డబుల్ మర్డర్‌తో రగిలిపోతున్న మంథని.. సెన్సిటీవ్ ప్రాంతంగా మారు మూల గ్రామం గుంజపడుగు
మంథని దగ్గరలోని గుంజపడుగు. పెద్దపల్లి జిల్లాలోని ఓ మారు మూల ప్రాంతం. అలాంటిది ఇప్పుడు ఉద్రిక్తతలు, ప్రముఖుల పరామర్శలకు కేంద్రంగా మారింది. నాలుగు రోజులుగా..
Couple Murder Case: ఈ మర్డర్స్ ఇష్యూతో మంథని మండిపోతోంది. జంట హత్యల తర్వాత చుట్టు పక్కల ప్రాంతాల్లో ధర్నాలు, రాస్తారోకోలతో టెన్షన్‌గా మారింది. ఎప్పుడు ఎక్కడ ఎప్పుడు ఆందోళన చేపడుతారోనన్న సమాచారంతో అంతటా పోలీస్.. అలర్ట్ ప్రకటించారు. ప్రధాన చౌరస్తాల్లో గట్టి బందోబస్తును ఏర్పాటు చేసిన పోలీసులు.. అటు సీన్ ఆఫ్ అపెన్స్ స్పాట్‌లో కూడా ఎవిడెన్స్ చెడిపోకుండా నిరంతరం సెక్యూరిటీని ఏర్పాటు చేశారు.
మంథని దగ్గరలోని గుంజపడుగు. పెద్దపల్లి జిల్లాలోని ఓ మారు మూల ప్రాంతం. అలాంటిది ఇప్పుడు ఉద్రిక్తతలు, ప్రముఖుల పరామర్శలకు కేంద్రంగా మారింది. నాలుగు రోజులుగా నిరంతరం పోలీసు నిర్బంధంలో ఉంది. న్యాయవాదులు వామన్‌రావు జంట హత్యల తర్వాత సెన్సిటీవ్ ప్రాంతంగా మారింది. హంతకులను శిక్షించాలంటూ, ఇది రాజకీయ హత్యలంటూ ప్రతిపక్షాలు, న్యాయవాద సంఘాలు డిమాండ్ చేస్తూ.. ఆందోళన చేపట్టాయి.
బీజేపీ లీగల్ సెల్ ఇచ్చిన చలో గుంజపడుగు పిలపు మేరకు న్యాయవాదులు హైదరాబాద్ నుంచి తరలి వచ్చారు. దీంతో మంథని పరిసరాల్లో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు మందు జాగ్రత్తగా పలు చోట్ల సెక్యూరిటీని పెంచారు. ఈ బందోబస్తులోనే.. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కలవచర్లలో మర్డర్ స్పాట్‌ను పరిశీలించారు న్యాయవాదులు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేసిన లాయర్లు.. ఈ సంఘటన వెనక రాజకీయ నాయకుల ప్రమేయం ఉందని ఈ హత్యలు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు హైకోర్టు న్యాయవాది ప్రసన్న.
హత్యలలో దాగి ఉన్న వారందరూ బయటికి రావాలంటే వెంటనే సీబీఐ విచారణ జరిపించాలని అదేవిధంగా ఇప్పుడు పోలీస్ అరెస్ట్ చేసిన ముగ్గురు దోషులను ఎన్‌కౌంటర్ చేయకుండా ఉండాలని వారు డిమాండ్ చేశారు న్యాయవాది గీతాదేవి. దాడుల నుంచి న్యాయవాదులకు రక్షణ కల్పించేందుకు ప్రత్యేక చట్టాలు అవసరమన్నారు బీజేపీ లీగల్ సెల్ నేత. ఈ ఘటనపై అన్ని కోణాల్లో విచారణ జరిపించి, సూత్రదారులను బయటకు తీసుక రావాలని న్యాయవాది జంగాడి కృష్ణా రెడ్డి డిమాండ్ చేశారు .
ఇలాంటి వరస ఘటనలతో ఈ కేసులో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు వస్తున్నాయి. మర్డర్ జరిగిన స్పాట్‌లో సెక్యూరిటీని కట్టుదిట్టం చేశారు. సీన్ ఆఫ్ అపెన్స్‌లో ఆధారాలు చెడిపోకుండా.. సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. ప్రత్యేక జిబ్రాలైన్స్‌తో పహారా కాస్తున్నారు. ఏదైనా ఆక్సిడెంట్స్ జరిగితే.. స్పాట్ నుంచి వెమికిల్స్‌ను తొలగిస్తారు.
ఇక్కడ మాత్రం కేసు సెన్సిటీవ్‌ను పరిగణలోకి తిసుకొవడంతో స్పాట్‌కి ప్రాధాన్యత ఏర్పడింది. మర్డర్ జరిగిన చోట మొదట్లో పోలీసుల తీరుపై విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇతరులెవరూ ఘటన స్థలం వద్దకు రాకుండా చుట్టూ కోన్స్‌తో తాత్కాలికంగా కంచెతో పాటు సిబ్బందిని కాపలాగా ఉంచారు. మరో సారి స్పెషల్ టీమ్ స్పాట్‌ను విజిట్ చేసే ఛాన్స్ ఉండడంతో.. ఫింగర్ ఫ్రింట్స్ కోసం కారును కదిలించలేదు.