Social Media: సోషల్ మీడియా సంస్థలపై కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం.. ప్రతిపాదనలు సిద్ధం.. త్వరలోనే..
Social Media: అన్నం తినకుండా ఉండగలరేమో.. సోషల్ మీడియా లేకుండా మాత్రం ఉండలేని స్థితిలో ప్రజలు ఉన్నారనడంతో అతిశయోక్తి లేదు.
Social Media: అన్నం తినకుండా ఉండగలరేమో.. సోషల్ మీడియా లేకుండా మాత్రం ఉండలేని స్థితిలో ప్రజలు ఉన్నారనడంతో అతిశయోక్తి లేదు. ప్రస్తుత సాంకేతిక ప్రపంచంలో మనిషి జీవితాన్ని సోషల్ మీడియా అంతలా ప్రభావితం చేస్తోంది. అయితే, సోషల్ మీడియాలో మంచితో పాటే.. చెడు కీడు చేసే అంశాలు కూడా చెక్కర్లు కొడుతున్నాయి. ఈ మధ్య కాలంలో మరీ ఎక్కువగా మారింది. దాంతో భారత ప్రభుత్వం సోషల్ మీడియాపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. వివాదాలకు, విధ్వేషాలకు కారణమవుతున్న సోషల్ మీడియాను నియంత్రించాలని ఫిక్స్ అయ్యింది. ఆ క్రమంలోనే కీలక అడుగులు వేస్తోంది కేంద్ర ప్రభుత్వం. సోషల్ మీడియా సంస్థలను కట్టడి చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం సమాచర చట్టం 2011లోని సెక్షన్ 79 కీలక సవరణలు చేయాలని భావిస్తోంది. దానికి సంబంధించి ప్రతిపాదనలను రూపొందిస్తోంది. ముఖ్యంగా వినియోగదారుల ఫిర్యాదులపై దృష్టి సారించిన కేంద్రం.. వారి అభ్యర్థనలను సోషల్ మీడియా సంస్థలు పరిగణలోకి తీసుకునేలా చట్టంలో సవరణలు చేయనుంది. దీని ప్రకారం.. ఫేస్‌బుక్, ట్విటర్, వాట్సప్, ఇన్‌స్టాగ్రమ్ వంటి సోషల్ మీడియా సంస్థలు వినియోగదారుల అభ్యర్థనలు తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు.. తక్షణమే స్పందించి సమస్య పరిష్కారానికి కృషి చేయాల్సి ఉంటుంది.
Also read:
Uttar Pradesh Accident : పెళ్లి కోసం సంతోషంగా ఊరేగింపుగా వెళ్తోన్న వధువు.. అంతలోనే విషాద ఘటన
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఏకగ్రీవాలపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు.. ఆ అధికారం ఎస్ఈసీకి లేదన్న ధర్మాసనం