వరవరరావుకు ఎట్టకేలకు బెయిలు మంజూరు.. గోరేగావ్ కుట్ర కేసులో ఏడాది కాలంగా జైలు జీవితాన్ని గడుపిన విప్లవ కవి

ప్రముఖ విప్లవ కవి, రచయిత, విప్లవ రచయితల సంఘం నేత వరవరరావుకు ఎట్టకేలకు బెయిల్‌ మంజూరైంది. ఆయనకు షరతులతో కూడిన..

వరవరరావుకు ఎట్టకేలకు బెయిలు మంజూరు.. గోరేగావ్ కుట్ర కేసులో ఏడాది కాలంగా జైలు జీవితాన్ని గడుపిన విప్లవ కవి
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Feb 22, 2021 | 12:03 PM

ప్రముఖ విప్లవ కవి, రచయిత, విప్లవ రచయితల సంఘం నేత వరవరరావుకు ఎట్టకేలకు బెయిల్‌ మంజూరైంది. ఆయనకు షరతులతో కూడిన మెడికల్ బెయిల్‌ను ముంబై హైకోర్టు మంజూరు చేసింది. వరవరరావును 2018 జూన్‌ 18న చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(యూఏపీఏ) కింద ఎన్ఐఏ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

గోరేగావ్ కుట్ర కేసులో అరెస్ట్ అయి, దాదాపు ఏడాది కాలంగా జైలు జీవితాన్ని గడుపుతున్న విప్లవ కవి కవివరవరరావు ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ముంబై హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆరు నెలల పాటు వైద్యుల పర్యవేక్షణలోనే ఉండాలని కోర్టు వెల్లడించింది.

అయితే వరవరరావు ముంబై విడిచి ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదని కోర్టు షరతు విధించింది. ఇటీవల వరవరరావు ఆరోగ్యం బాగా క్షీణించింది. కరోనా కూడా సోకింది. నరాల సంబంధిత వ్యాధులతో పాటు ఇతర అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు.

తనపై ఆరోపణలు ఉన్న కేసు విచారణకు సంబంధించి పోలీసులకు సహకరించాలని, సాక్ష్యాల తారుమారుకు ప్రయత్నిస్తే బెయిల్ ను రద్దు చేస్తామని వరవరరావును న్యాయమూర్తి హెచ్చరించారు. నేటి సాయంత్రం లోగా బెయిల్ పేపర్లను జైలు అధికారులకు అందించి, విడుదలయ్యేలా చూస్తామని ఆయన తరఫు న్యాయవాదులు వెల్లడించారు.