Surabhi Vani Devi: పీవీ కూతురుకు ఎమ్మెల్సీ.. రేపు నామినేషన్ దాఖలు చేయనున్న సురభి వాణీదేవి
Surabhi Vani Devi: హైదరాబాద్-రంగారెడ్డి- మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ టీఆర్‌ఎస్ అభర్థి పేరు ఖరారైంది. టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా దివంగత పీవీ నరసింహారావు కుమార్తె సురభి ..
Surabhi Vani Devi: హైదరాబాద్-రంగారెడ్డి- మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ టీఆర్‌ఎస్ అభర్థి పేరు ఖరారైంది. టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె సురభి వాణీదేవిని ఖరారు చేశారు. దీంతో సురభి వాణీదేవి సోమవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. అయితే పీవీ నరసింహారావు శతజయంత్యుత్సవాల సందర్భంగా గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పీవీ కూతురుకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చేందుకు ప్రకటన చేశారు. దీంతో హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆమె పేరును ఖరారు చేశారు. దీంతో ఆమె నామినేషన్ వేయనున్నారు.
కాగా, దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె 1952 ఏప్రిల్ 1న వంగరలో జన్మించారు. ఉస్మానియా వర్సిటీ నుంచి బీఏ పూర్తి చేసిన వాణీదేవి.. జేఎన్‌టీయూ నుంచి ఫైన్ ఆర్ట్స్‌లో డిప్లొమా పూర్తి చేశారు. నల్గొండ, వరంగల్, ఖమ్మం, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్ రెడ్డిని టీఆర్‌ఎస్ ప్రకటించిన విషయం తెలిసిందే.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు 23 తేదీ వరకు నామినేషన్‌ను స్వీకరించనున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ స్వీకరించనున్నారు. 24న నామినేషన్‌లను పరిశీలించనున్నారు. 26 వరకు ఉపసంహరణ గడువు విధించారు. ఇక మార్చి 14న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. మార్చి 17న ఓట్ల లెక్కింపు ఉంటుంది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ స్థానం 5.60 లక్షల మంది ఓటర్లున్నారు. ఇక 616 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
Also Read: YS Sharmila: వైఎస్ షర్మిలను కలిసిన టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కుమారుడు.. రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్