రెప్పపాటులో ఘోరం.. సెల్‌ఫోన్ మోజులో ఒకరు.. ర్యాష్ డ్రైవింగ్‌తో మరొకరు.. వీడియో వైరల్.!

Road Accident: రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ఏమరపాటుగా ఉంటే తీరని నష్టం జరుగుతుందని చెప్పడానికి ఈ వీడియో చాలు. సీసీటీవీలో రికార్డయిన..

  • Ravi Kiran
  • Publish Date - 10:30 am, Mon, 22 February 21
రెప్పపాటులో ఘోరం.. సెల్‌ఫోన్ మోజులో ఒకరు.. ర్యాష్ డ్రైవింగ్‌తో మరొకరు.. వీడియో వైరల్.!

Road Accident: రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ఏమరపాటుగా ఉంటే తీరని నష్టం జరుగుతుందని చెప్పడానికి ఈ వీడియో చాలు. సీసీటీవీలో రికార్డయిన ఈ దృశ్యాలను సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఆదివారం ట్వీట్ చేశారు. హైదరాబాద్‌లోని జీడిమెట్ల ప్రాంతం చింతల్ ఏరియాలో ఈ ఘటన చోటు చేసుకుంది. వీడియో ప్రకారం.. నిర్లక్ష్య ధోరణిలో ఒక వ్యక్తి తన చేతిలోని వస్తువుపైనే పూర్తి ధ్యాస పెడుతూ.. మిగిలిన వాటి గురించి పట్టించుకోకుండా రోడ్డు దాటుతుంటే.. ఈలోపే వేగంగా వస్తున్న ఓ బైకర్ అతడిని బలంగా ఢీకొన్నాడు. దీనితో రోడ్డు దాటుతున్న వ్యక్తి, బైకర్ తలో దిక్కులో పడ్డారు.

బైక్‌పై ఉన్న వ్యక్తికి హెల్మెట్ లేకపోవడమే కాకుండా అతడు దురదృష్టవశాత్తు కారు టైర్ కింద పడ్డాడు. కారును డ్రైవర్ వెంటనే ఆపేసినా.. అతను మాత్రం కదలకుండా రోడ్డుపై అలానే పడిపోయి ఉన్నాడు. ఈ ఘటన హెల్మెట్ ఆవశ్యకతను మరోసారి చాటుతోంది. నెటిజన్లలో అవగాహన కల్పించేందుకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఈ వీడియోను ట్విట్టర్ వేదికగా షేర్ చేయగా.. అది కాస్తా వైరల్ అయి.. భిన్నాభిప్రాయాలను పొందుతోంది.