Video: మంటగలిసిన మానవత్వం.. ఏనుగుపై మావటివాళ్ల అమానుషం.. అరుస్తున్నా.. కొడుతూనే..!
Mahout Trashes Elephant: ఇద్దరూ మావటివాళ్లు ఏనుగును అమానుషంగా కొడుతున్న ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది...
Mahout Trashes Elephant: ఇద్దరూ మావటివాళ్లు ఏనుగును అమానుషంగా కొడుతున్న ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జాతీయ మీడియాలో వచ్చిన ఓ కథనం ప్రకారం ఈ ఘటన తమిళనాడులోని తెక్కంవట్టి ప్రాంతంలో చోటు చేసుకుంది. తమ ఆదేశాలను పట్టించుకోనందున వినీల్ కుమార్ అనే మావటి, అతడి అసిస్టెంట్ శివప్రసాద్ 19 సంవత్సరాల వయస్సు ఉన్న జయమాల్యతా అనే ఆడ ఏనుగును కర్రలతో కాళ్లపై కొట్టారు.
ఆ నొప్పిని భరించలేక ఆ మూగజీవి ఆర్తనాదాలు చేసింది. దీన్ని మొత్తాన్ని ఓ పర్యాటకుడు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. కొద్ది గంటల్లో వీడియో వైరల్ కావడంతో.. జంతు ప్రేమికులు, ప్రజలు ఆ వ్యక్తుల తీరుపై మండిపడుతున్నారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆ ఇద్దరి మావటివాళ్లను అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు.
Also Read: రెప్పపాటులో ఘోరం.. సెల్‌ఫోన్ మోజులో ఒకరు.. ర్యాష్ డ్రైవింగ్‌తో మరొకరు.. వీడియో వైరల్.!
Video surfaces of two mahouts attacking an #elephant at the #Thekkampatti rejuvenation camp for temple and mutt elephants in #Coimbatore. HR&CE Department to conduct an inquiry into the incident. @THChennai @OfficeofminSSR pic.twitter.com/sajTFOEmR6
— R. Akileish (@Akileish) February 21, 2021