She Taxi Applications: షీ ట్యాక్సీల దరఖాస్తుకు ఆహ్వానం.. పూర్తి వివరాలకు ఎక్కడ సంప్రదించాలంటే..

She Taxy Applications In Hyderabad: ఉపాధి కల్పిండంతో పాటు నగరంలో మహిళలకు రక్షణ కల్పించడంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం షీ ట్యాక్సీ పథకాన్ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ట్యాక్సీ నడుపుకునే మహిళలకు..

She Taxi Applications: షీ ట్యాక్సీల దరఖాస్తుకు ఆహ్వానం.. పూర్తి వివరాలకు ఎక్కడ సంప్రదించాలంటే..
Follow us

|

Updated on: Feb 22, 2021 | 10:35 AM

She Taxi Applications In Hyderabad: ఉపాధి కల్పిండంతో పాటు నగరంలో మహిళలకు రక్షణ కల్పించడంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం షీ ట్యాక్సీ పథకాన్ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ట్యాక్సీ నడుపుకునే మహిళలకు వాహనాల కొనుగోలు కోసం సబ్సిడీ అందించే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ క్రమంలోనే తొలిసారిగా హైదరాబాద్‌ జిల్లాలో షీ ట్యాక్సీ పథకానికి శ్రీకారం చుట్టింది. ఇందుకు సంబంధించి అర్హులైన మహిళల నుంచి దరఖాస్తులను ఆహ్వానించారు. ఈ విషయాన్ని జిల్లా సంక్షేమాధికారి అక్కేశ్వర్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పథకం ద్వారా నిరుపేద కుటుంబాల్లోని మహిళలకు డ్రైవింగ్‌లో శిక్షణ ఇవ్వడంతో పాటు సబ్సీడీపై ట్యాక్సీలను అందించనున్నారు. 10వ అర్హత ఉండి, 18 ఏళ్లు నిండిన మహిళలకు ఈ పథకానికి అర్హులని అధికారులు తెలిపారు. ఈ పథకం ద్వారా ఎంపికైన మహిళలకు 35 శాతం సబ్సిడీ, 10 శాతం మార్జిన్‌ అమౌంట్‌తో మొత్తం 45 శాతం బ్యాంకు రుణంతో ట్యాక్సీలను అందించనున్నారు. ఇక అర్హత సాధించిన మహిళలకు నెల రోజుల పాటు డ్రైవింగ్‌లో శిక్షణ ఇచ్చి క్యాబ్‌ డ్రైవర్లుగా తీర్చిదిద్దనున్నారు. ఆసక్తి ఉన్న మహిళలు ఈ నెల 28లోపు దరఖాస్తు చేసుకోవాలని అక్కేశ్వర్‌ రావు సూచించారు. మరిన్ని వివరాలకు హైదరాబాద్‌ కలెక్టరేట్‌ కార్యాలయంలోని మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో లేదా సీడీపీవో కార్యాలయాల్లో సంప్రదించాలని తెలిపారు.

Also Read: Water Supply Alert: హైదరాబాద్‌లో పలు చోట్ల తాగునీటి సరఫరా నిలిపివేత.. ఏయో ప్రాంతాల్లో, ఏ రోజంటే..

బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు