రైతులకు గుడ్‏న్యూస్ అందించిన కేంద్రం.. వారి అకౌంట్లలోకి మళ్లీ రూ.2వేలు.. ఎప్పటినుంచో తెలుసా..

కేంద్ర ప్రభుత్వం రైతులకు మరోసారి గుడ్ న్యూస్ అందించింది. రైతుల కోసం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీం తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ప్రతి సంవత్సరం రూ.600 వరకు లభిస్తాయి.

రైతులకు గుడ్‏న్యూస్ అందించిన కేంద్రం.. వారి అకౌంట్లలోకి మళ్లీ రూ.2వేలు.. ఎప్పటినుంచో తెలుసా..
Follow us

|

Updated on: Feb 22, 2021 | 11:47 AM

PM Samman Nidhi Scheme: కేంద్ర ప్రభుత్వం రైతులకు మరోసారి గుడ్ న్యూస్ అందించింది. రైతుల కోసం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీం తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ప్రతి సంవత్సరం రూ.600 వరకు లభిస్తాయి. అయితే ఈ డబ్బులు ఒకేసారి కాకుండా విడతల వారిగా రైతుల అకౌంట్లలోకి వస్తాయి. దీంతో సంవత్సరానికి మూడు విడతల్లో రూ.వేలు రైతులకు అందుతాయి.

ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రైతుల అకౌంట్లలోకి 7 విడతల డబ్బులను అందించింది. ఇక 8వ విడతల డబ్బులను అందించేందుకు కేంద్రం సన్నద్ధమవుతుంది. అయితే ఈ డబ్బులు మార్చి నెలలో అకౌంట్లలోకి వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ డబ్బులు వచ్చే ముందు మీ పేరు బెనిఫీసియరీ లిస్టులో ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఒక వేళ ఆ లిస్టులో పేరు లేకపోతే డబ్బులు రావు. కేవలం అందులో ఉన్నవారికి మాత్రమే డబ్బులు జమ చేయబడతాయి. ఇందుకోసం పీఎం కిసాన్ వెబ్ సైట్‏ను సందర్శించాల్సి ఉంటుంది. మీకు ఫార్మర్స్ కార్నర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిని సెలక్ట్ చేసుకొని బెనిఫీషియరీ లిస్ట్ ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. ఆ తర్వాత మీ స్టేట్, జిల్లా, ఊరు పేరు ఎంటర్ చేసి మీ పేరు ఆ లిస్టులో ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు పీఎం కిసాన్ స్కీంలో చేరకపోతే.. ఇప్పుడు కూడా ఆన్ లైన్ లోనే ఈ పథకంలో చేరొచ్చు. అందుకోసం మీ బ్యాంక్ అకౌంట్, పొలం పాస్ బుక్, ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది. మరీ ఆలస్యం చేయకుండా మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. అలాగే ఇప్పటివరకు ఈ స్కీంలో చేరి ఉండకపోతే వెంటనే చేరండి.

Also Read: PM Kisan: పీఎం కిసాన్… న‌గ‌దు మీ ఖాతాల్లో పడ్డాయో లేదో… ఇలా చెక్ చేసుకోండి…