AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సైబర్ వలకు ఇద్దరు వైద్యుల విలవిల.. ఓటీపీ అడిగారు.. లక్షలు కొల్లగొట్టారు.. మాటలతో మభ్యపెట్టి ముంచేసారు..

రోజు రోజుకు సైబర్ నేరగాళ్లు చెలరేగిపోతున్నారు. అమాయకులను మాటల్లో పెట్టి బోల్తాకొట్టించి కష్టపడిన సొమ్మును సులువుగా దోచేస్తున్నారు.

సైబర్ వలకు ఇద్దరు వైద్యుల విలవిల.. ఓటీపీ అడిగారు.. లక్షలు కొల్లగొట్టారు.. మాటలతో మభ్యపెట్టి ముంచేసారు..
uppula Raju
|

Updated on: Feb 20, 2021 | 8:27 AM

Share

రోజు రోజుకు సైబర్ నేరగాళ్లు చెలరేగిపోతున్నారు. అమాయకులను మాటల్లో పెట్టి బోల్తాకొట్టించి కష్టపడిన సొమ్మును సులువుగా దోచేస్తున్నారు. తాజాగా ఒడిశాలోని కటక్‌లో ఇద్దరు వైద్యులపై తమ ప్రతాపం చూయించారు. ఓటీపీ అడిగా ఏకంగా కోటికి పైగా దోచేసారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన ఇప్పుడు పోలీసులకు సవాల్‌గా మారింది. వారు తెలిపిన వివరాల ప్రకారం..

కటక్‌ సీడీఏ ప్రాంతంలో ఉంటున్న విశ్రాంత వైద్యుడు మహంతికి ఈ నెల 9వ తేదీన ఫోన్‌కాల్‌ వచ్చింది. మీ సెల్‌ఫోన్‌లో ఉన్న బీఎస్‌ఎన్‌ఎల్‌ సిమ్‌ కేవైసీ చేయలేదని, బ్లాక్‌ చేస్తామని ఫోన్‌లో చెప్పారు. అలా కాకుండా ఉండాలంటే వెంటనే కేవైసీ అప్‌డేట్‌ చేయాలని సూచించారు. కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదని, తాము పంపించే యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకొని కేవైసీ చేసుకోవచ్చని చెప్పారు. దీంతో వారు చెప్పినట్లు ఆయన యాప్‌ డౌన్‌లోడ్‌ చేశారు. అందులో ఏటీఎం కార్డు నెంబరు లోడ్‌ చేయాలని సూచించారు. అలా నెంబరు ఎంటర్‌ చేసిన తర్వాత ఆయన ఫోన్‌కు ఓటీపీ వచ్చింది. ఓటీపి నెంబరు చెప్పాలని ఫోన్‌ చేసిన వ్యక్తి కోరడంతో వైద్యుడు నెంబరు చెప్పారు. ఆరోజు సాయంత్రానికి ఏటీఎం కార్డు బ్లాక్‌ అయింది. దీంతో వైద్యుడు మరునాడు బ్యాంకుకి వెళ్లి ఏటీఎం కార్డు బ్లాక్‌ అయిన విషయం బ్యాంకు అధికారులకు తెలిపాడు. మరో కొత్త ఏటీఎం కోసం దరఖాస్తు నింపి ఇవ్వాలని, వారం రోజుల్లోగా ఏటీఎం కార్డు ఇంటికి వస్తుందని బ్యాంకు సిబ్బంది చెప్పారు. ఇంటికి వచ్చేసిన వైద్యుడు బుధవారం డబ్బుల కోసం బ్యాంకుకు వెళ్లాడు. ఆయన ఖాతా నుంచి రూ.77,86,727 మాయమైనట్లు తెలుసుకొని బ్యాంకు అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అలాగే, తన ఖాతా నుంచి రూ.52 లక్షలు మాయమైనట్లు మరో ఆయుర్వేద వైద్యుడు ఠాణాలో ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నైజీరియాకు చెందిన బీమా సంస్థ ఎక్కువ మొత్తం ప్రలోభ పెట్టడంతో ఆయుర్వేద వైద్యుడు తొలుత రూ.30 లక్షలు తన ఖాతా నుంచి బీమా సంస్థకు బదిలీ చేశారు. కొద్ది రోజుల తర్వాత ఆయన తన బ్యాంకు ఖాతా పరిశీలించగా బదిలీ చేసిన మొత్తం కాకుండా మరో రూ.22 లక్షలు బీమా సంస్థకు అదనంగా బదిలీ అయినట్లు తేలింది. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Tiger Roaming Villages : గ్రామాల్లో సంచరిస్తున్న పెద్దపులి.. పశువులపై దాడి.. వణికిపోతున్న జనాలు..

Follow Us
ఒకే ఫ్రేమ్‌లో 120 మంది.. వనపర్తి జిల్లాలో ఐదు తరాల అపురూప సంగమం
ఒకే ఫ్రేమ్‌లో 120 మంది.. వనపర్తి జిల్లాలో ఐదు తరాల అపురూప సంగమం
ఎంపీ, ఎమ్మెల్యేల దెబ్బతో సోనియాతో దీదీ కీలక భేటీ!
ఎంపీ, ఎమ్మెల్యేల దెబ్బతో సోనియాతో దీదీ కీలక భేటీ!
9 నిమిషాల్లో 50 కిలోమీటర్ల ప్రయాణం.. మెరుపు తీగల దూసుకుపోనుంది!
9 నిమిషాల్లో 50 కిలోమీటర్ల ప్రయాణం.. మెరుపు తీగల దూసుకుపోనుంది!
మొన్ననే బ్రేకప్ అన్నారు.. అప్పుడే మళ్లీ కలిసిపోయిన జయం రవి,కెనీషా
మొన్ననే బ్రేకప్ అన్నారు.. అప్పుడే మళ్లీ కలిసిపోయిన జయం రవి,కెనీషా
గిల్, రాహుల్‌లు కాదు.. అతడే టీమిండియా టెస్ట్ బ్యాటర్
గిల్, రాహుల్‌లు కాదు.. అతడే టీమిండియా టెస్ట్ బ్యాటర్
ఇంజనీరింగ్‌ అడ్మిషన్లు మొదలవుతున్నాయ్‌.. జూన్‌ 19 నుంచే ప్రారంభం
ఇంజనీరింగ్‌ అడ్మిషన్లు మొదలవుతున్నాయ్‌.. జూన్‌ 19 నుంచే ప్రారంభం
వద్దన్నా డబ్బే డబ్బు..ఈశాన్యంలో ఈ 3వస్తువుల పెడితే కోట్ల సంపద
వద్దన్నా డబ్బే డబ్బు..ఈశాన్యంలో ఈ 3వస్తువుల పెడితే కోట్ల సంపద
ఆటోలోనే ఆర్తనాదం.. వెనుతిరగబోతుండగా ట్విస్ట్!
ఆటోలోనే ఆర్తనాదం.. వెనుతిరగబోతుండగా ట్విస్ట్!
మీరు చేతులు కట్టుకునే విధానమే..మీ క్యారెక్టర్‌ ఎలాంటిదో చెప్తుంది
మీరు చేతులు కట్టుకునే విధానమే..మీ క్యారెక్టర్‌ ఎలాంటిదో చెప్తుంది
ఏజెంట్ల ద్వారా ట్రైన్‌ టికెట్స్‌ బుక్‌ చేస్తున్నారా?
ఏజెంట్ల ద్వారా ట్రైన్‌ టికెట్స్‌ బుక్‌ చేస్తున్నారా?