Horoscope Today : ఈరోజు ఏ రాశివారు పొందే ఫలితాలు ఏంటి.. ఏ దేవుడిని ఆరాధిస్తే శుభఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం..!
ఈ రోజు (21-ఫిబ్రవరి-2021)న మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకొని. పనులు ప్రారంభించాలా.? వాయిదా వేసుకోవాలా.? ఎలాంటి విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి.. ఏ దేవుడిని ఆరాధిస్తే శుభఫలితాలు కలుగుతాయి..
Horoscope Today: మనం ప్రతి రోజూ ఏదో ఒక కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించడం లేదా ఇతర వ్యవహారాల్లో పాల్గొనాల్సి ఉంటుంది. మరి ఎలాంటి అంశాలు వివాదానికి దారి తీస్తాయి.. ఏవి మనకు అనుకూలిస్తాయి. లాంటి వివరాలు తెలుసుకొని పనులు ప్రారంభించడం చాలా ముఖ్యం. రాశి ఫలం ఆధారంగా చేసే పనుల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళితే అంతా మంచే జరుగుతుంది. మరి ఈ రోజు (21-ఫిబ్రవరి-2021)న మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకొని. పనులు ప్రారంభించాలా.? వాయిదా వేసుకోవాలా.? ఎలాంటి విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి.. ఏ దేవుడిని ఆరాధిస్తే శుభఫలితాలు కలుగుతాయి… వంటి నిర్ణయాలు తీసుకోండి.. ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
మేష రాశి: మేష రాశి వారు నిర్వహించే వృత్తి, వ్యక్తిగత వ్యవహారాలను జాగ్రత్తగా నిర్వహించుకోవాలి.. సుబ్రమణ్య స్వామిని ఈ రాశి వారు ఆరాధించాలి.
వృషభ రాశి: ఈ రాశి వారు ఈరోజు పలు రకాల కుటుంబ కార్యక్రమాలలో పాల్గొంటారు. రావలసిన బాకీలు వసూలు చేసుకుంటారు. ఈ రాశి వారు ఈరోజు చిన్నపిల్లలకు తీపి పదార్ధాలను అందించడం మంచిది.
మిథున రాశి: మిథున రాశి వారు ఈరోజు బంగారం, వెండి వస్తువులను కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. పేదవారికి కాయగూరలు దానం చేయడం మంచిది.
కర్కాటక రాశి: ఈ రాశివారు శ్రమాధిక్యతో చేపట్టిన పనులు పూర్తి చేసుకుంటారు.. ఈ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామికి తులసీ దళములను సమర్పించడం అత్యంత శ్రేష్టం..
సింహ రాశి: సింహ రాశి వారు ఈరోజు వ్యావహారిక విషయాల్లో కొన్ని ఇబ్బందులు కనిపిస్తున్నాయి. కనుక జాగ్రత్తగా పూర్తి చేయడం మంచిది.. ఈ రాశి పేదవారికి వారి శక్తిమేర అన్నదానం, వస్త్ర దానం, కాయగూరలు దానం వంటి కార్యక్రమాలు నిర్వహించడం మేలు చేస్తుంది.
కన్య రాశి: ఈ రాశి వారికి ఈరోజు సంఘంలో మంచి శుభఫలితాలు ఉంటాయి. కొన్ని అనుకోని వంటి వస్తువులను కొనుగోలు చేయడానికి ఆలోచిస్తారు. ఈ రాశి వారు లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకోవడం మేలు చేస్తుంది.
తుల రాశి: తుల రాశి వారు ఈరోజు అభిప్రాయం బేధాలను ఎదుర్కొంటారు. అనవసరమైన నిందారోపణల పాలవుతారు. జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశి వారు మహా గణపతిని దర్శించడం మంచిది.
వృశ్చిక రాశి: ఈ రాశి వారు ఈరోజు కొన్ని రకాల శుభవార్తలను అందుకుంటారు. చేపట్టిన పనులు జయప్రదం అవుతాయి. ఈ రాశి వారు విష్ణు సహస్ర సోత్ర పారాయణం మంచిది.
ధనుస్సు రాశి: ధనుస్సు రాశి వారు చేపట్టిన పనులు కొంత ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అస్థిరమైన ఆలోచనలు ఒత్తిడికి గురి చేస్తుంటాయి. శివాభిషేకం మేలు చేస్తుంది.
మకర రాశి: ఈ రాశి వారికి సౌకర్యాల విషయంలో శుభఫలితాలను పొందుతుంటారు. స్థిరమైన నిర్ణయాలు మంది ఫలితాలను ఇస్తుంది. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం శుభ ఫలితాలను కలుగజేస్తుంది.
కుంభ రాశి: కుంభ రాశి వారు చేపట్టిన పనుల్లో పెద్దవారు సహకరిస్తారు. చేపట్టిన కార్యక్రమాల్లో కొన్ని మంచి మంచి ప్రయోజనాలు ఉంటాయి. మహాగణపతికి గరికను సమర్పించడం శుభప్రదం.
మీన రాశి: మీన రాశి వారికి ఈరోజు కుటుంబ పరమైన కార్యక్రమాల్లో చర్యలు చేయవలసిన అవసరం ఏర్పడుతుంది. ముఖ్యంగా జీవిత భాగస్వామితో కొన్ని రకాల మనస్పర్థలు ఏర్పడే అవకాశం ఉంది.. జాగ్రత్తగా వాటిని వ్యవహరించడం మంచిది. ఈ రాశి వారు ఇంద్ర కృత మహాలక్ష్మి స్త్రోత్రం పారాయణం చేయడం మంచిది. Also Read: