Naming Alexa : అమెరికన్లకు అమెజాన్ తెచ్చిన తంట.. ఆ పేరు పెట్టుకోవడమే తగ్గించారట..!

పిల్లలు పుట్టగానే మంచి పేరు పెట్టుకోవాలని చూస్తారు తల్లిదండ్రులు. ఇందు కోసం ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్నవాటినే ఎంచుకుంటారు.

Naming Alexa : అమెరికన్లకు అమెజాన్ తెచ్చిన తంట.. ఆ పేరు పెట్టుకోవడమే తగ్గించారట..!
Follow us
Balaraju Goud

|

Updated on: Feb 22, 2021 | 1:51 PM

పిల్లలు పుట్టగానే మంచి పేరు పెట్టుకోవాలని చూస్తారు తల్లిదండ్రులు. ఇందు కోసం ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్నవాటినే ఎంచుకుంటారు. లేదా ఆదర్శంగా నిలిచిన వ్యక్తుల పేర్లను సైతం తమ పిల్లలకు పెడుతుంటారు. అయితే, అమెజాన్ దెబ్బకు ఆ పేరు పెట్టుకునేందుకు అమెరికన్లు వెనకడుగు వేస్తున్నారు. ఎందుకంటారా.. ఈ స్టోరీ చూడండి…

అలెక్సా..అమెజాన్‌ తెచ్చిన ఒక పాపులర్‌ వర్చువల్‌ అసిస్టెంట్‌. అంటే తెలగులో చెప్పాలంటే డిజిటల్‌ పనిమనిషి. సాధారణంగా కంపెనీలు తమ కొత్తకొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి తెచ్చినప్పుడు వాటికి రకరకాల కొత్త పేర్లు పెడుతుంటాయి. మార్కెట్లో ఇట్టే వినియోగదారులను అక్కట్టుకునేందుకు వాడుకలో ఉండేలా పదాలతో పేర్లను వాడుతుంటారు. దీంతో తదనంతర కాలంలో ఉత్పత్తి ప్రాచుర్యాన్ని బట్టి ఆయా కొత్తపేర్లూ పాపులర్‌ అవుతాయి.

ఇదే క్రమంలో.. 2014లో అమెజాన్‌ మార్కెట్లోకి తన వర్చువల్‌ అసిస్టెంట్‌ను తెచ్చినప్పుడు దానికి అప్పటికే అమెరికాలో ప్రాచుర్యంలో ఉన్న ఒక పేరును పెట్టింది.. అలెక్సా అని.. అప్పట్లో అమెరికాలోని ఆడపిల్లలకు ఎక్కువగా పెట్టే పేర్లలో అలెక్సా కూడా ఒకటి. అయితే, అమెజాన్ వారి ప్రొడక్ట్‌ పాపులర్‌ అయింది.. కానీ, ఆ పేరు మాత్రం అన్‌పాపులర్‌ అయింది..

యూఎస్‌ సోషల్‌ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్‌ ప్రకారం 2015లో అమెరికాలో పుట్టిన పిల్లల్లో 6,052 మందికి అలెక్సా అనే పేరు పెడితే.. 2019 సరికి అ పేరు పెట్టేవారి సంఖ్య 1995కి తగ్గిపోయిందట. 2015లో ఆడపిల్లలకు పెట్టే పాపులర్‌ పేర్లలో అలెక్సా 32వ స్థానంలో ఉండగా.. నాలుగేళ్లలో అది 139వ స్థానానికి పడిపోయింది. ఎందుకంటే.. పిల్లలకు అలెక్సా అనే పేరు పెడితే.. జీవితాంతం ఆ పేరు ఒక డిజిటల్‌ పనిమనిషి పేరుతో ముడిపడి ఉన్నట్లే అని భావిస్తున్నారట. దీంతో రానురానూ ఆ పేరును పెట్టడం మానేసే పరిస్థితి వస్తుందని చెబుతున్నారు.

Read Also…  వీసాల విషయంలో లిఖితపూర్వక హామీ ఇవ్వాలి.. లేదంటే ప్రపంచకప్ వేదిక మార్చాల్సివస్తుంది.. భారత్ కు పాక్ హెచ్చరిక

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!