...వీడియో చూస్తే
ఇదేందీ అయ్యో ఇది నిజమేనా..!గాల్లో ఎగురుతున్న జింక...వీడియో చూస్తే
నిను వీడని నీడను నేను. పాటను ప్రాక్టీస్‌ చేస్తున్న దీపిక పదుకోన్‌
నిను వీడని నీడను నేను. పాటను ప్రాక్టీస్‌ చేస్తున్న దీపిక పదుకోన్‌
షాకింగ్.. తమన్నా బాయ్ ఫ్రెండ్‌కు ఆ అరుదైన చర్మ సమస్య
షాకింగ్.. తమన్నా బాయ్ ఫ్రెండ్‌కు ఆ అరుదైన చర్మ సమస్య
నిద్రపోయేటప్పుడు ఫోన్‌ని దగ్గర పెట్టుకుంటున్నారా? పెద్ద ప్రమాదం..
నిద్రపోయేటప్పుడు ఫోన్‌ని దగ్గర పెట్టుకుంటున్నారా? పెద్ద ప్రమాదం..
ఎర్ర తోటకూరతో ఎన్ని లాభాలో తెలిస్తే..అసలు వదిలిపెట్టకుండా తింటారు
ఎర్ర తోటకూరతో ఎన్ని లాభాలో తెలిస్తే..అసలు వదిలిపెట్టకుండా తింటారు
టాలెంట్ ఎవడి అబ్బా సొత్తు కాదు.. బియ్యం గింజ సైజులో 2025 లోగో
టాలెంట్ ఎవడి అబ్బా సొత్తు కాదు.. బియ్యం గింజ సైజులో 2025 లోగో
పిస్తా తింటున్నారా..? అయితే, ముందుగా ఈ విషయాలు తెలుసుకోండి.!
పిస్తా తింటున్నారా..? అయితే, ముందుగా ఈ విషయాలు తెలుసుకోండి.!
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..