AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Water Supply Alert: హైదరాబాద్‌లో పలు చోట్ల తాగునీటి సరఫరా నిలిపివేత.. ఏయో ప్రాంతాల్లో, ఏ రోజంటే..

Interruption For Water Supply In Hyderabad: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఈ నెల 24న (బుధవారం) పలు చోట్ల తాగునీటి సరఫరాను నిలివేస్తు్న్నట్లు జల మండలి అధికారులు తెలిపారు. కృష్ణా ఫేజ్‌-2 పైపులైన్‌ మరమ్మత్తుల కారణంగా...

Water Supply Alert: హైదరాబాద్‌లో పలు చోట్ల తాగునీటి సరఫరా నిలిపివేత.. ఏయో ప్రాంతాల్లో, ఏ రోజంటే..
Narender Vaitla
|

Updated on: Feb 22, 2021 | 8:26 AM

Share

Interruption For Water Supply In Hyderabad: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఈ నెల 24న (బుధవారం) తాగునీటి సరఫరా నిలివేస్తున్నట్లు జల మండలి అధికారులు తెలిపారు. కృష్ణా ఫేజ్‌-2 పైపులైన్‌ మరమ్మత్తుల కారణంగా నగరంలో తాగు నీటి సరఫరాను నిలిపివేయనున్నారు. హైదరాబాద్‌ మహా నగరానికి తాగునీటిని అందిస్తోన్న కృష్ణా ఫేజ్‌-2 1600 ఎంఎం మెయిన్‌ రింగ్‌-2 (ఎల్బీనగర్‌ నుంచి బావర్చి వరకు) పైప్‌లైన్‌కు జంక్షన్‌ పనులు చేపడుతున్నారు. ఈ కారణంగా ఈ నెల 24 ఉదయం 6.00 గంటల నుంచి ఉదయం 25న ఉదయం 6.00 వరకు నీటి సరఫరా నిలిపివేయనున్నారు. నగరంలో నీటి సరఫరా నిలిపివేయనున్న ప్రాంతాలు ఇవే.. మైసారం, మేకలమండి, భోలక్‌పూర్‌, తార్నాక, లాలాపేట్‌, మారెడ్‌పల్లి, కంట్రోల్‌ రూమ్‌, రైల్వేస్‌, ఎంఈఎస్‌, పాటిగడ్డ, హస్మత్‌పేట్‌, బీఎన్‌రెడ్డినగర్‌, బార్కాస్‌, వైశాలినగర్‌, ప్రకాశ్‌నగర్‌, మీర్‌పేట్‌, వనస్థలిపురం, మారూతీనగర్‌, రామాంతాపూర్‌, ఉప్పల్‌, ఆటోనగర్‌, నాచారం, హబ్సిగూడ, చిలుకానగర్‌, బీరప్పగడ్డ, బోడుప్పల్‌, బాలాపూర్‌, బౌద్దనగర్‌, బడంగ్‌పేట్‌, ఎలుగుట్ట, కంటోన్మెంట్‌, రిజర్వాయర్ల పరిధిలో నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. Also Read: రైల్వే ప్రయాణికులకు ముఖ్య గమనిక.. ఇప్పుడు ఆ సేవలు అన్ని స్టేషన్లలో ప్రారంభించారట.. వివరాలు ఇవిగో..