Drug Injections Seized: సాగర తీరంలో డ్రగ్స్ దందా.. మూడు యాంపిల్స్‌.. ఆరు ఇంజెక్షన్లు.. టార్గెట్ ఎవరో తెలుసా..!

మత్తు మాఫియా టార్గెట్‌ మొత్తం సాగర తీరంలోని యువతే. బడా బడా కార్పొరేట్‌ కాలేజీలను టార్గెట్‌ చేస్తారు. యూత్‌ని మచ్చికచేసుకుని.. వారికి మెల్లగా డ్రగ్స్‌ను పరిచయం చేస్తారు.

Drug Injections Seized: సాగర తీరంలో డ్రగ్స్ దందా.. మూడు యాంపిల్స్‌.. ఆరు ఇంజెక్షన్లు.. టార్గెట్ ఎవరో తెలుసా..!
Drug Injections Seized
Follow us
Sanjay Kasula

|

Updated on: Feb 21, 2021 | 7:45 PM

Drug Injections Seized: స్టీల్‌ సిటీలో ఓవైపు ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతోంది. మరోవైపు డ్రగ్స్‌ దందా చాపకింద నీరులా పాకుతోంది. యువతను మత్తులోకి దించుతూ.. డ్రగ్స్‌ మాఫియా చెలరేగిపోతోంది.

మత్తు మాఫియా టార్గెట్‌ మొత్తం సాగర తీరంలోని యువతే. బడా బడా కార్పొరేట్‌ కాలేజీలను టార్గెట్‌ చేస్తారు. యూత్‌ని మచ్చికచేసుకుని.. వారికి మెల్లగా డ్రగ్స్‌ను పరిచయం చేస్తారు. ఒక్కసారి అడిక్ట్‌ అయితే.. ఇక జీవితం సర్వనాశనమే.

స్టీల్‌ సిటీలో మకాం వేసిన ముఠాలు.. డ్రగ్స్‌ని ఒడిశా, వెస్ట్‌బెంగాల్‌, చత్తీష్‌గడ్‌ నుంచి ఇంపోర్ట్‌ చేస్తున్నారు. దీనంతటికి సెంటర్‌ గా మారిన విశాఖ.. మత్తుకు బానిస అవుతోంది. ఇలాంటి వాటిపై అప్పుడప్పుడు దాడులు చేసినా చెక్‌ పడడం లేదు. విశాఖ సెంటర్‌ సిటీతో పాటు.. ఇసుకతోట, గోకుల్‌ థియేటర్‌, గాజువాక, ఆటో నగర్‌, గోపాలపట్నం, కూర్మన్నపాలెంలో ఈ మాఫియా వ్యాపారం మూడు యాంపిల్స్‌.. ఆరు ఇంజెక్షన్లుగా సాగిపోతోంది.

ఇంతకీ ఏంటీ ఇంజెక్షన్లు..? విశాఖ వరకు ఎలా చేరిపోతున్నాయి? ఎవరికి సప్లై చేస్తున్నారు? గంజాయి, ఎల్‌ఎస్‌డీ, ఎండీఎంఏకి దీటుగా పెంటాజోసైన్‌ ఇంజెక్షన్లు భారీగా ఇంపోర్ట్‌ అవుతున్నాయి. ఆన్‌లైన్‌ ఆర్డర్స్‌, కొరియర్‌లో వెస్ట్‌ బెంగాల్‌ టు విశాఖ వయా ఒడిశాకు ట్రాన్స్‌పోర్టు అవుతోంది. కిక్‌ ఇచ్చే పెంటాజోసైన్‌ ఇంజెక్షన్లపై ఏపీలో నిషేధం. ఐనా ఫోర్ట్‌విన్‌ ఇంజెక్షన్లు బోర్డర్‌ స్టేట్స్‌ నుంచి దిగుమతి అవుతున్నాయి.

కూర్మన్నపాలంలో కూపీలాగిన పోలీసులకు… ఏకంగా 15వందల ఇంజక్షన్లు పట్టుబడ్డాయి. కుర్మన్నపాలెం గాంధీ సెంటర్‌లో కొరియర్‌ ద్వారా సరఫరా అవుతున్నట్టు గుర్తించారు పోలీసులు. విశాఖలాంటి మహానగరంలో కాస్మోపాలిటన్‌ కల్చర్‌ ఊపందుకోవడం.. పబ్బులు, పార్టీల కల్చర్‌ నానాటికీ విస్తరించడానికి తోడు.. ఈ వినియోగం విచ్చలవిడిగా పెరిగి పోతోంది. పెంటాజోసైన్‌ లాక్టేట్‌ అనే డ్రగ్‌ను విపరీతమైన నొప్పిని తగ్గించేందుకు వైద్యులు వాడుతుంటారు. సర్జరీ సమయాల్లో, క్యాన్సర్‌ పేషెంట్లకు వీటిని వినియోగిస్తుంటారు. వైద్యుల సూచన మేరకే వాడాలి.. కానీ.. ఇక్కడ డ్రగ్‌ లాగా వాడడం ఆందోళన కల్గిస్తోంది.