Bollaram Fire Accident: ఐడీఏ బొల్లారంలో భారీ అగ్ని ప్రమాదం.. ఒకరు మృతి.. ఇద్దరికి తీవ్ర గాయాలు

Bollaram Fire Accident: సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆదివారం సాయంత్రం చిన్న ఖేతాన్‌ ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదంలో..

Bollaram Fire Accident: ఐడీఏ బొల్లారంలో భారీ అగ్ని ప్రమాదం.. ఒకరు మృతి.. ఇద్దరికి తీవ్ర గాయాలు
Follow us
Subhash Goud

|

Updated on: Feb 21, 2021 | 6:47 PM

Bollaram Fire Accident: సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆదివారం సాయంత్రం చిన్న ఖేతాన్‌ ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో 9 మందికి గాయాలైనట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పుతున్నారు.

కాగా, కంపెనీలో మంటలు భారీగా చెలరేగుతుండటంతో ఫైర్‌ సిబ్బంది మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ ప్రమాదంలో గాయాలైన 9 మందిలో  ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అయితే హీటర్‌ పేలడంతో ప్రమాదం జరిగినట్లు కార్మికులు చెబుతున్నారు. పేలుడు ధాటికి కంపెనీలో గోడలు పగిలిపోయాయి. పరికరాలన్నీ చెల్లాచెదురైపోయాయి. ప్రమాదం జరిగిన సమయంలో కంపెనీలో 100 మంది కార్మికులున్నట్లు చెబుతున్నారు.

Also Read:

Dilsukhnagar Bomb Blast: దిల్‌సుఖ్‌నగర్‌ విషాదానికి ఎనిమిదేళ్లు.. ఇంకా మర్చిపోలేకపోతున్న బాధితులు

జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి.. ఎనిమిది మందికి తీవ్ర గాయాలు.. ముగ్గురి పరిస్థితి విషమం