AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: ఈ రాశి వారు ఈరోజు ప్రయాణాలు చేసేప్పుడు జాగ్రత్తగా ఉండాలి.. సోమవారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today: నేడు మరో వారం మొదలైంది. ఈ నేపథ్యంలో మనలో చాలా మంది కొత్త పనులు ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తుంటం. అదే సమయంలో కొన్ని ప్రయాణాలను కూడా ప్లాన్‌ చేసుకుంటుంటాం. అయితే..

Horoscope Today: ఈ రాశి వారు ఈరోజు ప్రయాణాలు చేసేప్పుడు జాగ్రత్తగా ఉండాలి.. సోమవారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
Narender Vaitla
|

Updated on: Feb 22, 2021 | 6:57 AM

Share

Horoscope Today: నేడు మరో వారం మొదలైంది. ఈ నేపథ్యంలో మనలో చాలా మంది కొత్త పనులు ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తుంటం. అదే సమయంలో కొన్ని ప్రయాణాలను కూడా ప్లాన్‌ చేసుకుంటుంటాం. అయితే కొత్త రోజు, కొత్త వారాన్ని ప్రారంభించే క్రమంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అంతా మంచే జరుగుతుంది. ముఖ్యంగా రాశి ఫలాల ఆధారంగా మన రోజును ప్రారంభించుకోవాలని చాలా మంది భావిస్తుంటారు. మరి ఈ సోమవారం ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి. ఎలాంటి విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి లాంటి వివరాలను ఈరోజు రాశి ఫలాల్లో చూద్దాం.

మేష రాశి:

మేష రాశి వారు ఈరోజు చేపట్టిన పనులు చాలా సంతోషంగా పూర్తి చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఈ రాశి వారు తెలుపు పుష్పాలను సేకరించిన పరమేశ్వరుడిని పూజించడం మంచిది.

వృషభ రాశి:

ఈ రాశి వారు ఈరోజు ఆరోగ్య సంబంధిత విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. వృషభ రాశి వారు పరమేశ్వరుడికి పంచామృతాలు సమర్పించుకోవడం వల్ల మేలు జరగుతుంది.

మిథున రాశి:

మిథున రాశి వారు చేప్టటిన పనుల్లో కొన్ని రకాల ఒత్తిడులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. ఒప్పందాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్లాలి. శ్రీవెంకటేశ్వర స్వామిని దీపారదణ చేసుకోవడం ఈ రాశి వారు సూచించదగ్గ అంశం.

కర్కాటక రాశి:

ఈ రాశి వారు ఈరోజు తాము చేసిన శ్రమకు తగ్గ ఫలితం పొందుతారు. నూతన ఉద్యోగాల విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. గో సేవ చేసుకోవడం ద్వారా ఈ రాశి వారికి శుభ ఫలితం ఉంటుంది.

సింహ రాశి:

సింహ రాశి వారు ఈరోజు చేపట్టిన పనుల్లో కొన్ని వ్యవహారిక ఇబ్బందులు కనిపిస్తున్నాయి. జాగ్రతగా వాటిని అధిగమించే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. దేవాలయంలో స్వామి వారి ఆరాదణకు రాగి వస్తువులు సమర్పించుకుంటే మంచి ఫలితం లభిస్తుంది.

కన్య రాశి:

ఈ రాశి వారు సంఘంలో మంచి శుభఫలితాలు అందుకుంటారు. అలాగే కొన్ని అనుకోని వస్తువులను కొనుగోలు చేయడానికి ఆలోచనలు ప్రారంభిస్తారు. ఈ రాశి వారికి ఈరోజు లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం మేలు చేస్తుంది.

తుల రాశి:

తుల రాశి వారికి ఈరోజు నూతన వ్యక్తులతో పరిచయాలు అవుతుంటాయి. వీరు ఈరోజు వాహనం కొనుగోలు చేసే అవకాశాలున్నాయి. మహా లక్ష్మీ ఆరాదణ ఈ రాశుల వారికి మంచి ఫలితాలను కలిగిస్తుంది.

వృశ్చిక రాశి:

ఈ రాశి వారికి ఈరోజు కుటుంబంలో కొన్ని చికాకులు, సమస్యలు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రయాణాలు చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆరాదణ ఈ రాశి వారికి మేలు చేస్తుంది.

ధనుస్సు రాశి:

ధనుస్సు రాశి వారికి ఈరోజు శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. ముఖ్యమైన వార్తలు వినే అవకాశాలున్నాయి. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మహాలక్ష్మీ అమ్మవారికి గులాబీ పుష్పాలు సమర్పణ చేసుకోవడం మేలు చేస్తుంది.

మకర రాశి:

ఈ రాశి వారు తమ శక్తికి మించిన పనులను చేపడుతుంటారు. కష్టమైన కార్యక్రమాల్లో కొంత మేర ఒత్తిడికి గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. విలువైన వస్తువుల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మహా లక్ష్మి వారికి చక్కెర పొంగలి నివేదన చేసుకోవడం మంచిది.

కుంభ రాశి:

కుంభ రాశి వారు ఈ రోజు సన్నిహితుల నుంచి ఆశించిన సహాయాన్ని పొందుతుంటారు. అలాగే అప్పుల విషయంలో ఒత్తిడులు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఈ రాశి వారికి.. కుజ గ్రహ స్తోత్ర పారాయణం సూచించదగ్గ అంశం.

మీన రాశి:

ఈ రాశి వారికి ఈరోజు దూర ప్రాంతాల నుంచి ఆహ్వానలు అందుతుంటాయి. వాహన సౌక్యాలు ఉన్నాయి. ముఖ్యమైన విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండడం మంచిది. శ్రీవెంకటేశ్వర స్వామి వజ్ర కవచ స్తోత్ర పారాయణం చేయడం ఈ రాశుల వారికి మంచి ఫలితాన్ని అందిస్తాయి.

Also Read: vaishnavi devi history: వైష్ణవి దేవి చరిత్ర ఏమిటి? అమ్మవారి దేవాలయం ఎక్కడ ఉందంటే..