గోల్డ్ లోన్ తీసుకునేవారికి SBI బంపర్ ఆఫర్.. వారికోసం 2 లాభాలు అందుబాటులోకి.. ఎంటో తెలుసుకుందామా..

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు ఎప్పటికప్పుడు అదిరిపోయే ఆఫర్లను అందిస్తుంది. బంగారం పై లోన్ తీసుకునే వారికి ఎస్బీఐ అదిరిపోయే రెండు లాభాలను అందిస్తుంది. దీంతో గోల్డ్ లోన్

గోల్డ్ లోన్ తీసుకునేవారికి SBI బంపర్ ఆఫర్.. వారికోసం 2 లాభాలు అందుబాటులోకి.. ఎంటో తెలుసుకుందామా..
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 22, 2021 | 1:46 PM

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు ఎప్పటికప్పుడు అదిరిపోయే ఆఫర్లను అందిస్తుంది. బంగారం పై లోన్ తీసుకునే వారికి ఎస్బీఐ అదిరిపోయే రెండు లాభాలను అందిస్తుంది. దీంతో గోల్డ్ లోన్ తీసుకునే వారికి మంచి బెనిఫిట్ కలుగనుంది. అదేంటంటే..

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో బంగారం పై లోన్ తీసుకోవాలనుకునేవారు కేవలం ఒకే ఒక్క సరిపోతుంది. దీంతోపాటు పసిడి లోన్ కింద గరిష్టంగా రూ.50 లక్షల వరకు ఆదాయం పొందొచ్చు. ఈ ఆఫర్ గతంలో కేవలం రూ.20 లక్షలు మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు దానికి రెట్టింపు ఆఫర్ అందిస్తుంది ఎస్బీఐ. ఇందులో గోల్డ్ లోన్ రూ.20 వేల నుంచి పొందవచ్చు. గోల్డ్ లోన్ తీసుకోవాలనుకునేవారు 7208933143 నంబరుకు మిస్ట్ కాల్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా మిస్డ్ కాల్ ఇచ్చిన తర్వాత బ్యాంక్ అధికారులు తిరిగి మీకు కాల్ చేస్తారు. ఆ తర్వాతా మీరు గోల్డ్ లోన్ పొందవచ్చు. ఈ లోన్ పై వడ్డీ రేటు 7.5 శాతంగా ఉంటుంది. అంతేకాకుండా గోల్డ్ లోన్స్ పై ఇది తక్కువ వడ్డీ రేటు అని చెప్పొచ్చు. ఇవే కాకుండా గోల్డ్ లోన్ పై ప్రాసెసింగ్ ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. బంగారం పై లోన్‏ను 18 సంవత్సరాల వయసున్న వారు కూడా తీసుకోవచ్చు. ఇందుకోసం రెండు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు, ఆధార్ కార్డు, పాన్ కార్డు వంటివి తీసుకెళ్లాల్సి ఉంటుంది. జాయింట్ అకౌంట్ ఉన్నవారు కూడా ఈ గోల్డ్ లోన్ పొందవచ్చు. ఇందుకు ఎలాంటి ఇన్ కమ్ ప్రూఫ్ సమర్పించాల్సిన అవసరం లేకుండా క్షణాల్లో గోల్డ్ లోన్ పొందవచ్చు. మరీ ఇంకెందుకు ఆలస్యం ఇన్ని రోజులుగా గోల్డ్ లోన్ తీసుకోవాలనుకున్న ఎస్బీఐ కస్టమర్లు ఇక నుంచి క్షణాల్లో పొందవచ్చు.

Also Read:

రైతులకు గుడ్‏న్యూస్ అందించిన కేంద్రం.. వారి అకౌంట్లలోకి మళ్లీ రూ.2వేలు.. ఎప్పటినుంచో తెలుసా..