Tata Safari 2021 : మార్కెట్ లోకి సరికొత్త లుక్‌తో రాజహంసలా వచ్చిన టాటా సఫారీ..ప్రారంభ ధర ఏంటంటే..!
కొత్త 2021 టాటా సఫారి న్యూ లుక్ లో మార్కెట్ లోకి వచ్చేసింది. సోమవారం ఉదయం సఫారీని టాటా సంస్థ రిలీజ్ చేసింది. ఈ టాటా సఫారిని గత నెల రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా ఆవిష్కరించారు...
Tata Safari 2021 : కొత్త 2021 టాటా సఫారి న్యూ లుక్ లో మార్కెట్ లోకి వచ్చేసింది. సోమవారం ఉదయం సఫారీని టాటా సంస్థ రిలీజ్ చేసింది. ఈ టాటా సఫారిని గత నెల రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా ఆవిష్కరించారు. ఫిబ్రవరి ఫస్ట్ నుంచి రూ. 30 వేలకు బుకింగ్స్ కూడా తీసుకుంది. ఇక వెహికిల్ ను లాంచ్ చేసిన అనంతరం దీని ధరను సంస్థ ప్రకటించింది. 14.69 లక్షల నుండి ప్రారంభమయ్యి.. 21.25 లక్షల షో రూమ్ వరకూ వెళ్లనున్నదని తెలుస్తోంది. ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న ఎంజీ హెక్టార్ ప్లస్, మహీంద్రా ఎక్స్‌యూవీ 500, జీప్ కంపాస్‌లతో సఫారీ పోటీ పడనుంది.
ఈ కొత్త సఫారీ మొత్తం మూడు రంగుల్లో 9 వేరియంట్లలో అందుబాటులో ఉండనుంది. ఇందులో ఎక్స్ఈ అనేది బేస్ వేరియంట్. ఇందులో రెండు ఎయిర్ బ్యాగులు, అన్ని డిస్క్ బ్రేకులు ఉంటాయి. ఇక ఆ తర్వాతి వేరియంట్ అయిన ఎక్స్ఎంలో మల్టీ డ్రైవ్ మోడ్‌లు, టచ్‌స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటాయి. ఇక తర్వాతి ఎక్స్‌టీ మోడల్‌లో ఫుల్లీ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్‌తోపాటు పనోరమిక్ సన్‌రూఫ్ ఉండనున్నాయి. టాప్ మోడల్ అయిన ఎక్స్‌జెడ్‌లో ఆరు ఎయిర్ బ్యాగులు, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్స్, 8.8 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్, 9 జేబీఎల్ స్పీకర్లు, సబ్‌వూఫర్, జినాన్ హెచ్ఐడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్ ఉంటాయి.
Also Read: