Ayodhya ram mandir: అయోధ్య రామాలయ నిర్మాణం.. భారీగా విరాళం ప్రకటించిన మాజీ ముఖ్యమంత్రి కోడలు..
Ayodhya ram mandir: అయోధ్యలో రామాలయం నిర్మాణానికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా రామమందిరం కోసం ఉత్తరప్రదేశ్..
Ayodhya ram mandir: అయోధ్యలో రామాలయం నిర్మాణానికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా రామమందిరం కోసం ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాది పార్టీ నాయకులు ములాయం సింగ్ యాదవ్ చిన్న కోడలు అపర్ణా యాదవ్ భారీగా విరాళం ప్రకటించారు. అయోధ్య రామాలయ నిర్మాణం కోసం తనవంతుగా రూ. 11 లక్షలు ఇస్తున్నట్లు ఆమె తెలిపారు. దీనికి సంబంధించిన చెక్కును రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నిర్వాహకులకు అపర్ణా యాదవ్ అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన అపర్ణా యాదవ్.. అయోధ్యలో రామాలయ నిర్మాణానికి నిధుల సేకరణకు మద్ధతు పలికారు. రామాలయ నిర్మాణానికి తన వంతు సాయం చేయడం సంతోషంగా ఉందన్నారు. కాగా, సామాన్యులు మొదలు సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ఎంతోమంది ప్రముఖులు రామాలయం కోసం తమ వంతుగా భారీ విరాళాలు ప్రకటిస్తున్నారు.
ఇదిలాఉండగా, రామ మందిరం నిర్మాణం కోసం ట్రస్ట్ నిర్వాహకులు ఇప్పటికే దేశ వ్యాప్తంగా విరాళాలను సేకరించారు. దాదాపు రూ. 1500 కోట్లకు పైగా విరాళాలు వచ్చినట్లు ట్రస్ట్ నిర్వాహకులు ప్రకటించారు. మరోవైపు అయోధ్య రామాలయం నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మూడేళ్లలో ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేయాలని ట్రస్ట్ నిర్ణయించింది.
Aditya Tiwari Tweet:
मुलायम सिंह यादव की छोटी बहू अपर्णा यादव ने राम मंदिर निर्माण के लिए धन संग्रह अभियान में दिए 11 लाख रुपए pic.twitter.com/gO88CVZywd
— आदित्य तिवारी (Aditya Tiwari) (@aditytiwarilive) February 19, 2021
Also read:
Social Media: సోషల్ మీడియా సంస్థలపై కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం.. ప్రతిపాదనలు సిద్ధం.. త్వరలోనే..